టైర్ -2 హీరోల నెక్స్ట్ టార్గెట్ 200 కోట్లు!

ఒకప్పుడు స్టార్ హీరోల సినిమాలకే పరిమితమైన భారీ వసూళ్ల రికార్డులు ఇప్పుడు టైర్-2 హీరోలతో కూడా సాధ్యమవుతున్నాయి.

Update: 2026-07-21 11:30 GMT

ఒకప్పుడు స్టార్ హీరోల సినిమాలకే పరిమితమైన భారీ వసూళ్ల రికార్డులు ఇప్పుడు టైర్-2 హీరోలతో కూడా సాధ్యమవుతున్నాయి. నాని, నాగచైతన్య, విజయ్ దేవరకొండ, సాయి ధరమ్ తేజ్ వంటి యువ హీరోలు ఇప్పటికే 100 కోట్ల క్లబ్‌లో స్థానాన్ని సుస్థిరం చేసుకున్నారు. ఈ నేపథ్యంలో ఈ హీరోలంతా తదుపరి టార్గెట్ 200 కోట్ల క్లబగా మారింది. సినిమా నిర్మాణ వ్యయం, డిజిటల్ , శాటిలైట్ హక్కుల మార్కెట్ విస్తరిస్తున్న తరుణంలో బడ్జెట్ గణనీయంగా పెరుగుతోంది. ఈ ఆర్థిక సమీకరణాలను బట్టి దేశీయ మార్కెట్ మాత్రమే కాకుండా ఓవర్సీస్ .. పాన్-ఇండియా మార్కెట్లను దృష్టిలో ఉంచుకుని కథలను ఎంచుకుంటున్నారు. సినిమా బడ్జెట్ , వసూళ్ల పరిధిని బట్టి రాబోయే రోజుల్లో ఈ టార్గెట్ 500 కోట్ల గ్రాస్ మార్జిన్ సాధించడమే లక్ష్యంగా భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌లను ప్లాన్ చేస్తున్నారు.

నాని కెరీర్‌లో వైవిధ్యమైన కథలతో పాటు కమర్షియల్ సక్సెస్‌లను సమన్వయం చేసుకుంటూ బాక్సాఫీస్ వద్ద స్టామినాని నిరూపించుకున్నారు. అలాగే నాగచైతన్య , విజయ్ దేవరకొండ కూడా తమ మార్కెట్ పరిధిని పెంచుకునేందుకు భారీ బడ్జెట్ ప్రాజెక్ట్‌లపై దృష్టి సారిస్తున్నారు. సాయి ధరమ్ తేజ్ సైతం విభిన్నమైన జోనర్లలో నటిస్తూ ప్రేక్షకులను మెప్పిస్తున్నారు. వీరంతా ఇప్పుడు తదుపరి చిత్రాలతో బాక్సాఫీస్ వద్ద వసూళ్ల సునామీ సృష్టించడానికి పకడ్బందీ వ్యూహాలతో ముందుకెళ్తున్నారు.

అయితే 200 కోట్ల మార్క్‌ను అందుకోవడం అనేది అంత ఆషామాషీ విషయం కాదు. దీనికోసం స్టార్ డమ్ ఒక్క‌టే సరిపోదు. బలమైన కంటెంట్, అద్భుతమైన మేకింగ్ , సరైన ప్రమోషనల్ వ్యూహం అత్యంత కీలకం. ప్రేక్షకులు థియేటర్లకు రావాలంటే విజువల్ వండర్స్ .. హృదయానికి హత్తుకునే భావోద్వేగాలు ఉండాలి. ఈ నేప‌థ్యంలో హీరోలంతా తదుపరి చిత్రాల విషయంలో నిర్మాణ విలువలకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. గ్లోబల్ ఆడియెన్స్‌ను ఆకట్టుకునేలా అడుగులు వేస్తున్నారు.టైర్- 2 హీరోల దూకుడు టాలీవుడ్ మార్కెట్ స్థాయిని మరింత పెంచుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు.

టాలీవుడ్ ఇండస్ట్రీ పరిధి ఇప్పుడు కేవలం తెలుగు రాష్ట్రాలకే పరిమితం కాలేదు. ప్రపంచవ్యాప్తంగా విస్తరించింది. ఈ సానుకూల వాతావరణాన్ని సద్వినియోగం చేసుకుంటూ యువ హీరోలు బాక్సాఫీస్ రికార్డులను తిరగరాయడానికి సిద్ధమవుతున్నారు. త్వరలోనే ఈ హీరోలంతా 200 కోట్ల వ‌సూళ్ల టార్గెట్ చిత్రాల‌తో ప్రేక్ష‌కుల ముందుకు రావ‌డానికి రెడీ అవుతున్నారు. టాలీవుడ్‌లో మారుతున్న ట్రెండ్‌కు అనుగుణంగా టైర్2 హీరోలు తమ లక్ష్యాలను పెంచుకోవడం పరిశ్రమ ఆరోగ్యకరమైన వృద్ధికి నిదర్శనం. 100 కోట్ల నుంచి 200 కోట్లు .. అంతకంటే ఎక్కువ వసూళ్ల సాధనే ధ్యేయంగా న‌యా స్టార్స్ సాగిస్తున్న ప్రయాణం తెలుగు చలనచిత్ర పరిశ్రమను నూతన శిఖరాలకు చేర్చడం తథ్యం.

Tags:    

Similar News