మొన్న దీపిక.. నిన్న శివాజీ.. నేడు సప్తగిరి.. వివాదాల్లో చిక్కుకున్న సెలబ్రిటీస్..

సెలబ్రిటీలు పబ్లిక్ ఫిగర్స్ కాబట్టి అప్పుడప్పుడు పబ్లిక్ ఈవెంట్లలో పాల్గొని చేసే కామెంట్లు ఒక్కొక్కసారి వివాదానికి దారితీస్తూ ఉంటాయి.;

Update: 2025-12-28 17:30 GMT

సెలబ్రిటీలు పబ్లిక్ ఫిగర్స్ కాబట్టి అప్పుడప్పుడు పబ్లిక్ ఈవెంట్లలో పాల్గొని చేసే కామెంట్లు ఒక్కొక్కసారి వివాదానికి దారితీస్తూ ఉంటాయి. ముఖ్యంగా సెలబ్రిటీలు తెలిసి మాట్లాడుతారో.. తెలియక మాట్లాడతారో తెలియదు కానీ.. ప్రేక్షకులు మాత్రం దానిని కాంట్రవర్సీగా తీసుకుంటే.. అది ఎంత పెద్ద వివాదానికి దారితీస్తుందో ఇప్పుడు ఎంతోమంది సెలబ్రిటీలను మనం చూస్తూనే ఉన్నాం.. ఉదాహరణకు మొన్న దీపిక.. నిన్న శివాజీ.. నేడు సప్తగిరి ఇలా చాలామంది వివాదాలలో చిక్కుకొని హాట్ టాపిక్ గా మారారు.

విషయంలోకి వెళ్తే.. దీపికా పదుకొనే ఈ ఏడాది ఎంతలా కాంట్రవర్సీ ఎదుర్కొందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ముఖ్యంగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో ప్రభాస్ స్పిరిట్ సినిమా చేస్తున్నారు. ఇందులో హీరోయిన్గా దీపికా పదుకొనేను మొదట ఫైనలైజ్ చేశారు కాకపోతే ఆమె అప్పుడే కూతురికి జన్మనివ్వడం.. ఎనిమిది గంటల పని దినాలు కోరడం.. పైగా రెమ్యూనరేషన్ అధికంగా అడగడంతోనే ఆమెను సినిమా నుంచి తప్పించారు. అలాగే కల్కి 2 నుండి కూడా ఈమెను తప్పిస్తూ వైజయంతి మూవీస్ బ్యానర్ అధికారికంగా ప్రకటన చేసింది. ఇక దీంతో దీపికాపై ఎంతోమంది విమర్శలు గుప్పించారు..అంతేకాదు ఆమె స్పందించినా కూడా ఆ రూమర్స్ ఆగలేదు.

ఇక రీసెంట్ టైంలో శివాజీ కూడా ఇలాగే వివాదాల్లో చిక్కుకున్నారు. ఆయన మహిళల వస్త్రధారణ గురించి మాట్లాడుతూ.. ఏకంగా మహిళ కమీషనర్ ముందు చివాట్లు కూడా పడ్డారు. ఎట్టకేలకు దిగివచ్చి క్షమాపణలు చెప్పారు.. ముఖ్యంగా ఈ విషయంలో ఎంతోమంది సెలబ్రిటీలు శివాజీకి వ్యతిరేకంగా కామెంట్లు చేసిన విషయం తెలిసిందే.. అలా శివాజీ కూడా ఈ ఏడాది చివరిలో ఇలా ఇబ్బందులు ఎదుర్కొని వార్తల్లో నిలిచారు.

అయితే ఇప్పుడు సప్తగిరి కూడా వివాదాల్లో చిక్కుకున్నారు. విషయంలోకి వెళ్తే. ప్రభాస్ , మారుతి కాంబినేషన్లో వస్తున్న చిత్రం ది రాజా సాబ్. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సప్తగిరి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. " మంచి మనసున్న మారాజు మారుతి.. మకుటం లేని మహారాజు ప్రభాస్ తో కలిసి తీసిన ఈ సినిమా సంక్రాంతికి రూ.2000 కోట్లు వసూలు చేయడం ఖాయమని" ధీమా వ్యక్తం చేశారు అయితే ఇంతవరకు బాగానే ఉన్నా ఆ తర్వాత ఆయన చేసిన కామెంట్లే ప్రభాస్ అభిమానుల ఆగ్రహానికి గురయ్యాయి. ప్రభాస్ అందరికన్నా పెద్ద కమెడియన్ అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రభాస్ అభిమానుల ఆగ్రహానికి గురయ్యాయని చెప్పవచ్చు. మొత్తానికి అయితే శివాజీ వ్యాఖ్యల దుమారం మరవకముందే సప్తగిరి చేసిన వ్యాఖ్యలు అభిమానులకు కోపాన్ని తెప్పిస్తున్నాయి. ఇలా ఈ ఏడాది ఈ ముగ్గురు కూడా వివాదాస్పద వ్యాఖ్యలతో చిక్కుల్లో పడ్డారని చెప్పవచ్చు.

Tags:    

Similar News