ప‌బ్లిక్ రోడ్ లో స్టార్ హీరోల‌ రేసింగ్.. అడ్డంగా దొరికారు!

Update: 2020-07-24 04:30 GMT
ఖ‌రీదైన జూబ్లీ హిల్స్- బంజారాహిల్స్ ఏరియాల్లోనే రేసింగ్ గురించి విన్నాం ఇన్ని రోజులు. హైద‌రాబాద్ లో బ‌లిసిన సెల‌బ్రిటీ కిడ్స్ ఇలాంటి వేషాలు వేస్తూ ప‌లుమార్లు యాక్సిడెంట్లు చేయ‌డంతో పోలీసులు జైల్లో వేయ‌డం చూశాం. తాగి డ్రైవ్ చేసేవాళ్ల‌ను లోనేస్తున్నారు. జ‌నం న‌డ‌యాడే రోడ్ల‌లో బైక్ లేదా కార్ రేసింగుకి వెళ్ల‌డం నేరం. కానీ అదే రిపీట్ చేస్తూ దొర‌క‌డం సెల‌బ్ కిడ్స్ కి అల‌వాటు వ్యాప‌కంగా మారింది.

అదంతా అటుంచితే తాజాగా మ‌మ్ముట్టి న‌ట‌వార‌సుడు .. కుర్ర‌ హీరో దుల్క‌ర్ స‌ల్మాన్ .. అలాగే మ‌రో మ‌ల‌యాళ‌ స్టార్ హీరో పృథ్వీరాజ్ నిబంధ‌న‌ల్ని ఉల్లంఘించి ప‌బ్లిక్ రోడ్ లో రేసింగుకి వెళ్లార‌ని.. ర్యాష్ డ్రైవింగ్ కేసును బుక్ చేసేందుకు పోలీసులు రెడీ అవుతున్నారని స‌మాచారం. అయితే ఈ కేసులో ఆస‌క్తిక‌ర‌మైన ట్విస్టేమిటంటే .. హీరో పృథ్వీరాజ్ .. దుల్క‌ర్ లు ఈ త‌ప్పుడు ప‌నికి పాల్ప‌డిన‌ట్టుగా సోష‌ల్ మీడియా వీడియో ధృవీక‌రించింది.‌ రేసింగ్ వీడియో ఇటీవ‌ల సోష‌ల్ మీడియాల్లో వైర‌ల్ గా చ‌క్క‌ర్లు కొట్ట‌డం అది కాస్తా పోలీస్ శాఖ‌కు చేరుకుంది. వెంట‌నే దీనిపై ద‌ర్యాప్తు చేయాల‌ని మోటారు వాహనాల శాఖ ఆదేశించింది.

ఇక ఇందులో దుల్కర్ సల్మాన్ లగ్జరీ కార్ రేసింగ్ కావాలని అంటున్న వీడియో ఉందిట‌. పృథ్వీరాజ్.. దుల్కార్ లగ్జరీ కార్లు కొట్టాయం-కొచ్చి రహదారి వెంట రేసింగ్ చేసిన‌ట్టుగా ఆ వీడియో ధృవీక‌రిస్తోంది. ఆ ఇద్ద‌రు హీరోల్ని తమ బైక్ ‌పై వెంబడించిన ఇద్దరు యువకులు అదంతా రికార్డ్ చేసి సోష‌ల్ మీడియాల్లో అప్ ‌లోడ్ చేశారు. వీడియోలో బైక్ మీద ఉన్న ఇద్దరు వ్యక్తులతో పాటు మూడు కార్లు.. ఒక నల్ల లంబోర్ఘిని.. ఒక సిల్వ‌ర్ క‌ల‌ర్ పోర్స్చే.. ఎరుపు పోర్స్చే ఈ రేసింగులో పాల్గొన్నట్టు క‌నిపిస్తోంది.

ప్ర‌స్తుతం ట్రాన్స్ పోర్ట్ క‌మీష‌న‌ర్ కేసు న‌మోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.  కావాల‌నే ఆ ఇద్ద‌రూ రాష్ డ్రైవింగ్ లో పాల్గొన్నారా అన్న‌ది ఇంకా నిర్ధార‌ణ కావాల్సి ఉందని పోలీసులు తెలిపారు. కొట్టాయం-కొచ్చి మార్గంలో రేసింగ్ వేగాన్ని గుర్తించే కెమెరాల్ని ప‌రిశీలిస్తున్నారు. ``స‌ద‌రు హీరోలు రహదారి-భద్రతా నియమాలను ఉల్లంఘించారని ఇంకా ఒక నిర్ణయానికి రాలేము. కెమెరాలు ఉల్లంఘనలను కనుగొంటే RC (రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్) చ‌ట్టం ప్ర‌కారం యజమానుల‌కు నోటీసులు పంపిస్తాం`` అని ఆర్టీఏ అధికారులు తెలిపారు. గత వారాంతంలో ఈ వీడియో చిత్రీకరించార‌ని వాదనలు వినిపిస్తున్నా.. రేసింగ్ తేదీపై క‌చ్చితమైన స‌మాచారం లేద‌ట‌.

దర్యాప్తులో సెక్షన్ 184 ప్రకారం కారు యజమానులు దోషులుగా తేలితే.. వారు తొలిగా కార్యాలయానికి 1500 రూపాయల జరిమానా చెల్లించాలి. లేదా 6  నెలల జైలు శిక్షను పూర్తి చేసి పునరావృత నేరాలకు రూ.3000 చెల్లించాల్సి ఉంటుంది. 2019 నవంబర్ ‌లో పృథ్వీరాజ్ కొత్త లగ్జరీ కారు రిజిస్ట్రేషన్ ‌ను  ఎర్నాకుళం ఆర్టీఓ అడ్డుకుంది. ఆన్ ‌లైన్ దరఖాస్తుతో సమర్పించిన కొనుగోలు బిల్లులో లగ్జరీ వాహనం విలువ రూ .1.34 కోట్లుగా ఉండ‌గా.. వాహనం అసలు విలువ సుమారు రూ .1.64 కోట్లు అని అధికారులు గుర్తించడంతో రిజిస్ట్రేషన్ నిలిపేశారు.

Full View
Tags:    

Similar News