"దళపతి" విజయ్ తెర మీద వెలుగులకు ఫుల్ స్టాప్..!
దళపతి విజయ్ సౌత్ ఇండస్ట్రీలో అత్యధిక ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న స్టార్ హీరో. కోలీవుడ్ ఇండస్ట్రీలో దాదాపు 35 ఏళ్ల కెరీర్ లో యువ హీరో నుంచి తిరుగులేని స్టార్ హీరోగా మారిన చరిత్ర ఆయనది.;
దళపతి విజయ్ సౌత్ ఇండస్ట్రీలో అత్యధిక ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న స్టార్ హీరో. కోలీవుడ్ ఇండస్ట్రీలో దాదాపు 35 ఏళ్ల కెరీర్ లో యువ హీరో నుంచి తిరుగులేని స్టార్ హీరోగా మారిన చరిత్ర ఆయనది. తనదైన శైలిలో ప్రేక్షకులను మెప్పిస్తూ యాక్షన్, కామెడీ, ఎమోషన్ ఇలా అన్నిటితో పాటు తనకు మాత్రమే సాధ్యమయ్యే స్టైలిష్ డ్యాన్స్ తో ఫ్యాన్స్ ని విజిల్స్ వేసేలా చేస్తారు దళపతి విజయ్. పోటీగా కమల్ హాసన్, రజనీకాంత్ లాంటి పెద్ద స్టార్స్ ఉన్నా కూడా వాళ్లను కూడా దాటేసే క్రేజ్ ఇమేజ్ తెచ్చుకున్నారు విజయ్.
దళపతి విజయ్ సినిమా అంటే బొమ్మ బ్లాక్ బస్టర్ అవ్వాల్సిందే..
దళపతి విజయ్ సినిమా అంటే చాలు బొమ్మ బ్లాక్ బస్టర్ అవ్వాల్సిందే అనే రేంజ్ లో అభిమానుల కోలాహలం ఉంటుంది. కోలీవుడ్ లో సూపర్ స్టార్ రజనీ ఇమేజ్ ని మ్యాచ్ చేయగల స్టార్ మరొకరు లేరన్న రోజు నుంచి రజనీని సైతం వెనక్కి నెట్టి తన స్టార్ డం చాటిన స్థాయికి ఎదిగాడు దళపతి విజయ్. సినిమాల్లో తన పాత్రలతో ఆబాల గోపాలాన్ని అలరించిన ఆయన ఇప్పుడు నిజజీవితంలో ప్రజల కోసం నిలబడుతున్నారు.
తెర మీద దళపతి విజయ్ గా ఆయన చేసిన సినిమాలు అందుకున్న అవార్డులు సృష్టించిన రికార్డులు తెలిసిందే. ఐతే 35 ఏళ్లుగా సినీ స్టార్ గా అభిమాన కథానాయకుడిగా ప్రేక్షకులను అలరించిన దళపతి విజయ్ సినిమాలకు ఫుల్ స్టాప్ పెట్టేస్తున్నారు. పాలిటిక్స్ లో వచ్చే ముందే సినిమాలకు గుడ్ బై చెప్పాలనుకున్న విజయ్ తన చివరి సినిమా జన నాయగన్ తోనే సినిమాలకు ఫుల్ స్టాప్ పెడుతున్నారు.
విజయ్ రిటైర్మెంట్..
ఐతే వాళ్లు వీళ్లు చెప్పడమే కానీ దళపతి విజయ్ తన సినిమాల రిటైర్మెంట్ గురించి చెప్పలేదుగా అని ఫ్యాన్స్ భావించారు. ఎక్కడో ఒక చిన్న ఆశతో తమ హీరో అటు రాజకీయాల్లో ఉంటూ సినిమాలు కూడా చేస్తాడని అనుకున్నారు. కానీ విజయ్ తన సినిమా అదే లాస్ట్ మూవీ జన నాయగన్ ఆడియో రిలీజ్ ఈవెంట్ లో తన సినిమా రిటైర్మెంట్ ప్రకటించారు.
కౌలాలంపూర్ లో జరిగిన జన నాయగన్ ఆడియో రిలీజ్ ఈవెంట్ లో విజయ్ ఫ్యాన్స్ ను ఉద్దేశించి మాట్లాడారు. ఇన్నేళ్లుగా తనని అభిమానిస్తున్న ఫ్యాన్స్ కి కృతజ్ఞతలు తెలిపారు. నా కోసం ఎంతోమంది సినిమా థియేటర్స్ కి వెళ్లి సినిమాలు చూశారు. ఇన్నాళ్లు తనకు సపోర్ట్ చేసిన వారి కోసం మరో 30 ఏళ్లు నిలబడతా అభిమానులకు సేవ చేయడం కోసమే సినిమాలకు స్వస్తి పలుకుతున్నా జన నాయగన్ నా చివరి సినిమా అని ప్రకటించారు దళపతి విజయ్.
విజయ్ రాజాకెయాల్లోకి రావాలనుకున్నప్పుడే సినిమాలను ఆపేయాలని నిర్ణయించుకున్నారు. ఐతే ఇదంతా సడెన్ గా జరిపోయింది. ఐతే ఈ విషయం ముందే ఫిక్స్ అయితే ఆయనతో కొన్ని క్రేజీ కాంబినేషన్ సెట్ చేయాలనుకున్న మేకర్స్ కి కాస్త ఉపయోగకరంగా ఉండేది. ఆలోచన రావడమే ఆలస్యం జనం కోసం సినిమాలను ఆపేయాలని జన నాయగన్ తన చివరి సినిమా అని ఫిక్స్ అయ్యారు దళపతి విజయ్. విజయ్ తీసుకున్న ఈ నిర్ణయం ఫ్యాన్స్ ని కాస్త ఎమోషనల్ అయ్యేలా చేస్తున్నా ఆయన రీల్ హీరో నుంచి రియల్ హీరో అయ్యేందుకు చేస్తున్న ఈ ప్రయత్నానికి అండగా నిలబడాలని భావిస్తున్నారు.