TS థియేట‌ర్లు తెరిచే తేదీ .. జీవో ఈరోజే!

Update: 2020-11-23 09:50 GMT
అన్ లాక్ 5.0 ప్రిక్రియ‌లో అన్ని రంగాల‌కు ఊర‌ట క‌ల్పిస్తూ కేంద్రం మార్గ‌ద‌ర్శ‌కాల్ని రిలీజ్ చేసింది. వినోద‌ప‌రిశ్ర‌మ‌కు అవ‌కాశం క‌ల్పిస్తూ రాష్ట్రాలే థియేట‌ర్లు తెర‌వాలో వ‌ద్దో నిర్ణ‌యించుకోవాల‌ని కేంద్రం నుంచి ప్ర‌క‌ట‌న వెలువ‌డింది.

ఆ క్ర‌మంలోనే చాలా రాష్ట్రాల్లో థియేట‌ర్లు తెరిచేందుకు అనుమ‌తులు ల‌భించాయి. ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం సైతం థియేట‌ర్లు ఓపెన్ చేసుకునేందుక అనుమ‌తించింది. కానీ పొరుగున ఉన్న తెలంగాణ ప్ర‌భుత్వం నుంచి దీనిపై ఎలాంటి స‌మాచారం లేదు. థియేట‌ర్లు ఎప్ప‌టికి తెరుస్తారు? అంటూ సీఎం కేసీఆర్ ని ప‌లువురు సినీపెద్ద‌లు క‌లిసారు.

ఆ క్ర‌మంలోనే సినీఇండ‌స్ట్రీ స‌మ‌స్య‌ల్ని విన్న‌వించారు. అయితే జీహెచ్ ఎంసీ ఎన్నిక‌ల సంద‌ర్భంగా.. నేడు కేసీఆర్ న‌గ‌ర‌వాసుల‌కు వ‌రాల్ని కురిపిస్తూ.. ప‌నిలో ప‌నిగా థియేట‌ర్ యాజ‌మాన్యాల‌కు తీపిక‌బురందించారు. థియేట‌ర్లు తెరిచేందుకు నేడు జీవోని రిలీజ్ చేస్తున్నామ‌ని.. అయితే థియేట‌ర్లు ఎప్పుడు తెర‌వాలి? అన్న‌దానిపై స‌మాలోచ‌న‌ల‌తో ఉండాల‌ని కేసీఆర్ కోరారు. జ‌నాలు స‌మ‌స్య‌ల్లో చిక్కుకోకుండా కాపాడాల్సిన బాధ్య‌త థియేట‌ర్ యాజ‌మాన్యాల‌కు ఉంద‌ని సూచించారు. డిసెంబ‌ర్ లో ఎప్పుడు థియేట‌ర్లు తెర‌వాలో ఎలా జాగ్ర‌త్త ప‌డాలో ఆలోచించాల‌ని అన్నారు. మొత్తానికి కేసీఆర్ తీపిక‌బురు అందించినా థియేట‌ర్ యాజ‌మాన్యాలు మాత్రం అందుకు సుముఖంగా ఉన్నాయా లేదా? అన్న‌దానికి ప్రాక్టిక‌ల్ గా జ‌వాబు రావాల్సి ఉంది. క‌రోనా మ‌హమ్మారీ రెండో వేవ్ లో ఉంది. మ‌రి ఇలాంట‌ప్పుడు ప్ర‌జ‌ల్ని ఇబ్బంది పెట్ట‌కుండా సుర‌క్షిత ఏర్పాట్ల‌తో థియేట‌ర్ల‌లో వినోదాన్ని అందించాల్సి ఉంటుంది.
Tags:    

Similar News