గ్లామర్ ఇమేజ్ బ్రేక్ చేస్తున్న హీరోయిన్?

టాలీవుడ్‌లో గ్లామర్ రోల్స్‌తో గుర్తింపు పొందిన హీరోయిన్ డింపుల్ హ‌యాతి ఇప్పుడు కెరీర్‌లో కీలక మలుపు దిశగా అడుగులు వేస్తున్నట్లు కనిపిస్తోంది.;

Update: 2026-04-23 07:30 GMT

టాలీవుడ్‌లో గ్లామర్ రోల్స్‌తో గుర్తింపు పొందిన హీరోయిన్ డింపుల్ హ‌యాతి ఇప్పుడు కెరీర్‌లో కీలక మలుపు దిశగా అడుగులు వేస్తున్నట్లు కనిపిస్తోంది. ఇప్పటివరకు ప్రధానంగా గ్లామర్‌కు ప్రాధాన్యం ఉన్న పాత్రల్లోనే కనిపించిన ఈ నటి, తాజాగా నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రల వైపు మళ్లుతున్నట్లు వస్తున్న వార్తలు ఇండస్ట్రీలో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న తదుపరి సినిమాలో విలన్ తరహా పాత్ర కోసం ఆమె పేరు వినిపించడం, ఈ మార్పు సాధారణం కాదని సూచిస్తోంది. డైరెక్ట‌ర్ KS ర‌వీంద్ర‌న్ తెరకెక్కిస్తున్న ఈ ప్రాజెక్ట్ ప్రీ ప్రొడక్షన్ దశలో ఉండగానే, డింపుల్ పాత్రపై చర్చ మొదలవడం ఆమె కెరీర్‌లో ఇది టర్నింగ్ పాయింట్ కావొచ్చన్న సంకేతాలను ఇస్తోంది.

మరోవైపు, నందమూరి బాలకృష్ణ హీరోగా, గోపీచంద్ మ‌లినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న ప్రాజెక్ట్‌లో కూడా డింపుల్ నెగెటివ్ రోల్‌లో కనిపించవచ్చన్న ప్రచారం హాట్ టాపిక్‌గా మారింది. అయితే ఈ వార్తలను డైరెక్ట‌ర్ ఇన్‌డైరెక్ట్ గా ఖండించినప్పటికీ, ఒకేసారి రెండు పెద్ద ప్రాజెక్ట్స్‌తో ఆమె పేరు అనుసంధానమవడం విశేషంగా మారింది. ఒకవేళ ఈ రెండు అవకాశాలు నిజమైతే, డింపుల్ కెరీర్‌లో ఇది డబుల్ ఇంపాక్ట్ కలిగించే మార్పుగా భావించవచ్చు. గ్లామర్ పాత్రలతో మాత్రమే పరిమితమైన ఇమేజ్‌ను బ్రేక్ చేయడానికి ఇదొక స్ట్రాట‌జిక్ డెసిష‌న్ కావొచ్చని సినీ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.

ఇటీవలి కాలంలో టాలీవుడ్‌లో హీరోయిన్లు నెగెటివ్ లేదా గ్రే షేడ్స్ ఉన్న పాత్రలను స్వీకరించడం ఒక కొత్త ట్రెండ్‌గా మారింది. ఈ నేపథ్యంలో డింపుల్ కూడా అదే మార్గాన్ని ఎంచుకోవడం యాదృచ్ఛికం కాదని చెప్పాలి. గ్లామర్ పాత్రలతో వచ్చిన గుర్తింపును మరింత విస్తరించుకోవాలంటే, నటిగా తన సామర్థ్యాన్ని చూపించే బలమైన పాత్రలు అవసరం. ఆ దిశగా నెగెటివ్ రోల్స్ ఆమెకు సరైన వేదికగా మారవచ్చు. ముఖ్యంగా ప్రేక్షకుల అంచనాలకు విరుద్ధంగా కనిపించే పాత్రలు చేయడం ద్వారా, ఆమె తనలోని నటనా వైవిధ్యాన్ని ప్రదర్శించే అవకాశం ఉంటుంది.

ఇప్పటివరకు డింపుల్ హయాతి వద్ద టాలెంట్ ఉన్నప్పటికీ, ఆమెకు సరైన బ్రేక్ ఇవ్వగలిగే పాత్రలు అందలేదన్నది ఇండస్ట్రీలో వినిపించే అభిప్రాయం. ఈ నేపథ్యంలో చిరంజీవి, బాలకృష్ణ వంటి స్టార్ హీరోల ప్రాజెక్ట్స్‌తో అనుసంధానం కావడం ఆమె కెరీర్‌కు గేమ్ ఛేంజర్‌గా మారే అవకాశముంది. ఒకవేళ ఈ నెగెటివ్ రోల్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటే, ఆమెకు ఫ్యూచ‌ర్ లో మరింత విభిన్నమైన పాత్రలు దక్కే అవకాశం ఉంది.

మొత్త‌మ్మీద, గ్లామర్ నుంచి నెగెటివ్ రోల్‌కి డింపుల్ హయాతి మార్పు కేవలం పాత్రల మార్పు మాత్రమే కాదు, అది ఆమె కెరీర్ దిశను మార్చే కీలక నిర్ణయంగా కనిపిస్తోంది. ఈ ట్రాన్స్‌ఫర్మేషన్ విజయవంతమైతే, ఆమెను టాలీవుడ్‌లో మ‌రో కొత్త యాంగిల్ లో చూడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇప్పుడందరి చూపు ఈ ప్రాజెక్ట్స్ యొక్క అఫీషియ‌ల్ అనౌన్స్‌మెంట్ పైనే నిలిచింది.

Tags:    

Similar News