తెలుగు రాష్ట్రాల వసూల్: 'దంగల్' 1.14 కోట్లు.. 'రామాయణం' టార్గెట్ ఎంత?

ప్రముఖ దర్శకుడు నితేష్ తివారీ గతంలో `దంగల్` చిత్రంతో భారతీయ బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే.;

Update: 2026-04-03 04:27 GMT

ప్రముఖ దర్శకుడు నితేష్ తివారీ గతంలో `దంగల్` చిత్రంతో భారతీయ బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. అయితే ఆ సినిమా తెలుగు రాష్ట్రాల వసూళ్లను గమనిస్తే కేవలం రూ. 1.14 కోట్లు మాత్రమే రాబట్టింది. హిందీలో రూ. 374 కోట్లు, తమిళంలో రూ. 11.81 కోట్లు వసూలు చేసిన ఈ క్రీడా నేపథ్య చిత్రం.. తెలుగు రాష్ట్రాల్లో ఆశించిన స్థాయిలో ప్రభావం చూపలేకపోయింది. కానీ ఇప్పుడు అదే దర్శకుడు రణబీర్ కపూర్‌తో కలిసి `రామాయణం` వంటి పురాణేతిహాసాన్ని తెరకెక్కిస్తుండటంతో ట్రేడ్ వర్గాల్లో లెక్కలు పూర్తిగా మారిపోయాయి.

అప్పట్లో `దంగల్` కేవలం రూ. 70 కోట్ల బడ్జెట్‌తో రూపొందితే.. ప్రస్తుత `రామాయణం` కోసం నిర్మాతలు ఏకంగా రూ. 4000 కోట్లకు పైగా ఖర్చు చేస్తున్నట్లు సమాచారం. హాలీవుడ్ స్థాయి విజువల్స్, భారీ తారాగణంతో వస్తున్న ఈ సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. `దంగల్` ఒక భావోద్వేగపూరితమైన క్రీడా చిత్రం కాగా, `రామాయణం` తరతరాలుగా భారతీయుల గుండెల్లో నిలిచిన పురాణ పురుషుడి గాథ. ఈ రెండు సినిమాల మధ్య బడ్జెట్ పరంగా గానీ.. కథాంశం పరంగా గానీ ఎలాంటి సారూప్యత లేదు. అందుకే `దంగల్` వసూళ్లతో దీన్ని పోల్చడం సరైంది కాదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

ప్రస్తుతం పాన్ ఇండియా ట్రెండ్ నడుస్తున్న తరుణంలో తెలుగు రాష్ట్రాల బిజినెస్ రేంజ్ ఊహకందని విధంగా పెరిగింది. `రామాయణం` తెలుగు హక్కుల కోసం హిందీ నిర్మాతలు సుమారు రూ. 120 కోట్లు కోట్ చేస్తున్నట్లు ఫిలిం నగర్ సమాచారం. ఈ రేసులో ప్రముఖ నిర్మాణ సంస్థ `మైత్రీ మూవీ మేకర్స్` ముందంజలో ఉండగా, స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు కూడా హక్కుల కోసం గట్టి ప్రయత్నాలే చేస్తున్నారు. తెలుగులో రణబీర్ కపూర్, సాయి పల్లవిలకు ఉన్న క్రేజ్ దృష్ట్యా ఈ స్థాయి డిమాండ్ ఉండటం సహజమేనని చెప్పాలి.

ఒకప్పుడు బాలీవుడ్ సినిమాల తెలుగు వెర్షన్లు కోటి రూపాయల వద్దే ఆగిపోయేవి. కానీ నేడు సీన్ పూర్తిగా మారిపోయింది. `ధురంధర్` వంటి సినిమాలు తెలుగు రాష్ట్రాల్లో వందల కోట్ల వసూళ్లు సాధిస్తున్న తరుణంలో `రామాయణం` చిత్రానికి సరైన హైప్ వస్తే రూ. 100 కోట్లు వసూలు చేయడం పెద్ద కష్టమేమీ కాదు. రామాయ‌ణ క‌థ తెలుగు లోగిళ్ల‌లో ఇంటింటా మార్మోగిన క‌థ‌. ముఖ్యంగా ఏపీ, తెలంగాణాలో భక్తి భావం... పౌరాణిక చిత్రాల విష‌యంలో ఉన్న ఆదరణ ఈ సినిమాకు పెద్ద ప్లస్ పాయింట్ కానుంది.

భారతీయ సినిమా గ్లోబల్ స్థాయికి చేరుకున్న ఈ తరుణంలో `రామాయణం` పాన్ వరల్డ్ చిత్రంగా విడుదల కాబోతోంది. ట్రెండ్ మార్పుతో పాటు ఆడియన్స్ అభిరుచి కూడా మారడంతో బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం సరికొత్త రికార్డులను సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది. టీజ‌ర్ తో ఇప్ప‌టికే హైప్ అమాంతం పెరిగింది. అన్నివైపులా పాజిటివ్ వైబ్స్ క‌నిపిస్తున్నాయి. ఇక‌ `దంగల్` వసూళ్లను పక్కన పెడితే... రామాయణం తెలుగు గడ్డపై ఏ రేంజ్ ప్రభంజనం సృష్టిస్తుందో చూడాలంటే 2026 దీపావళి వరకు వేచి చూడాల్సిందే.తెలుగు రాష్ట్రాల వసూల్: `దంగల్` రాబట్టింది 1.14 కోట్లు.. మరి `రామాయణం` టార్గెట్ ఎంత?

ప్రముఖ దర్శకుడు నితేష్ తివారీ గతంలో `దంగల్` చిత్రంతో భారతీయ బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. అయితే ఆ సినిమా తెలుగు రాష్ట్రాల వసూళ్లను గమనిస్తే కేవలం రూ. 1.14 కోట్లు మాత్రమే రాబట్టింది. హిందీలో రూ. 374 కోట్లు, తమిళంలో రూ. 11.81 కోట్లు వసూలు చేసిన ఈ క్రీడా నేపథ్య చిత్రం.. తెలుగు రాష్ట్రాల్లో ఆశించిన స్థాయిలో ప్రభావం చూపలేకపోయింది. కానీ ఇప్పుడు అదే దర్శకుడు రణబీర్ కపూర్‌తో కలిసి `రామాయణం` వంటి పురాణేతిహాసాన్ని తెరకెక్కిస్తుండటంతో ట్రేడ్ వర్గాల్లో లెక్కలు పూర్తిగా మారిపోయాయి.

అప్పట్లో `దంగల్` కేవలం రూ. 70 కోట్ల బడ్జెట్‌తో రూపొందితే.. ప్రస్తుత `రామాయణం` కోసం నిర్మాతలు ఏకంగా రూ. 4000 కోట్లకు పైగా ఖర్చు చేస్తున్నట్లు సమాచారం. హాలీవుడ్ స్థాయి విజువల్స్, భారీ తారాగణంతో వస్తున్న ఈ సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. `దంగల్` ఒక భావోద్వేగపూరితమైన క్రీడా చిత్రం కాగా, `రామాయణం` తరతరాలుగా భారతీయుల గుండెల్లో నిలిచిన పురాణ పురుషుడి గాథ. ఈ రెండు సినిమాల మధ్య బడ్జెట్ పరంగా గానీ.. కథాంశం పరంగా గానీ ఎలాంటి సారూప్యత లేదు. అందుకే `దంగల్` వసూళ్లతో దీన్ని పోల్చడం సరైంది కాదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

ప్రస్తుతం పాన్ ఇండియా ట్రెండ్ నడుస్తున్న తరుణంలో తెలుగు రాష్ట్రాల బిజినెస్ రేంజ్ ఊహకందని విధంగా పెరిగింది. `రామాయణం` తెలుగు హక్కుల కోసం హిందీ నిర్మాతలు సుమారు రూ. 120 కోట్లు కోట్ చేస్తున్నట్లు ఫిలిం నగర్ సమాచారం. ఈ రేసులో ప్రముఖ నిర్మాణ సంస్థ `మైత్రీ మూవీ మేకర్స్` ముందంజలో ఉండగా, స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు కూడా హక్కుల కోసం గట్టి ప్రయత్నాలే చేస్తున్నారు. తెలుగులో రణబీర్ కపూర్, సాయి పల్లవిలకు ఉన్న క్రేజ్ దృష్ట్యా ఈ స్థాయి డిమాండ్ ఉండటం సహజమేనని చెప్పాలి.

ఒకప్పుడు బాలీవుడ్ సినిమాల తెలుగు వెర్షన్లు కోటి రూపాయల వద్దే ఆగిపోయేవి. కానీ నేడు సీన్ పూర్తిగా మారిపోయింది. `ధురంధర్` వంటి సినిమాలు తెలుగు రాష్ట్రాల్లో వందల కోట్ల వసూళ్లు సాధిస్తున్న తరుణంలో `రామాయణం` చిత్రానికి సరైన హైప్ వస్తే రూ. 100 కోట్లు వసూలు చేయడం పెద్ద కష్టమేమీ కాదు. రామాయ‌ణ క‌థ తెలుగు లోగిళ్ల‌లో ఇంటింటా మార్మోగిన క‌థ‌. ముఖ్యంగా ఏపీ, తెలంగాణాలో భక్తి భావం... పౌరాణిక చిత్రాల విష‌యంలో ఉన్న ఆదరణ ఈ సినిమాకు పెద్ద ప్లస్ పాయింట్ కానుంది.

భారతీయ సినిమా గ్లోబల్ స్థాయికి చేరుకున్న ఈ తరుణంలో `రామాయణం` పాన్ వరల్డ్ చిత్రంగా విడుదల కాబోతోంది. ట్రెండ్ మార్పుతో పాటు ఆడియన్స్ అభిరుచి కూడా మారడంతో బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం సరికొత్త రికార్డులను సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది. టీజ‌ర్ తో ఇప్ప‌టికే హైప్ అమాంతం పెరిగింది. అన్నివైపులా పాజిటివ్ వైబ్స్ క‌నిపిస్తున్నాయి. ఇక‌ `దంగల్` వసూళ్లను పక్కన పెడితే... రామాయణం తెలుగు గడ్డపై ఏ రేంజ్ ప్రభంజనం సృష్టిస్తుందో చూడాలంటే 2026 దీపావళి వరకు వేచి చూడాల్సిందే.

Tags:    

Similar News