బాలయ్య 105కు ఊహించని మలుపులు
జూన్ పూర్తయిపోతే నందమూరి బాలకృష్ణ మేకప్ వేసుకున్న గ్యాప్ ఆరు నెలలు దాటేస్తుంది. ఎన్టీఆర్ బయోపిక్ ఫలితంతో పాటు తాను ఎమ్మెల్యేగా గెలిచినా పార్టీ ఓడిపోవడంతో ఒకింత నిరాశతో ఉన్న బాలయ్య కొత్త సినిమా విషయంలో సస్పెన్సు ఎంతకూ తెగడం లేదు. ముందు బోయపాటి శీను అన్నారు. లేదు కథ రెడీ కాలేదు జైసింహతో సేఫ్ గేమ్ ఆడిన కెఎస్ రవికుమార్ బెటర్ అని తీసుకున్నారు.
తీరా కథ విషయంలో ఏకాభిప్రాయం రాక అదీ పెండింగ్ లో ఉండిపోయింది. అసలు తెరకెక్కుతుందా లేదా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. నిర్మాత సి కళ్యాణ్ కూడా మౌనాన్నే ఆశ్రయించారు. ఇప్పుడీ స్టోరీ కొత్త మలుపు తిరిగిందని ఇన్ సైడ్ టాక్. దాని ప్రకారం బాలయ్య మళ్ళీ బోయపాటి శీనుకే ఓటు వేశాడట. అయితే స్వంత నిర్మాణం కాకుండా దిల్ రాజు బ్యానర్ లో చేసేందుకు పావులు కదుపుతున్నట్టు సమాచారం. అందరు స్టార్లతో సినిమా చేసిన దిల్ రాజు ఇంత వరకు బాలయ్యతో ఏదీ నిర్మించలేదు.
సో ఆ కోరికా తీరుతుంది హిట్ కాంబోని రిపీట్ చేసినట్టు అవుతుందని దీన్ని ఓకే చేసినట్టు చెబుతున్నారు. మరి బోయపాటి ఇంతకు ముందు అనుకున్న కథతోనే కంటిన్యూ అవుతున్నాడా లేక ఏదైనా ఫ్రెష్ స్క్రిప్ట్ రాసుకున్నాడా అనే క్లారిటీ మాత్రం లేదు. ఏదో ఒకటి ప్రారంభోత్సవం జరిగితే తప్ప నమ్మలేని పరిస్థితి నెలకొంది. వరసగా సినిమాలు చేస్తూ నాన్ స్టాప్ బిజీగా ఉండే బాలకృష్ణ ఇంత గ్యాప్ తీసుకోవడం మాత్రం అభిమానులకు కొత్తే