కథలపై బాలయ్య ఫోకస్ మారిందా?
నందమూరి బాలకృష్ణ తన తర్వాతి సినిమాల విషయంలో రూటు మారుస్తున్నారు. వరుసగా కుర్ర దర్శకులతో సినిమాలు చేయడానికి మొగ్గు చూపుతున్నారని తెలుస్తోంది.;
నందమూరి బాలకృష్ణ తన తర్వాతి సినిమాల విషయంలో రూటు మారుస్తున్నారు. వరుసగా కుర్ర దర్శకులతో సినిమాలు చేయడానికి మొగ్గు చూపుతున్నారని తెలుస్తోంది. రెగ్యులర్ కమర్షియల్ సక్సెస్ కాంబినేషన్స్ కంటే ఫ్యూచర్ ప్రాజెక్టుల కోసం కంటెంట్ ఉన్న కుర్ర మేకర్స్ కోసం ఫోకస్ చేస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. నందమూరి బాలకృష్ణ ప్రయోగాలు చేయడానికి సిద్ధంగానే ఉన్నా ఆ రేంజ్ కు తగ్గట్టు కథలు సిద్ధం చేసే వారు తక్కువ.
ఇక ప్రస్తుతం కొత్త కాంబినేషన్స్ పై రకరకాల వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇప్పటికే సరిపోదా శనివారం దర్శకుడు వివేకా ఆత్రేయతో ఒక క్రైమ్ థ్రిల్లర్ కథపై చర్చలు జరుపుతున్నట్లు టాక్ వచ్చింది. ఈ దర్శకుడు రజినీకాంత్ తరువాత మళ్ళీ బాలయ్యపై ఫోకస్ పెంచినట్లు తెలుస్తోంది. మరోవైపు ‘నాంది’ సినిమాతో మంచి పేరు తెచ్చుకున్న విజయ్ కనకమేడల, రీసెంట్ గా బాలయ్యను కలిసి ఒక పవర్‌ఫుల్ పోలీస్ స్టోరీ వినిపించినట్లు గట్టిగా టాక్ వినిపిస్తోంది.
బాలయ్యకు పోలీస్ డ్రెస్ వేయడమంటే మామూలు విషయం కాదు, అందులోనూ విజయ్ తీసే సినిమాలు చాలా సీరియస్ గా, రఫ్ గా ఉంటాయి కాబట్టి ఈ కాంబినేషన్ మీద క్లారిటీ రాకముందే అంచనాలు పెరిగిపోతున్నాయి. అయితే విజయ్ అల్లరి నరేష్ తో తీసిన సినిమా ‘నాంది’ సూపర్ హిట్ అయినా, ఆ తర్వాత వచ్చిన ‘ఉగ్రం’ మాత్రం బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. దీంతో ఈ యంగ్ డైరెక్టర్ ఇప్పుడు బాలయ్య లాంటి పెద్ద హీరోను ఎలా హ్యాండిల్ చేస్తారో అన్న అనుమానాలు కొందరిలో ఉన్నాయి. కానీ విజయ్ దగ్గర మంచి కంటెంట్ ఉంటే మాత్రం బాలయ్య లాంటి మాస్ హీరో దొరికితే అది ఖచ్చితంగా వెండితెరపై ఒక రేంజ్ లో ఉంటుందని చెప్పొచ్చు.
మరోవైపు బాలకృష్ణ కూడా ఇప్పుడు చాలా జాగ్రత్తగా అడుగులు వేస్తున్నారు. భారీ అంచనాలతో వచ్చిన ‘అఖండ 2’ అంతగా వర్కవుట్ కాలేదు. దీంతో కేవలం బిల్డప్ సీన్లు మాత్రమే ఉంటే సరిపోదని, కథలో దమ్ముండాలని బాలయ్య ఫిక్స్ అయ్యారు. అందుకే విజయ్ కనకమేడల చెప్పిన ఆ సీరియస్ పోలీస్ డ్రామా బాలయ్యకు నచ్చిందని, అందుకే ఈ ప్రాజెక్ట్ ఓకే అయ్యే ఛాన్స్ ఉందని అంటున్నారు. రొటీన్ మాస్ మసాలా కాకుండా ఏదైనా కొత్తగా ట్రై చేయాలనేది బాలయ్య ప్లాన్ కావొచ్చు.
ప్రస్తుతానికి ఇది ఇండస్ట్రీలో నడుస్తున్న ఒక టాక్ మాత్రమే. ఇంకా అఫీషియల్ గా ఏమీ అనౌన్స్ చేయలేదు. ఒకవేళ ఈ కాంబినేషన్ సెట్ అయితే మాత్రం బాలయ్యను మరోసారి పవర్‌ఫుల్ పోలీస్ గెటప్‌లో చూడొచ్చు. విజయ్ కనకమేడల తన మార్క్ సీరియస్ కథతో బాలయ్యను ఏ రేంజ్ లో చూపిస్తారో అన్నది ఇప్పుడు అందరిలోనూ ఆసక్తిని రేకెత్తిస్తోంది. మరి ఈ యంగ్ డైరెక్టర్ బాలయ్యను మెప్పించి షూటింగ్ మొదలుపెడతారో లేదో వేచి చూడాలి.