అకీరా.. మెగాస్టార్ ప్రమేయం ఉందా లేదా?
టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వారసుడు అకీరా నందన్ సినీ ఎంట్రీపై మెగా అభిమానులతో పాటు సినీ ప్రియుల్లో ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోందని చెప్పాలి.;
టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వారసుడు అకీరా నందన్ సినీ ఎంట్రీపై మెగా అభిమానులతో పాటు సినీ ప్రియుల్లో ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోందని చెప్పాలి. ఇప్పటికే సోషల్ మీడియాలో అకీరా డెబ్యూ గురించి ఎన్నో రూమర్లు చక్కర్లు కొడుతున్నాయి. మెగా ఫ్యామిలీ నుంచి రానున్న మరో వారసుడు ఎంట్రీ వెనుక మెగాస్టార్ చిరంజీవి ప్రమేయం ఉందా లేదా అన్నది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
ఇప్పటివరకు మెగా కాంపౌండ్ నుంచి హీరోగా వచ్చిన ప్రతి ఒక్కరి జర్నీలో చిరంజీవి కీలక పాత్ర పోషించారని చెప్పడంలో డౌట్ అక్కర్లేదు. స్టోరీ సెలక్షన్ నుంచి డైరెక్టర్, ప్రొడక్షన్ ప్లానింగ్ వరకు ఆయన ప్రత్యేక కేర్ తీసుకున్నారని ఇండస్ట్రీలో టాక్. అందుకే అకీరా నందన్ డెబ్యూ విషయంలో కూడా చిరంజీవి ఇన్వాల్వ్మెంట్ తప్పకుండా ఉంటుందనే అభిప్రాయం అందరిలో ఉంది.
కానీ ఇప్పటి వరకు అకీరా ఎంట్రీ విషయంలో చిరు పేరు వినిపించడం లేదు. ఒక్క వార్త కూడా వైరల్ అవ్వలేదు. అదే సమయంలో అకీరా డెబ్యూ మూవీకి సంబంధించి ఎప్పటి నుంచో పలువురు దర్శకుల పేర్లు వినిపిస్తున్నాయి. కొద్ది రోజుల క్రితం దర్శకుడు శేఖర్ కమ్ముల పేరు గట్టిగా వినిపించింది. కంటెంట్ బేస్డ్ సినిమాలతో మంచి గుర్తింపు పొందిన ఆయన.. అకీరాను సాఫ్ట్ లాంచ్ చేసే అవకాశం ఉందని ప్రచారం జరిగింది.
ఇప్పుడు తాజాగా యంగ్ హీరో అడివి శేష్ పేరు తెరపైకి వచ్చింది. శేష్, అకీరా మంచి ఫ్రెండ్స్ అన్న విషయం తెలిసిందే. అందుకే ఇప్పుడు శేష్ అందించే స్టోరీతో లేక ఆయన డైరెక్షన్ లో అకీరా ఎంట్రీ ఉండొచ్చని టాక్ వినిపిస్తోంది. అయితే ఫ్యాన్స్ మాత్రం మరో యాంగిల్ లో ఆలోచిస్తున్నారు. పవన్ ఇమేజ్, మెగా ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ ను చూసుకుని.. అకీరా గ్రాండ్ మాస్ ఎంట్రీ ఇవ్వాలని అభిమానులు కోరుకుంటున్నారు.
హై వోల్టేజ్ యాక్షన్, పవర్ ఫుల్ మాస్ ఎలిమెంట్స్ ఉన్న స్క్రిప్ట్ రాసుకున్న దర్శకుడితో డెబ్యూ అయితేనే అకీరాకు సరైన స్టార్ట్ అవుతుందని సోషల్ మీడియాలో కామెంట్స్ వినిపిస్తున్నాయి. కానీ ఇప్పటి వరకు అకీరా డెబ్యూ ఎప్పుడు, ఎవరితో ఉంటుందనేది సస్పెన్స్ గానే ఉంది. అయితే ఒక విషయం మాత్రం క్లియర్. మెగా ఫ్యామిలీ నుంచి వస్తున్న కొత్త వారసుడు అకీరాపై అంచనాలు భారీగానే ఉన్నాయి.
అందుకే స్టోరీ, టీమ్ సెలక్షన్ తో పాటు అన్ని విషయాల్లో కూడా ఒక్క చిన్న మిస్టేక్ జరగకూడదనేలా జాగ్రత్తలు తీసుకునే అవకాశం ఎక్కువగా ఉంది. ఏదేమైనా ఇప్పుడు అకీరా నందన్ సినీ ఎంట్రీపై అఫీషియల్ అనౌన్స్మెంట్ కోసం మెగా ఫ్యాన్స్ ఎంతో ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. మరి అకీరా ఎంట్రీలో మెగాస్టార్ ప్రమేయం ఉంటుందా? లేదా? అన్నది తెలియాలంటే మరికొన్ని రోజుల పాటు వేచి చూడాల్సిందేనేమో.