కథ చెప్పగలిగితే క్యాష్ వర్షం.. రూ.10 వేల నుంచి రూ.20 వేలకి పెరిగిన గిఫ్ట్!

టాలీవుడ్‌లో వెరైటీ పాత్రలతో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు సుహాస్.;

Update: 2026-02-12 10:15 GMT

టాలీవుడ్‌లో వెరైటీ పాత్రలతో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు సుహాస్. కలర్ ఫోటో, రైటర్ పద్మభూషణ్ వంటి సినిమాలతో ప్రేక్షకులను మెప్పించిన ఈ యంగ్ హీరో, ఇప్పుడు హే భగవాన్ అంటూ మన ముందుకు వస్తున్నాడు. గోపి దర్శకత్వంలో అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. అయితే, ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా మేకర్స్ అనౌన్స్ చేసిన ఒక వెరైటీ కాంటెస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయింది. వివరాలలోకి వెళితే ..

గెస్ ది స్టోరీ.. కొట్టేయ్ మనీ:

సినిమా కథను ముందుగానే ఊహించి చెప్పిన వారికి గిఫ్ట్ ఇస్తామని చిత్ర బృందం ఒక ఛాలెంజ్ విసిరింది. మొదట ఈ గిఫ్ట్ అమౌంట్ రూ.10,000 అని ప్రకటించి, ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో విజేతలను ప్రకటిస్తామన్నారు. కానీ, తాజాగా ఆ నిర్ణయాన్ని మార్చుకున్నారు. అసలు విషయం ఏమిటంటే, ఈ పోటీకి వస్తున్న స్పందన చూసి మేకర్స్ సంతోషించారు. ఇప్పటివరకు దాదాపు 1400 ఇమెయిల్స్ వచ్చాయట, అందుకే ఈ అవకాశాన్ని మరికొంత మందికి ఇవ్వాలని నిర్ణయించారు.

ప్రైజ్ మనీ డబుల్.. రూ.20 వేలకు పెంపు:

ఇకపోతే, ఈ పోటీలో గెలిచేవారికి ఇచ్చే బహుమతిని ఇప్పుడు రూ.10 వేల నుండి ఏకంగా రూ.20 వేలకు పెంచేశారు. ఆడియన్స్‌లో క్యూరియాసిటీ పెంచడానికి ఇదొక మాస్టర్ ప్లాన్ అని చెప్పాలి. మీకు తెలుసా? కేవలం డబ్బులు ఇవ్వడమే కాదు, వచ్చిన ఎంట్రీలలో టాప్ 5 మందిని ఏరికోరి సెలెక్ట్ చేస్తారు. వారిని గ్రాండ్‌గా జరిగే 'ప్రీ-రిలీజ్ ఈవెంట్' వేదికపైకి పిలిచి మరీ వంశి నందిపాటి చేతుల మీదుగా సన్మానం చేసి బహుమతిని అందజేయనున్నారు.

ఫిబ్రవరి 20న అసలు కథ ఏంటో తెలిసిపోతుంది:

శివాని నగరం హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాలో సీనియర్ నటుడు నరేష్ , సుదర్శన్ వంటి కామెడీ స్టార్స్ ఉన్నారు. ఈరోజు రిలీజ్ ఐన ట్రైలర్ చూస్తుంటే సినిమా అంతా నవ్వులమయంగా ఉంటుందని అర్థమవుతోంది. ఈ కాంటెస్ట్ లో మరి ఎవరి గెస్ కరెక్ట్ అవుతుందో? ఆ టాప్ 5 అదృష్టవంతులు ఎవరో తెలియాలంటే ప్రీ-రిలీజ్ వేడుక వరకు ఆగాల్సిందే. సినిమా ప్రమోషన్స్ కోసం ఇలాంటి కొత్త ఆలోచనలు చేయడం ప్రేక్షకులను థియేటర్లకు రప్పించడానికి మంచి దారి. కథను గెస్ చేయడం ద్వారా ప్రేక్షకులను కూడా సినిమా మేకింగ్‌లో భాగం చేసినట్లు అవుతుంది. ఇక ఫిబ్రవరి 20న థియేటర్లలోకి రానున్న ఈ చిత్రం సుహాస్ కెరీర్‌లో మరో హిట్ నిలుస్తుందో లేదో చూడాలి.




Tags:    

Similar News