వింటేజ్ లుక్స్‌లో సత్యదేవ్- దీపా థామస్.. రావు బహదూర్ ప్రమోషన్స్‌లో కొత్త స్ట్రాటజీ!
ఇక సినిమా రిలీజ్ టైమ్ దగ్గర పడుతుండడంతో, చిత్ర బృందం ప్రమోషన్స్‌పై దృష్టి పెట్టింది. అయితే సాధారణ ప్రమోషన్స్ కంటే భిన్నంగా చేయాలనే ఉద్దేశంతో టీమ్ ముందుకు సాగుతోంది.;
టాలీవుడ్‌లో విభిన్న కథలను ఎంచుకుంటూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు సత్యదేవ్ మరోసారి ఆసక్తికరమైన ప్రాజెక్ట్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఆయన హీరోగా నటిస్తున్న తాజా చిత్రం రావు బహదూర్ ప్రస్తుతం ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారుతోంది. సెన్సిబుల్ కథనాలతో గుర్తింపు పొందిన డైరెక్టర్ వెంకటేష్ మహా ఈ సినిమాకు రచన, దర్శకత్వం వహించడం సినిమాపై ప్రత్యేక ఆసక్తిని పెంచుతోంది. గతంలో ఉమా మహేశ్వర ఉగ్రరూపస్యతో మెప్పించిన ఈ కాంబినేషన్ మళ్లీ ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నంలో ఉంది.
ఈ సినిమాలో సత్యదేవ్‌తో పాటు దీపా థామస్, వికాస్, బాలా పరాశర్, ఆనంద భారతి ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. పాత జమీందారీ నేపథ్యాన్ని ఆధారంగా చేసుకుని, సైకాలజికల్ థ్రిల్లర్ ఎలిమెంట్స్‌తో కథను మలిచినట్లు సమాచారం. కథలో ఎమోషన్స్, మానసిక సంఘర్షణలు, ప్రేమ కథ.. ఇవన్నీ ఒక ప్యాకేజీగా ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇవ్వనున్నాయని చిత్ర యూనిట్ చెప్తోంది. ముఖ్యంగా గ్రామీణ వాతావరణంలో సాగుతూ, హ్యూమన్ ఎమోషన్స్ డెప్త్ ను తడిమే ప్రయత్నం చేసినట్లు తెలుస్తోంది.
ఈ ప్రాజెక్ట్‌కు మరో స్పెషల్ ఎట్రాక్షన్, సూపర్ స్టార్ మహేష్ బాబు తన GMB ఎంటర్టైన్మెంట్ బ్యానర్ ద్వారా ఈ సినిమాను సమర్పించడం. దీంతో సినిమాపై అంచనాలు మరింతగా పెరిగాయి. శ్రీ చక్రాస్ ఎంటర్‌టైన్‌మెంట్స్, మహాయాన మోషన్ పిక్చర్స్, ఏ ప్లస్ ఎస్ మూవీస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా నిర్మాణ విలువల్లోనూ రాజీపడలేదని తెలుస్తోంది.
ఇప్పటికే షూటింగ్ ను దాదాపు పూర్తి చేసుకున్న ఈ సినిమా, సమ్మర్ లో రిలీజ్ కు సిద్ధమవుతోంది. సినిమా నుంచి రిలీజైన గ్లింప్స్‌కు మంచి స్పందన లభించగా, రీసెంట్ గా విడుదలైన ఓ సుందరి అనే లిరికల్ సాంగ్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ప్రముఖ గాయకుడు విజయ్ ఏసుదాస్ ఆలపించిన ఈ పాట మెలోడియస్ ట్యూన్‌తో పాటు విజువల్స్ పరంగా కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంది. తక్కువ సమయంలోనే ఈ సాంగ్ చార్ట్‌బస్టర్‌గా నిలవడం, సినిమాపై క్రేజ్‌ను మరింత పెంచింది.
ఇక సినిమా రిలీజ్ టైమ్ దగ్గర పడుతుండడంతో, చిత్ర బృందం ప్రమోషన్స్‌పై దృష్టి పెట్టింది. అయితే సాధారణ ప్రమోషన్స్ కంటే భిన్నంగా చేయాలనే ఉద్దేశంతో టీమ్ ముందుకు సాగుతోంది. ఇందులో భాగంగా సత్యదేవ్, దీపా థామస్ వింటేజ్ లుక్స్‌లో కనిపిస్తూ, సినిమా థీమ్‌ను ప్రతిబింబించే విధంగా ప్రమోషన్స్ ను నిర్వహించాలని డిసైడైంది. ఈ కాన్సెప్ట్ ప్రమోషన్స్ ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. ప్రస్తుతం ఇండస్ట్రీలో కంటెంట్ బలంగా ఉండే సినిమాలకు ప్రేక్షకుల ఆదరణ పెరుగుతున్న నేపథ్యంలో, రావు బహదూర్ కూడా అదే కోవలో నిలుస్తుందనే అంచనాలు వ్యక్తమవుతున్నాయి. ప్రత్యేక కథ, బలమైన నటన, నూతన ప్రచార విధానం ఇవన్నీ కలిపి ఈ సినిమాను సమ్మర్ సీజన్‌లో ఒక ప్రత్యేక ఆకర్షణగా నిలబెట్టే అవకాశం ఉందని సినీ వర్గాలు భావిస్తున్నాయి.