ఆ న‌టుడిని ఆకాశానికి ఎత్తేసిన పాకిస్తానీ వైఫ్!

ఇటీవలే రిలీజ్ అయిన బాలీవుడ్ చిత్రం `ధురంధ‌ర్ 2` ఎంత పెద్ద విజ‌యం సాధించిందో తెలిసిందే.;

Update: 2026-04-02 23:30 GMT

ఇటీవలే రిలీజ్ అయిన బాలీవుడ్ చిత్రం `ధురంధ‌ర్ 2` ఎంత పెద్ద విజ‌యం సాధించిందో తెలిసిందే. సినిమాలో ప్ర‌తీ పాత్ర ఆద్యంతం ఆక‌ట్టుకున్నాయి. హీరో రోల్ నుంచి ప్ర‌తీ పాత్ర ఎంతో ఎగ్జైట్ మెంట్ ను తీసుకొచ్చింది. నాలుగు గంట‌ల సినిమా అయినా? ఎక్క‌డా బోర్ కొట్ట‌కుండా ఉందంటే? కార‌ణం ఆ పాత్ర‌ల‌ను ద‌ర్శ‌కుడు ఆదిత్య ధ‌ర్ మ‌లిచిన తీరుతోనే సాధ్య‌మైంది. ఇందులో సంజయ్ దత్ పాకిస్తాన్‌కు చెందిన దివంగత పోలీస్ ఆఫీసర్ చౌదరి అస్లాం ఖాన్ పాత్ర మ‌రో హైలైట్ గా నిలిచింది. ఆ పాత్ర ఎంట‌ర్ అయిన ద‌గ్గ‌ర నుంచి ఎలాంటి మ‌లుపులు తిరిగింద‌న్న‌ది తెలిసిందే.

సీరియ‌స్ యాక్ష‌న్ తో పాటు ద‌త్ కామెడీ టైమింగ్ కూడా పర్పెక్ట్ గా సెట్ అయింది. సినిమాలో సంజయ్ దత్ కరాచీకి చెందిన బాంబు నిరోధక దళం అధికారి చౌదరి అస్లాం పాత్రలో కనిపిస్తున్నారు. తాజాగా ఈ పాత్ర‌పై అస్లాం ఖాన్ స‌తీమ‌ణి నోరీన్ అస్లాం సంతోషం వ్య‌క్తం చేసారు. సంజయ్ దత్ తన భర్తలాగే చాలా హుందాగా , గంభీరంగా ఉంటారని కొనియాడారు. `నా భర్త పాత్రను సంజయ్ దత్ పోషిస్తున్నారని తెలియగానే నేను చాలా ఆనందించాను. ఆయన గొంతు, నడిచే తీరు నా భర్త వ్యక్తిత్వానికి దగ్గరగా ఉంటాయి. ఈ పాత్రను అద్భుతంగా ఆవిష్కరించే సత్తా సంజయ్ దత్ కు మాత్రమే ఉంది అని అన్నారు.

చౌదరి అస్లాం పాకిస్తాన్‌లో ఉగ్రవాద వ్యతిరేక పోరాటంలో అత్యంత ధైర్యవంతుడైన అధికారిగా పేరు తెచ్చుకున్నారు. 2014లో జరిగిన బాంబు దాడిలో ఆయన మరణించే వరకు అనేక క్లిష్టమైన ఆపరేషన్లను విజయవంతంగా పూర్తి చేశారు. ఆయన గంభీరమైన వ్యక్తిత్వం, తెగువ పాకిస్తాన్‌లో అందరికీ సుపరిచితం. అటువంటి లెజెండరీ ఆఫీసర్ పాత్రను పోషించడానికి సంజయ్ దత్ బాడీ లాంగ్వేజ్ - ఆయన పవర్‌ఫుల్ స్క్రీన్ ప్రెజెన్స్ సరిగ్గా సరిపోతాయని ఆదిద్య‌ధ‌ర్ న‌మ్మ‌డంతోనే ఇది సాధ్య‌మైంది.

చౌద‌రీ అస్లాంఖాన్ లో సహజత్వం కోసం సంజయ్ దత్ కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. చౌదరి అస్లాం ధరించిన దుస్తులు, ఆయన శైలిని సంజయ్ దత్ సినిమాలో అనుక‌రించ‌డం కోసం స్పెష‌ల్ ట్రైన‌ర్ల‌ను కూడా నియ‌మించారు. నోరీన్ అస్లాం వ్యాఖ్య‌ల‌తో సంజ‌య్ ద‌త్ పాత్ర ప్రేక్ష‌కులకు మ‌రింత కనెక్ట్ అవుతుంది. మొత్త‌గా సంజ‌య్ ద‌త్ కెరీర్ లో ఈ పాత్ర‌ను మ‌రో ఐకానిక్ రోల్ గా చెప్పొచ్చు. ద‌శాబ్ద కాలంలో ద‌త్ పోషించిన ఏ పాత్ర‌కు ఇంత గొప్ప గుర్తింపు రాలేదు.

Tags:    

Similar News