కల్కి 2.. మరీ అంత త్వరగానా?
అయితే అలా ఇంకా షూటింగ్ మొదలు కాకపోయినా ఓవర్సీస్ రైట్స్ కు సంబంధించి డీల్ ఫిక్స్ అయిందన్న ఇప్పుడు వార్తలు రావడం గమనార్హం.;
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ లీడ్ రోల్ లో నటించిన కల్కి 2898 ఏడీ మూవీ సీక్వెల్ పై భారీ అంచనాలు నెలకొన్న విషయం తెలిసిందే. టాలెంటెడ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించిన ఆ సినిమా.. 2024లో రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ముఖ్యంగా నాగ్ అశ్విన్ క్రియేట్ చేసిన సైన్స్ ఫిక్షన్ వరల్డ్.. ఆడియన్స్ తో పాటు అభిమానులను కంప్లీట్ గా కొత్త లోకంలోకి తీసుకెళ్లింది.
అదే సమయంలో సినిమా లాస్ట్ లో ఆయన ఇచ్చిన మైథాలజీ టచ్ తో పాటు కర్ణుడు- అర్జునుడు ఎలిమెంట్ కల్కి 2 మూవీపై మంచి బజ్ క్రియేట్ చేసింది. దీంతో సీక్వెల్ కోసం అంతా వెయిట్ చేస్తున్నారు. భారీ అంచనాలు కూడా పెట్టుకున్నారు. అయితే ఆ సినిమా ఇంకా షూటింగ్ ప్రారంభం కాకముందే కల్కి పార్ట్ 2కి సంబంధించిన డీల్స్ ఫిక్స్ అవుతున్నాయన్న వార్తలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి.
నిజానికి.. మరికొద్ది రోజుల్లో కల్కి 2 మూవీ షూటింగ్ స్టార్ట్ అవ్వనుందని ఇటీవల వార్తలు వచ్చాయి. ప్రస్తుతం ప్రభాస్ బిజీగా ఉండడంతో ఆయనకు సంబంధం లేదని సీన్స్ ను ముందుగా షూట్ చేయనున్నారని టాక్ వినిపించింది. అందుకు గాను ఇప్పటికే సినిమాలో కీలక పాత్రలు పోషించనున్న నటీనటులను డేట్స్ ను నాగ్ అశ్విన్ తీసుకున్నారని, త్వరలో మొదలుపెట్టనున్నారని టాక్.
అయితే అలా ఇంకా షూటింగ్ మొదలు కాకపోయినా ఓవర్సీస్ రైట్స్ కు సంబంధించి డీల్ ఫిక్స్ అయిందన్న ఇప్పుడు వార్తలు రావడం గమనార్హం. దుబాయ్ కు చెందిన ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ సంస్థ ఫార్స్ ఫిల్మ్స్ కల్కి 2 ఓవర్సీస్ రైట్స్ ను రూ.115 కోట్ల నుంచి రూ.120 కోట్ల మధ్య భారీ మొత్తానికి సొంతం చేసుకున్నట్లు ప్రచారం సాగుతోంది. కానీ అందులో నిజమెంత అనేది ఇంకా క్లారిటీ లేదు.
ఒకవేళ నిజమైతే.. షూటింగ్ ప్రారంభానికి ముందే అంత మొత్తంలో డీల్ కుదరడం అరుదైన విషయమనే చెప్పాలి. ఫస్ట్ పార్ట్ వరల్డ్ వైడ్ గా భారీ విజయాన్ని సాధించడంతో సీక్వెల్ పై ట్రేడ్ వర్గాల్లో కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి. అందుకే ఇప్పుడు డీల్ ను కుదుర్చుకుని ఉంటారని కొందరు నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. కానీ మరికొందరు మాత్రం మరీ అంత త్వరగా అంటే రూమర్స్ అవ్వొచ్చని కామెంట్లు పెడుతున్నారు.
అయితే కొద్ది రోజులుగా అనేక సినిమాల డీల్స్ కు సంబంధించి ఎప్పటికప్పుడు వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న విషయం తెలిసిందే. అందులో నిజమున్నా లేకపోయినా.. వైరల్ అవుతూనే ఉన్నాయి. అవి కేవలం ప్రమోషన్ గా పనికొస్తున్నాయని నెటిజన్లు చెబుతున్నారు. ఇప్పుడు కల్కి 2898 ఏడీ మూవీ సీక్వెల్ ఓవర్సీస్ రైట్స్ కు సంబంధించి వస్తున్న వార్తల్లో అసలు విషయమేంటనేది మేకర్స్ కే తెలియాలి.