యశ్ తో హాలీవుడ్ మాస్టర్.. ఏంటీ మ్యాటర్?
కెజీఎఫ్ సిరీస్ తో ఇంటర్నేషనల్ లెవల్లో గుర్తింపు తెచ్చుకున్న రాకింగ్ స్టార్ యశ్, ఇప్పుడు ‘టాక్సిక్’ సినిమాతో మరోసారి బాక్సాఫీస్ వద్ద అంతకుమించి సక్సెస్ అందుకోవడానికి సిద్ధమవుతున్నారు.;
కెజీఎఫ్ సిరీస్ తో ఇంటర్నేషనల్ లెవల్లో గుర్తింపు తెచ్చుకున్న రాకింగ్ స్టార్ యశ్, ఇప్పుడు ‘టాక్సిక్’ సినిమాతో మరోసారి బాక్సాఫీస్ వద్ద అంతకుమించి సక్సెస్ అందుకోవడానికి సిద్ధమవుతున్నారు. గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. పోర్చుగీసు పాలనలోని గోవా బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఈ గ్యాంగ్‌స్టర్ డ్రామాను దర్శకురాలు అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్నారు. సినిమా అనౌన్స్ మెంట్ నుండి ప్రతి అప్‌డేట్ కోసం అభిమానులు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.
ఈ క్రమంలోనే లేటెస్ట్ గా ఈ సినిమా సెట్స్ నుండి ఒక క్రేజీ అప్‌డేట్ బయటకు వచ్చింది. హాలీవుడ్ ప్రముఖ యాక్షన్ డైరెక్టర్ జెజె పెర్రీ, ‘టాక్సిక్’ సినిమా సెట్స్ లో హడావుడిగా కనిపించారు. ఈ సినిమా కోసం జరుగుతున్న యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరణలో ఆయన పాల్గొంటున్నారు. జెజె పెర్రీ గతంలో ‘జాన్ విక్’, ‘ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్’ వంటి సూపర్ హిట్ సినిమాలకు యాక్షన్ కంపోజ్ చేశారు.
ఇప్పుడు యశ్ తో కలిసి పని చేస్తుండటంతో, ఈ సినిమాలో యాక్షన్ సీన్స్ ఏ రేంజ్ లో ఉండబోతున్నాయో ఊహించుకోవచ్చు. జెజె పెర్రీ స్వయంగా యశ్, గీతూ మోహన్ దాస్ లతో ఉన్న బిహైండ్ ద సీన్స్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. జెజె పెర్రీ పోస్ట్ పై దర్శకురాలు గీతూ మోహన్ దాస్ స్పందిస్తూ.. "ఈ కాంబినేషన్ ఫ్రేమ్ లో మామూలుగా ఉండదు" అని ఒక క్రేజీ కామెంట్ చేశారు. దీనిని బట్టి చూస్తే, ఈ సినిమాలో యాక్షన్ సీన్స్ చాలా ఇంటెన్సివ్ గా, భారీ బ్లాస్ట్ లతో ఉంటాయని అర్థమవుతోంది.
యశ్ తన ప్రతి సినిమాలో యాక్షన్ సీన్స్ విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటారు. ఇప్పుడు హాలీవుడ్ టెక్నీషియన్ తో తోడవ్వడంతో, ‘టాక్సిక్’ యాక్షన్ లో కొత్త స్టాండర్డ్స్ సెట్ చేయడం ఖాయం. జెజె పెర్రీ మేకింగ్ స్టైల్ యశ్ బాడీ లాంగ్వేజ్ కు పర్ఫెక్ట్ గా సెట్ అవుతుందని చిత్ర యూనిట్ భావిస్తోంది. ఈ సినిమాలో యశ్ తో పాటు నయనతార, కియారా అద్వానీ, హుమా ఖురేషీ వంటి భారీ తారాగణం నటిస్తున్నారు.
పోర్చుగీసు పాలనలో గోవాలో సాగే రాజకీయ పరిణామాలు, గ్యాంగ్ వార్స్ ఈ కథలో హైలెట్. ఇప్పటికే అమెరికాలోని ఒక వేదికపై ఈ సినిమాకు సంబంధించిన 9 నిమిషాల ప్రివ్యూను ప్రదర్శించి మంచి రెస్పాన్స్ అందుకున్నారు. కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై వెంకట్ కె. నారాయణ యశ్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. జెజె పెర్రీ రాకతో సినిమా ప్రొడక్షన్ వాల్యూస్ మరింత పెరిగాయని చెప్పాలి. ‘టాక్సిక్’ సినిమాతో యశ్ పాన్ ఇండియా రేంజ్ దాటి గ్లోబల్ మార్కెట్ పై కన్నేశారు. జూన్ 4న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రాబోతోంది. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాను ప్రముఖ నిర్మాత దిల్ రాజు విడుదల చేస్తున్నారు.