52 ఏళ్ల వ‌య‌సులోనూ ఇలా మెరిసిపోవడానికి కారణం, ఆమని చెప్పిన లైఫ్ సీక్రెట్!

ఇక ఫిట్‌నెస్ యాంగిల్ లో చూసుకుంటే పూజ త‌ర్వాత ఆమె చేసే యోగా కూడా కీలక అంశం. శరీరానికి వ్యాయామం ఎంతో అవ‌స‌ర‌మ‌ని ఆమె న‌మ్ముతారు.;

Update: 2026-04-23 08:30 GMT

టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించిన సీనియర్ నటి ఆమ‌ని 52 ఏళ్ల వయసులోనూ ఫిట్‌గా, ఉత్సాహంగా కనిపించడం వెనకున్న రహస్యం ఏమిటి? ఈ ప్రశ్నకు సమాధానం కోసం చూస్తే.. అది కేవలం యోగా, డైట్ మాత్రమే కాదు. ఆమె జీవితాన్ని నడిపిస్తున్న ఆధ్యాత్మిక క్రమశిక్షణ కూడా కీలక పాత్ర పోషిస్తోందనే విషయం స్పష్టమవుతోంది. ముఖ్యంగా సహస్రనామ పారాయణమే తన ఎనర్జీకి మూలం అని ఆమె చెప్పడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఫిట్‌నెస్ సీక్రెట్ యాంగిల్ నుంచి చూసినా, డిసిప్లిన్ & లైఫ్‌స్టైల్ కోణం నుంచి విశ్లేషించినా ఆమె రోజువారీ దినచర్యలో ఆధ్యాత్మికతే కేంద్రబిందువుగా కనిపిస్తుంది.

ప్రతి రోజూ తెల్లవారుజామునే లేవడం ఆమెకు అలవాటు. ఉదయం 4 గంటలకే నిద్రలేచి స్నానం చేసి పూజకు సిద్ధమవడం, ఆ తర్వాత లలితా సహస్రనామం లేదా విష్ణు సహస్రనామం పారాయణం చేయడం ఆమె దినచర్యలో తప్పనిసరి భాగం. టైమ్ లేక‌పోతే కనీసం అష్టోత్తరం అయినా చదవకుండా బయటకు వెళ్లనని చెప్పడం ఆమె భక్తిని ప్రతిబింబిస్తుంది. ఇదే ఆధ్యాత్మిక క్రమశిక్షణ ఆమెకు మానసిక ప్రశాంతతను అందిస్తోందని, ఆ ప్రశాంతతే శారీరక ఆరోగ్యంగా మారుతుందని, పూజ చేయని రోజు ఏదో కోల్పోయినట్లు అనిపిస్తుంద‌న్న ఆమె మాటలు ఆధ్యాత్మికత ఆమె జీవితంలో ఎంత ప్రధానమో తెలియజేస్తున్నాయి.

ఇక ఫిట్‌నెస్ యాంగిల్ లో చూసుకుంటే పూజ త‌ర్వాత ఆమె చేసే యోగా కూడా కీలక అంశం. శరీరానికి వ్యాయామం ఎంతో అవ‌స‌ర‌మ‌ని ఆమె న‌మ్ముతారు. అయితే ఇది కేవలం ఫిజికల్ ఫిట్‌నెస్‌కే పరిమితం కాదు, ఆధ్యాత్మికతతో కూడిన జీవనశైలి వల్లే ఆమెకు పూర్తి ఆరోగ్య సమతుల్యత లభిస్తోందని చెప్పాలి. డిసిప్లిన్, లైఫ్‌స్టైల్ ప‌రంగా చూసుకుంటే ఆమె జీవితం ఒక పాఠంలా నిలుస్తుంది. టైమ్‌కి నిద్రపోవడం, ఉదయం త్వరగా లేవడం, రోజును క్రమపద్ధతిలో గడపడం.. ఇవే ఆమె అందం, ఆరోగ్యానికి అసలు కారణాలుగా కనిపిస్తున్నాయి.

డైట్, ఆహార‌పు అల‌వాట్ల ప‌రంగా కూడా ఆమె ప్రత్యేకత స్పష్టంగా కనిపిస్తుంది. తాను అన్ని రకాల ఆహారాలను ఎంతో అద్భుతంగా వండిన‌ప్ప‌టికీ, చాలా మితంగా తింటాన‌ని చెప్పం, ఆమె కట్టుదిట్టమైన ఆహార నియమాలను తెలియజేస్తున్నాయి. గ్లామర్ ఇండస్ట్రీలో ఉన్నప్పటికీ పార్టీలకు, పబ్స్‌కు దూరంగా ఉండటం, కుటుంబానికి ప్రాధాన్యత ఇవ్వడం ఆమె వ్యక్తిత్వాన్ని మరింత ప్రత్యేకంగా నిలబెడుతుంది. ఆమె మొత్తం జీవనశైలిని గమనిస్తే మధ్యవయసు మహిళలకు ఆరోగ్యం, మానసిక ప్రశాంతత, కుటుంబ బాధ్యతల మధ్య సమతుల్యత ఎలా సాధించాలో ఆమె చూపిస్తున్న మార్గం ప్రేరణగా మారుతోంది.

Tags:    

Similar News