రోషన్ తండ్రిని మించిన తనయుడు అవుతాడా?
ఆ తర్వాత తన తండ్రి శ్రీకాంత్ 1996లో నటించిన పెళ్లి సందడికి ఆధ్యాత్మిక సీక్వెల్ అయిన పెళ్లి సందD మూవీను 2021లో చేసి హీరోగా ఇండస్ట్రీకి పరిచయమయ్యారు.;
పుత్రుడు జనియించినప్పుడు కాదు ఆ పుత్రుడు తండ్రి పేరు నిలబెట్టినప్పుడే ఆ తండ్రి ధన్యుడు అవుతాడు. సాధారణంగా తల్లిదండ్రులు ఏ రంగంలో అయితే సెటిల్ అవుతారో.. అదే రంగంలో తమ పిల్లల్ని కూడా సెటిల్ చేయాలని ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అందులో భాగంగానే సినీ రంగం గురించి ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పుకోవాలి. సినీ ఇండస్ట్రీలో హీరోలు, హీరోయిన్లు తమకంటూ ఒక గుర్తింపును తెచ్చుకున్న తర్వాత తమ వారసులకు కూడా అదే స్థాయిని కల్పించాలని చూస్తూ ఉంటారు. అలా తల్లిదండ్రుల వారసత్వంతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన సెలబ్రిటీలు కొంతమంది తల్లిదండ్రులతో సమానంగా గుర్తింపును సంపాదించుకుంటే.. మరికొంతమంది తల్లిదండ్రులకు మించిన పాపులారిటీ అందుకుని అందరినీ ఆశ్చర్యపరుస్తూ ఉంటారు.
ఉదాహరణకు రామ్ చరణ్, ఎన్టీఆర్, ప్రభాస్, అల్లు అర్జున్, మహేష్ బాబు లాంటి హీరోల పేర్లు ప్రధమంగా వినిపిస్తూ ఉంటాయి. తల్లిదండ్రులకు మించిన పాపులారిటీని సొంతం చేసుకొని ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తున్నారు. అలా ఇప్పుడు సినీ బ్యాక్ గ్రౌండ్ తో ఇండస్ట్రీలోకి అడుగు పెడుతున్న కొత్త హీరోలు కూడా ఈ హీరోలను చూసి తమ తల్లిదండ్రులకు మించిన క్రేజ్ దక్కించుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు. అలాంటి వారిలో సీనియర్ స్టార్ హీరో శ్రీకాంత్ తనయుడు రోషన్ మేక గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరియర్ ను మొదలుపెట్టిన రోషన్ రుద్రమదేవిలో తొలిసారి కనిపించి ఆ తర్వాత నిర్మల కాన్వెంట్ సినిమాలో లీడ్ రోల్ పోషించి ఆకట్టుకున్నారు.
ఆ తర్వాత తన తండ్రి శ్రీకాంత్ 1996లో నటించిన పెళ్లి సందడికి ఆధ్యాత్మిక సీక్వెల్ అయిన పెళ్లి సందD మూవీను 2021లో చేసి హీరోగా ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. ఇక నాలుగేళ్ల గ్యాప్ తీసుకొని ఇప్పుడు ఛాంపియన్ అంటూ స్పోర్ట్స్ డ్రామా నేపథ్యంలో క్రిస్మస్ సందర్భంగా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా మంచి విజయం అందుకుంది .ఈ సినిమా సక్సెస్ తో అప్పుడే బడా నిర్మాణ సంస్థ గీత ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్ రోషన్ మేకకు తన బ్యానర్ లో సినిమా చేసే అవకాశాన్ని కల్పించారు.
ఇక దీన్ని బట్టి చూస్తే ఒక్క సినిమా ఈయనకు భారీ విజయాన్ని అందించడమే కాకుండా వరుస అవకాశాలు అందిస్తోంది అనే కామెంట్లు కూడా వ్యక్తం అవుతున్నాయి. అంతేకాదు సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో కూడా మరో ప్రాజెక్టు ఓకే అయింది.ఇలా వరుసగా అగ్ర నిర్మాణ సంస్థలతో అవకాశం రావడంతో టాలీవుడ్ లో రోషన్ క్రేజ్ మరింత పెరిగిపోయిందని చెప్పాలి.
ఇకపోతే విభిన్నమైన కథలను ఎంచుకుంటూ ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్న రోషన్ ఈ బ్యానర్లలో సినిమాలు చేసి సక్సెస్ అందుకున్నారంటే ఖచ్చితంగా మరిన్ని బడా ప్రాజెక్టులు ఈయన తలుపు తడతాయి. ఒకవేళ అవన్నీ కూడా కలిసొచ్చాయి అంటే తండ్రి శ్రీకాంత్ ను మించిన తనయుడు అవుతాడు అనడంలో సందేహం లేదు అంటూ ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు. మరి ఈ మాటను రోషన్ నిలబెట్టుకుంటారో లేదో చూడాలి.