హృతిక్ రోషన్ vs ఏలియన్ రాకీ..ప్రాజెక్ట్ హైల్ మేరీ వీడియో వైరల్..!
బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ మరోసారి తన క్రియేటివ్ ఐడియాతో అభిమానులను ఆకట్టుకున్నాడు.;
బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ మరోసారి తన క్రియేటివ్ ఐడియాతో అభిమానులను ఆకట్టుకున్నాడు. హాలీవుడ్ సినిమా ప్రాజెక్ట్ హైల్ మేరీ ను భారతీయ ప్రేక్షకులకు పరిచయం చేయడానికి ఆయన ఒక స్పెషల్ ప్రమోషన్ వీడియోలో కనిపించారు. ఈ వీడియోలో హృతిక్, ఆ సినిమాలోని ఏలియన్ పాత్ర ‘రాకీ’తో కలిసి కనిపించడం విశేషం.
ఏలియన్ జాదూతో హృతిక్ రోషన్..!
ఈ వీడియో ప్రత్యేకత ఏమిటంటే, హృతిక్ పాత సైన్స్ ఫిక్షన్ సినిమా కోయీ మిల్ గయా గుర్తు రావడం. ఆ సినిమాలో హృతిక్‌కు స్నేహితుడిగా ఉన్న ఏలియన్ ‘జాదూ’ కూడా ఈ వీడియోలో కనిపిస్తుంది. రాకీ, జాదూ ఇద్దరూ ఒకే ఫ్రేమ్‌లో కనిపించడం అభిమానులకు నాస్టాల్జియా ఫీలింగ్ ఇస్తోంది.
వీడియోలో హైలైట్‌గా నిలిచిన సీన్ హృతిక్ రోషన్ తన ప్రసిద్ధ పాట ఏక్ పల్ కా జీనాలోని డ్యాన్స్ స్టెప్‌ను రాకీకి నేర్పించడం. ఒక ఏలియన్ ఆ స్టెప్ నేర్చుకోవడం చూడటం చాలా సరదాగా ఉంటుంది. అదే సమయంలో రాకీతో హృతిక్ స్నేహాన్ని చూసి జాదూ ఇచ్చే రియాక్షన్ వీడియోకి మరింత ఆకర్షణ తీసుకొచ్చింది.
ఈ క్రాసోవర్ వీడియో ద్వారా భారతీయ ప్రేక్షకులతో కనెక్ట్ అవ్వాలనే ఉద్దేశం స్పష్టంగా కనిపిస్తోంది. హృతిక్ మరియు జాదూ మధ్య ఉన్న అనుబంధాన్ని ఉపయోగించి కొత్త సినిమా కథను సులభంగా పరిచయం చేస్తున్నారు.
ప్రాజెక్ట్ హైల్ మేరీ సినిమా ప్రముఖ రచయిత ఆండీ వీర్ రాసిన నవల ఆధారంగా రూపొందింది. ఈ కథ అంతరిక్షంలో జరిగే ఒక సాహస గాథగా చూపించనున్నారు దర్శకుడు. ఇందులో హీరోగా ర్యాన్ గోస్లింగ్ నటిస్తున్నారు. అతను స్పేస్‌లో ఒంటరిగా మేల్కొని తన మిషన్ గురించి తెలుసుకునే ప్రయాణం కథలో ముఖ్య భాగంగా కుందబోతోందంట.
ఈ సినిమాను ఫిల్ లార్డ్, క్రిస్టోఫర్ మిల్లర్ దర్శకత్వం వహించారు. సాండ్రా హుల్లర్, కెన్ లెయుంగ్ తదితరులు కూడా ముఖ్య పాత్రల్లో నటించారు. ఈ చిత్రం మార్చి 26, 2026న ఇంగ్లీష్‌తో పాటు హిందీ, తెలుగు, తమిళ భాషల్లో ఐమాక్స్.. ఇతర ఫార్మాట్లలో విడుదల కానుంది.