మెగా క్యాంపులో త్రివిక్రమ్ మూవీ??

Update: 2016-10-19 09:36 GMT
అదేంటి.. ఇప్పటికే మెగా క్యాంపులో రెండుసార్లు మెరిసాడుగా అంటారా.. అవును.. పవన్ కళ్యాణ్‌ తో రెండు సినిమాలు చేసిన త్రివిక్రమ్.. బన్నీతో కూడా రెండు సినిమాలు చేశాడు. అయితే ఈ రెండు రెండు సినిమాలూ ఒకెత్తు.. స్వయంగా మెగాస్టార్ చిరంజీవితో సినిమా చేయడం ఒకెత్తు. మనోడు రామ్ చరణ్‌ తో సినిమా చేస్తాడని అనుకుంటే.. చివరకు మెగాస్టార్ తోనే చేస్తున్నాడట.

ఆల్రెడీ 150వ సినిమాను ఫైనల్ స్టేజ్ వరకు తీసుకొచ్చేశాడు మెగాస్టార్. ఈ సినిమా పూర్తయిన వెంటనే.. గ్యాప్ తీసుకుంటారా లేదా? అనే విషయం పక్కనెట్టేస్తే.. ఖచ్చితంగా బోయపాటి శ్రీనుతో సినిమా అంటున్నారు. ఒకవేళ బోయపాటి బిజీగా ఉంటే? అబ్బే ఉండే ఛాన్సే లేదట. అయితే ఈలోపు నిర్మాత అశ్వినిదత్ తో కలసి ఇప్పుడు త్రివిక్రమ్ చిరంజీవికి ఒక లైన్ వినిపించాడట. అది నచ్చడంతో చిరంజీవి వర్క్ చేయమని చెప్పారట. గతంలో రెండుసార్లు చిరంజీవితో వర్కు చేయాల్సిన త్రివిక్రమ్ మిస్సయ్యాడు. అప్పుడెప్పుడో ఒక యాడ్ మాత్రం డైరక్ట్ చేశాడు. ఎట్టకేలకు ఇప్పటికి చిరంజీవిని సినిమాలో డైరక్షన్ చేసే ఛాన్సొచ్చింది మరి.

గతంలో 150వ సినిమా విషయంలో కూడా ఇదే విధంగా త్రివిక్రమ్ పేరు వినిపించిందిలే. కాని అప్పట్లో అవన్నీ కాదంటూ పూరి జగన్ కు ఓటేశారు. చివరకు కత్తి రీమేక్ ను తీసుకుని వివి వినాయక్ ను ఫైనల్ చేశారు. చూద్దాం మరి త్రివిక్రమ్ ప్రాజెక్టు ఏమవుతుందో!!!

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News