• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  బాలకృష్ణ – వివేక్ ఆత్రేయ...

బాలకృష్ణ – వివేక్ ఆత్రేయ కాంబోలో గ్యాంగ్‌స్టర్ సినిమా!

| తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒక ఆసక్తికరమైన ప్రాజెక్ట్ ఫిక్స్ అయింది అన్న వార్తలు గట్టిగా వినిపిస్తున్నాయి.

By - Priya Chowdhary Nuthalapti
Update: 2026-03-22 19:30 GMT

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒక ఆసక్తికరమైన ప్రాజెక్ట్ ఫిక్స్ అయింది అన్న వార్తలు గట్టిగా వినిపిస్తున్నాయి. ప్రముఖ హీరో నందమూరి బాలకృష్ణ, యువ దర్శకుడు వివేక్ ఆత్రేయతో కలిసి ఒక కొత్త సినిమా చేయబోతున్నారు. ఈ సినిమా ముంబై బ్యాక్‌డ్రాప్‌లో జరిగే గ్యాంగ్‌స్టర్ డ్రామాగా ఉండబోతుందని సమాచారం. ఈ వార్త బయటకు రావడంతో అభిమానుల్లో మంచి ఆసక్తి ఏర్పడింది.

రజినీకాంత్ కోసం రాసిన కథలు బాలయ్య…!

మొదట ఈ కథను సూపర్ స్టార్ రజనీకాంత్‌కు చెప్పారని సమాచారం. అయితే ఆయన కూలీ సినిమా తర్వాత మరో గ్యాంగ్‌స్టర్ కథ చేయాలనే ఆసక్తి లేకపోవడంతో ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నారం. దీంతో ఈ కథ బాలకృష్ణ దగ్గరకు వచ్చింది. చివరకు బాలయ్య ఈ ప్రాజెక్ట్‌ను ఓకే చేయడంతో సినిమా త్వరలోనే షూటింగ్‌కు వెళ్లనుంది అని తెలుస్తోంది.

వివేక్ ఆత్రేయ సినిమాలు ఎప్పుడూ కొత్తగా ఉంటాయి. ఆయన మెంటల్ మధిలో సినిమాతో దర్శకుడిగా పరిచయం అయ్యారు. తర్వాత బ్రోచేవారెవరురా అనే క్రైమ్ కామెడీతో మంచి హిట్ అందుకున్నారు. 2022లో వచ్చిన అంటే సుందరానికి సినిమా కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇటీవల వచ్చిన సరిపోదా శనివారం సినిమా ఆయనకు మరో ప్రత్యేక గుర్తింపు తెచ్చింది.

ఇలాంటి డిఫరెంట్ సినిమాలు చేసే దర్శకుడు, మాస్ హీరో బాలకృష్ణతో పని చేయడం చాలా ఆసక్తికరంగా మారింది. బాలయ్యను స్టైలిష్ గ్యాంగ్‌స్టర్ పాత్రలో ఎలా చూపిస్తారో అని అభిమానులు ఎదురు చూస్తున్నారు. ఈ సినిమాలో యాక్షన్‌తో పాటు మంచి కథ కూడా ఉంటుందని టాక్.

ఇదిలా ఉంటే, బాలకృష్ణ మరో సినిమా NBK 111తో కూడా బిజీగా ఉన్నారు. ఈ సినిమాకు గోపిచంద్ మలినేని దర్శకత్వం వహిస్తున్నారు. హైదరాబాద్‌లో ఇప్పటికే షూటింగ్ ప్రారంభమైంది. ఈ చిత్రంలో నటుడు సముద్రఖని ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమాలో పని చేయడం తనకు అదృష్టమని ఆయన చెప్పారు.

NBK 111 సినిమాను వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్నారు. హీరోయిన్‌గా నయనతార నటించే అవకాశం ఉందని సమాచారం. ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తున్నారు.

ఇలా రెండు భారీ సినిమాలతో బాలకృష్ణ మరోసారి తన స్ట్రాంగ్ ప్రెజెన్స్ చూపిస్తున్నారు. ఈ రెండు సినిమాలపై అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు.

Tags:    
  • balakrishna 
  • vivekathreya 
  • telugumovies 
  • gangsterdrama 
  • nbk111 

Similar News

ఫైట్లు, బిల్డప్పులు లేకుండానే హీరోయిజం.. తెలుగులో దుల్కర్ సల్మాన్ స్టైలే వేరే!

2026-11-22 04:34 GMT

'హై' ట్రైలర్.. యూత్ కామెడీలో ఇన్ని ట్రాకులా!

2026-11-22 04:32 GMT

లవ్ లైఫ్‌పై ఆసక్తికర కామెంట్స్ చేసిన మీనాక్షి చౌదరి..!

2026-11-22 04:31 GMT

పెళ్లి ప్ర‌త్య‌ర్థుల‌నైనా క‌లుపుతుంది.. ఇదిగో సాక్ష్యం!

2026-11-22 00:20 GMT

అనిరుధ్ పెళ్లి రిసెప్షన్‌లో స్టార్‌ల సందడి.. ఒకే ఫ్రేమ్‌లో ఇంతమంది ప్రముఖులా!

2026-11-22 00:00 GMT

'వడ చెన్నై' లో వెట్రీ మారన్ రాసిన ఆ సీన్ కి ఫిదా అయిపోయిన స్టార్ హీరోలు...

2026-11-21 23:59 GMT

JD సౌంద‌ర్యం, ఫిట్నెస్ సీక్రెట్ తెలిసొచ్చింది!

2026-11-21 23:59 GMT

సీతాదేవి పాత్ర‌పై విమ‌ర్శ‌లు.. 'ఇఫీ' వేదిక‌గా సాయిప‌ల్ల‌వి స‌మాధానం ఇదే!

2026-11-21 18:53 GMT

వేదం డైరెక్టర్ తో మళ్లీ జతకడుతున్న అల్లు అర్జున్!

2026-11-21 18:52 GMT

శ్రీలీలకు సపోర్ట్ గా హీరో కొడుకు.. ఆ రద్దిలో ఇలా..

2026-11-21 18:50 GMT

నితిన్ కెరీర్ బెస్ట్.. నాని మాట ఇంకా పెద్దదే!

2026-11-21 18:48 GMT

న‌న్ను తీర్చిదిద్ది స్టార్‌డ‌మ్ ఇచ్చింది ఆ ప‌రిశ్ర‌మే.. ర‌కుల్ మ‌న‌సు!

2026-11-21 18:48 GMT

Copyright @2026

Powered by Blink CMS