జేడీ చక్రవర్తి.. ఇదేం ఎడిట్ సామీ

Update: 2018-03-21 14:16 GMT
ముందు విలన్‌ గా పరిచయం అయ్యాడు. ఆ తర్వాత హీరోగా మారాడు. ఆపై దర్శకుడి అవతారం ఎత్తాడు. తర్వాత విలన్.. క్యారెక్టర్ రోల్స్ చేశాడు. ఇలా జేడీ చక్రవర్తి సినీ ప్రస్థానం అనేక మలుపులు తిరిగింది. ఐతే ఈ మధ్య జేడీ పెద్దగా సినిమాల్లో కనిపించడం లేదు. పెళ్లి చేసుకున్నాక అతను వార్తల్లో కనిపించడం లేదు. కొంచెం గ్యాప్ తర్వాత అతను తిరిగి హీరో అవతారం ఎత్తుతుండటం విశేషం. ‘రణం’ లాంటి హిట్ మూవీతో దర్శకుడిగా పరిచయమై.. ఆ తర్వాత వరుసగా చెత్త సినిమాలు తీసిన అమ్మ రాజశేఖర్ దర్శకత్వంలో జేడీ నటిస్తున్నాడు. వీళ్ల కాంబినషన్లో ‘ఉగ్రం’ అనే సినిమా తెరకెక్కుతోంది.

తాజాగా ‘ఉగ్రం’ మోషన్ పోస్టర్ రిలీజ్ చేశారు. అది చూస్తే ఏదో బి-గ్రేడ్ సినిమా మోషన్ పోస్టర్ చూస్తున్న భావన కలుగుతోంది. దీపక్ 70 ఎంఎం అంటూ ముందు థియేటర్ చూపించి.. ఆ తర్వాత జేడీని తెరమీదికి తెచ్చి.. ఆపై అతను కొడితే రౌడీలు ఎగిరి పడ్డట్లు మోషన్ పోస్టర్ ఎడిట్ చేశారు. క్వాలిటీ మరీ తీసికట్టుగా ఉండటంతో జనాలకు మరో ఫీలింగ్ వస్తోంది. ఇక జేడీ పేరు ముందు ‘మ్యాన్లీ స్టార్’ అంటూ ఒక టైటిల్ కూడా వేసుకోవడం గమనార్హం. ప్రస్తుతం స్టార్ హీరోలే మాస్ మసాలా సినిమాలు వదిలేసి.. విభిన్నమైన కథలతో ప్రయాణం చేస్తుంటే జేడీ-రాజశేఖర్ కలిసి మాస్ సినిమా కోసం ట్రై చేస్తున్నట్లుగా ఉంది. ఈ ప్రయత్నం ఏమేరకు విజయవంతమవుతుందో చూడాలి.

Full View
Tags:    

Similar News