దుబాయ్‌పై బాంబులు వేస్తుంటే ఉద్యోగం కోసం వెళ్లిన డ్యాషింగ్ న‌టుడు!

ఓవైపు ఇరాన్ గ‌ల్ఫ్ దేశాల‌పై మిసైళ్లు, డ్రోన్ల‌తో విరుచుకుప‌డుతోంది. అమెరికా- ఇజ్రాయేల్ తో స్నేహం చేసిన పాపానికి గ‌ల్ఫ్ తీవ్రంగా న‌ష్ట‌పోతోంది.;

Update: 2026-03-22 17:56 GMT

ఓవైపు ఇరాన్ గ‌ల్ఫ్ దేశాల‌పై మిసైళ్లు, డ్రోన్ల‌తో విరుచుకుప‌డుతోంది. అమెరికా- ఇజ్రాయేల్ తో స్నేహం చేసిన పాపానికి గ‌ల్ఫ్ తీవ్రంగా న‌ష్ట‌పోతోంది. ఇరాన్ దాడుల్లో ప్ర‌ఖ్యాత `బుర్జ్ ఖ‌లీఫా భ‌వంతి`లో చిన్న భాగం పాక్షికంగా ధ్వంశ‌మైన ఫోటోలు వీడియోలు ఇప్ప‌టికే ఇంట‌ర్నెట్ లో వైర‌ల్ అయ్యాయి.

ఇప్ప‌టికీ దుబాయ్ స‌హా గ‌ల్ఫ్ పై ఇరాన్ దాడుల‌ను ఆప‌లేదు. ఎట్నుంచి ఏ డ్రోన్ విరుచుకుప‌డుతుందో, బాంబులు విసురుతుందోననే భ‌యాందోళ‌న‌లు అలానే ఉన్నాయి. దుబాయ్ లోని అమెరికా స్థావ‌రాల‌పై ఇరాన్ నుంచి మిసైల్స్ కూడా వ‌చ్చి ప‌డుతున్నాయి. ఈ యుద్ధం ఇప్ప‌ట్లో ఆగేట్టు లేదు. ఇలాంటి భ‌యాన‌క స‌న్నివేశంలో ఒక ప్ర‌ముఖ న‌టుడు త‌న ఉద్యోగం కాపాడుకోవ‌డం కోసం, ఇన్ టైమ్ లో ప‌నుల్ని పూర్తి చేయ‌డం కోసం కుటుంబాన్ని వ‌దిలి దుబాయ్ కి వెళుతున్నాడు. అత‌డు బుర్జ్ ఖ‌లీఫాలో ఉద్యోగం చేయాల్సి ఉంటుంది. అక్క‌డ త‌న‌కు ఒక ఇల్లు కూడా ఉంది. ఆ భ‌వంతిలోని త‌న ఇంట్లో కూచుని ప‌ని చేయాల్సి ఉంది. ఆస‌క్తిక‌రంగా ఇటీవ‌ల ఇరాన్ గ‌ల్ఫ్ దేశంలోని అన్ని ప‌ర్యాట‌క స్థ‌లాల‌పైనా దాడులు చేస్తామ‌ని, త‌గ్గేదే లేద‌ని ప్ర‌క‌టించి భ‌య‌పెట్టింది. ఇలాంటి స‌మ‌యంలో ఈ న‌టుడు ఇలాంటి సాహ‌సం చేయ‌డం స‌రైన‌దేనా? ఇది అత‌డి మూర్ఖ‌త్వంగా చూడాలా?

అయితే అత‌డికి సాహ‌సం చేయ‌డం వెన్న‌తో పెట్టిన విద్య‌. రిస్కులు చేస్తాడు గ‌నుక‌నే ఒక సాధార‌ణ న‌టుడిగా ఉన్న అత‌డు ఏకంగా 135 కోట్ల ఆస్తుల‌ను కూడ‌గ‌ట్టాడు.. ఆకాశ హార్మ్యాల‌ బుర్జ్ ఖ‌లీఫాలో సొంత ఇంటిని క‌లిగి ఉన్నాడు. ఇటీవ‌లే భార్య పిల్ల‌ల్ని ఒప్పించి దుబాయ్ వెళ్లేందుకు సిద్ధ‌మ‌వుతున్నాడు. ఈ మ‌ధ్య‌నే అత‌డు త‌న భార్య కుటుంబంతో దుబాయ్ నుంచి ఎస్కేప్ అయ్యి ముంబైకి వ‌చ్చాడు. కానీ ఇప్పుడు భార్య పిల్ల‌లు లేకుండా త‌ను ఒక్క‌డే దుబాయ్ కి వెళుతున్నాడు. అయితే ఇంట్లో వాళ్ల‌ను క‌న్విన్స్ చేయ‌డానికి అత‌డు వారితో యుద్ధ‌మే చేయాల్సి వ‌చ్చింద‌ట‌. కానీ అత‌డికి ఆ ప‌ని ఎంత ముఖ్య‌మో అర్థం చేసుకున్న భార్య చివ‌రికి క‌న్విన్స్ అయ్యారు. అత‌డు త‌న లగేజ్ స‌ర్ధుకుని రెడీగా ఉన్నాడు. ముంబై నుంచి దుబాయ్ లో అడుగుపెట్టేందుకు ఇంకెంతో స‌మ‌యం లేదు. అయితే ఈ ఎపిసోడ్ లో ఆ న‌టుడి ధైర్య‌సాహ‌సాల‌ను నెటిజ‌నులు మెచ్చుకోకుండా ఉండ‌లేక‌పోతున్నారు.

ఇంత‌కీ ఆ న‌టుడు ఎవ‌రో తెలుసా? అత‌డి పేరు రామ్ క‌పూర్. ఒక సాధార‌ణ న‌టుడే అయినా ఏకంగా 135 కోట్ల ఆస్తుల‌ను కూడ‌గ‌ట్టి అత‌డు త‌న పెట్టుబ‌డుల విజ్ఞానంతో అంద‌రినీ ఆశ్చ‌ర్య‌ప‌రిచాడు. అందుకే అత‌డి గురించి ఎక్కువ‌గా ఇంట‌ర్నెట్ లో చ‌ర్చ సాగుతోంది. అత‌డు దుబాయ్ బుర్జ్ ఖ‌లీఫాలో క్షేమంగా త‌న ఉద్యోగ బాధ్య‌త‌ల‌ను నిర్వ‌ర్తించాల‌ని... తిరిగి త‌న కుటుంబానికి చేరుకోవాల‌ని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. అయితే ఇరాన్ వ‌ర్సెస్ అమెరికా- ఇజ్రాయేల్ వార్ ఎప్ప‌టికి ముగుస్తుందో ఇంకా క్లారిటీ అయితే రాలేదు.

Tags:    

Similar News