ఆది 'శంబాల'.. ప్రభాస్ బిగ్ బూస్ట్..

టాలీవుడ్ యంగ్ హీరో ఆది సాయికుమార్ రీసెంట్ గా శంబాల: ఏ మిస్టిక్ వరల్డ్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే.;

Update: 2025-12-28 17:30 GMT

టాలీవుడ్ యంగ్ హీరో ఆది సాయికుమార్ రీసెంట్ గా శంబాల: ఏ మిస్టిక్ వరల్డ్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. సూపర్ నేచురల్ థ్రిల్లర్ గా రూపొందిన ఆ సినిమా.. క్రిస్మస్ కానుకగా థియేటర్స్ లో డిసెంబర్ 25వ తేదీన విడుదలైంది. ఆడియన్స్ నుంచి మంచి టాక్ అందుకుని ఇప్పుడు థియేటర్స్ లో సందడి చేస్తోంది.




 


ముఖ్యంగా ఆది సాయి కుమార్ తన యాక్టింగ్ తో అందరినీ ఆకట్టుకున్నారు. రోల్ లో సీరియస్ నెస్, ఎమోషనల్ డెప్త్ తో మెప్పించారు. మొత్తానికి ఆది కెరీర్ లో శంబాల టర్నింగ్ పాయింట్ అనే చెప్పాలి. అదే సమయంలో పోస్ట్ ప్రమోషన్స్ తో మూవీ మేకర్స్ బిజీగా ఉన్నారు. సినిమాపై మరింత ఫోకస్ పడేలా సందడి చేస్తున్నారు.

తాజాగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్.. శంబాల మూవీ కోసం పోస్ట్ పెట్టారు. మేకర్స్ షేర్ చేసిన శంబాల పోస్టర్ ను తన ఇన్ స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేశారు. ఫెంటాస్టిక్ బ్లాక్ బస్టర్ సాధించినందుకు ఆది సాయి కుమార్ తో పాటు శంబాల మూవీ టీమ్ కు కంగ్రాట్యులేషన్స్ అని తెలిపారు. ప్రస్తుతం ప్రభాస్ ఇన్ స్టా స్టోరీ నెట్టింట వైరల్ గా మారింది.

అదే సమయంలో ప్రభాస్ పోస్ట్.. శంబాల మూవీ టీమ్ కు బిగ్ బూస్ట్ ఇచ్చిందని చెప్పాలి. ఎందుకంటే ఇప్పటికే సినిమా.. బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు సాధిస్తోంది. మేకర్స్ పోస్ట్ ప్రమోషన్స్ ను ఫుల్ గాా నిర్వహిస్తున్నారు. ఇంతలో ప్రభాస్ పోస్ట్ అనేక మంది దృష్టి మూవీపై పడిందనే చెప్పాలి. దీంతో కలెక్షన్లు మరింత పెరిగే అవకాశం ఉంది.

ఇక సినిమా విషయానికొస్తే.. షైనింగ్ పిక్చర్స్ బ్యానర్‌ పై రాజశేఖర్ అన్నభిమోజు, మహీధర్ రెడ్డి సంయుక్తంగా నిర్మించారు. యుగంధర్ ముని దర్శకత్వం వహించారు. ఆది సాయి కుమార్, అర్చన అయ్యర్ జంటగా నటించగా.. శ్వాసిక విజయ్, రవివర్మ, మధునందన్, శివ కార్తీక్, శైలజా ప్రియా, ఇంద్రనీల్, ప్రవీణ్ కీలక పాత్రలు పోషించారు.

వారితో పాటు మీసాల లక్ష్మణ్, సిజ్జు మీనన్, హర్షవర్ధన్ తదితరులు ఇతర పాత్రల్లో నటించారు. శంబాల మూవీకి శ్రీచరణ్ పాకాల సంగీత దర్శకుడిగా వ్యవహరించగా.. ప్రవీణ్ కే బంగారి సినిమాటోగ్రఫీ బాధ్యతలు చేపట్టారు. శ్రవణ్ కటికనేని ఎడిటర్‌ గా, జేకే మూర్తి ఆర్ట్ డైరెక్టర్‌ గా వ్యవహరించారు. జేవీ రామారావు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌ గా విధులు నిర్వర్తించారు.

ఇక సినిమా ప్రపంచవ్యాప్తంగా మొదటి రోజు సుమారు రూ.3.3 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించగా, విడుదలైన మూడు రోజుల్లో సుమారు రూ.7 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించినట్లు తెలుస్తోంది. తెలుగులో మంచి స్పందన లభించడంతో శంబాల చిత్రాన్ని 2026 జనవరి 1న హిందీలో విడుదల చేసేందుకు నిర్మాతలు సిద్ధమవుతున్నారు.

Tags:    

Similar News