బన్నీ వాసు కాంబో.. సుప్రీం దొంగలతో పోల్చిన కమెడియన్

టాలీవుడ్‌ లో కంటెంట్‌ కు మంచి ఇంపార్టెన్స్ ఇస్తూ కెరీర్ లో మందుకు సాగుతున్నారు ప్రముఖ నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు బన్నీ వాసు, వంశీ నందిపాటి.;

Update: 2026-02-12 09:59 GMT

టాలీవుడ్‌ లో కంటెంట్‌ కు మంచి ఇంపార్టెన్స్ ఇస్తూ కెరీర్ లో మందుకు సాగుతున్నారు ప్రముఖ నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు బన్నీ వాసు, వంశీ నందిపాటి. ఇప్పటికే తమకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆ కాంబో.. స్టోరీ స్ట్రాంగ్ ఉన్న సినిమాలైతే జానర్, క్యాస్టింగ్ తో సంబంధం లేకుండా థియేటర్లలోకి తీసుకొస్తున్నారు. ఆయా మూవీ టీమ్స్ కు బిగ్ సపోర్ట్ గా నిలుస్తున్నారు.

రీసెంట్ గా లిటిల్ హార్ట్స్, రాజు వెడ్స్ రాంబాయి వంటి సూపర్ హిట్ చిత్రాలతో ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్న బన్నీ వాసు- వంశీ నందిపాటి.. ఈషా వంటి హారర్ థ్రిల్లర్ సినిమాలను కూడా విడుదల చేసి కంటెంట్ పరంగా తమ ప్రత్యేకతను చాటుకున్నారు. చిన్న సినిమాలైనా సరే, మంచి కథ ఉంటే వాటికి పూర్తి స్థాయి ప్రమోషన్లు చేస్తూ థియేటర్లలో నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నారు.

ఇప్పుడు వారిద్దరూ యంగ్ హీరో సుహాస్ లీడ్ రోల్‌ లో నటిస్తున్న హే భగవాన్ సినిమాను రిలీజ్ చేయడానికి రెడీ అవుతున్నారు. గోపీ అచ్చర్ల దర్శకత్వం వహిస్తున్న ఆ సినిమా ఫిబ్రవరి 20న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఇప్పటికే విడుదలైన ఆ మూవీ ట్రైలర్ మంచి రెస్పాన్స్ అందుకుంది. ఫన్, ఎమోషన్, ఫ్రెష్ కంటెంట్ తో కూడిన కథతో ఆ మూవీ తెరకెక్కుతున్నట్లు క్లియర్ గా తెలుస్తోంది.

అయితే తాజాగా జరిగిన హే భగవాన్ ట్రైలర్ రిలీజ్ ఈవెంట్‌ జరగ్గా.. ఆ సమయంలో కమెడియన్ సుదర్శన్ చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ గా మారాయి. మెగా మేనల్లుడు సాయి దుర్గ తేజ్ సుప్రీమ్ మూవీలోని దొంగలతో ఫన్నీగా పోల్చి చేసిన కామెంట్స్ అందరినీ ఆకట్టుకుంటున్నాయి. సుదర్శన్ మాట్లాడుతూ, "సర్.. సుప్రీం సినిమాలో ఒక కామెడీ ట్రాక్ ఉంటుంది. ప్రభాస్ శ్రీను గారు, పృథ్వీ గారు వ్యాలెట్ పార్కింగ్ అని చెప్పుకుంటూ కార్లు తీసుకుని వెళ్లిపోతారు. అలాగే ఇప్పుడు వంశీ నందిపాటి గారు, బన్నీ వాసు గారు కూడా మంచి కంటెంట్ ఉన్న సినిమా ఏదైనా మేం చూసుకుంటాం అన్నట్టు వ్యవహరిస్తున్నారు. మంచి కథలున్న సినిమాలను థియేటర్లలోకి తీసుకొచ్చి సూపర్ హిట్స్ చేస్తున్నారు" అంటూ ప్రశంసలు కురిపించారు.

సుదర్శన్ కామెంట్స్ అక్కడ ఉన్న వారిని నవ్వించడమే కాకుండా, వంశీ నందిపాటి- బన్నీ వాసు అందిస్తున్న సపోర్ట్ కు సరైన కాంప్లిమెంట్‌ గా నిలిచాయి. ప్రస్తుతం టాలీవుడ్‌ లో కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాలకు ప్రేక్షకులు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్న నేపథ్యంలో బన్నీ వాసు – వంశీ నందిపాటి వంటి వారు ముందుకు రావడం ఇండస్ట్రీకి ప్లస్‌ గా మారుతోందనే చెప్పాలి. ఇప్పుడు అదే నమ్మకంతో హే భగవాన్ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. మరి సుహాస్ కు ఆ మూవీతో ఎలాంటి హిట్ దక్కుతుందో? బన్నీ వాసు – వంశీ నందిపాటి హిట్ ట్రాక్ కొనసాగుతుందా? లేదో అన్నది వేచి చూడాల్సిందే.

Tags:    

Similar News