మహేష్ కోసం వంశీ పైడిపల్లి 'మహర్షి'లా తపస్సు చేయాల్సిందేనా...?
సూపర్ స్టార్ మహేష్ బాబు - వంశీ పైడిపల్లి కాంబినేషన్ లో 'మహర్షి' సినిమా వచ్చిన సంగతి తెలిసిందే. మహేష్ బాబు కెరీర్లో 25వ చిత్రంగా రూపొందిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఇదే ఊపులో వంశీ పైడిపల్లి నెక్స్ట్ సినిమా మళ్ళీ మహేష్ తోనే.. అది కూడా గ్యాంగ్ స్టర్ కథాంశం నేపథ్యంలో సినిమా అని అప్పట్లో వార్తలొచ్చాయి. ఈ ఏడాది ప్రారంభంలో 'సరిలేరు నీకెవ్వరు'తో మంచి విజయం అందుకున్న మహేష్ బాబు ఆ తర్వాత డైరెక్టర్ వంశీ పైడిపల్లితో సినిమా పట్టాలెక్కించాలనుకున్నాడు. కానీ ఏమి జరిగిందో తెలియదు గాని.. మహేష్ తన నెక్స్ట్ ప్రాజెక్ట్ కోసం 'గీత గోవిందం' డైరెక్టర్ పరశురామ్ ని లైన్లో పెట్టినట్లు న్యూస్ వచ్చింది. అంతే కాకుండా దర్శక ధీరుడు రాజమౌళి కూడా తన నెక్స్ట్ ప్రాజెక్ట్ మహేష్ బాబుతో ఉంటుందని అనౌన్స్ చేసేసాడు. దీనితో మహేష్ - వంశీ పైడిపల్లి మూవీ ఇప్పట్లో లేనట్టే అని ప్రచారం జరుగుతుంది.
మహేష్ - జక్కన్న ఈ ప్రాజెక్ట్ వచ్చే ఏడాది చివర్లో లేదా 2022 ప్రారంభంలో సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉంది. పరుశురాంతో మూవీ అంటున్నారు కాబట్టి అది 2021లో విడుదల అయ్యే అవకాశం ఉంది. మరి ఈ రెండు సినిమాల గ్యాప్ లో మహేష్ ఎన్ని సినిమాలు చేయగలడో చెప్పలేము. అంతే కాకుండా నెక్స్ట్ రాజమౌళి సినిమాలో జాయిన్ కావలసిన మహేష్ మరో సినిమాను ఒప్పుకుంటాడో లేదో అనే డౌట్. ఒకవేళ ఒప్పుకున్నా రాజమౌళి సినిమా ప్రారంభమయ్యే లోపు కుదిరితే త్రివిక్రమ్ తో ఒక సినిమా చేయాలని మహేష్ అనుకుంటున్నట్టు సమాచారం. రాజమౌళితో సినిమా అంటే ఎప్పుడు స్టార్ట్ అవుద్దో ఎప్పుడు కంప్లీట్ అవుద్దో చెప్పలేని పరిస్థితి. ఇక పరశురామ్, త్రివిక్రమ్, రాజమౌళి సినిమాలు పూర్తయ్యేసరికి ఇంకెంత సమయం పడుతుందో. 'మహర్షి' సినిమా మహేష్ బాబుతో తీయడానికి రెండేళ్లు వెయిట్ చేసిన వంశీ పైడిపల్లి.. త్రివిక్రమ్ ని పక్కన పెట్టి వంశీకి సినిమా ఇస్తాడని వెయిట్ చేస్తూ టైమ్ వేస్ట్ చేసుకునే అవకాశం లేదు. కాబట్టి మహేష్ బాబు - వంశీ పైడిపల్లి మూవీ ఇప్పట్లో లేనట్టే అని ప్రచారం టాలీవుడ్ వర్గాల్లో జరుగుతోంది.