లేటువ‌య‌సు క్వీన్‌ జాక్‌ పాట్

Update: 2018-08-17 06:15 GMT

అస‌లింత‌కీ త్రిష ఏమైంది? అస‌లు టాలీవుడ్‌ లో క‌నిపించ‌దేం? అభిమానుల్లో ఎన్నో సందేహాలు. నిశ్చితార్థం జ‌రిగి - అటుపై పెళ్లి ముంగిట ఫెయిల్యూర్‌ ని ధీటుగా ఎదుర్కొంది. అటుపై రీఎంట్రీని అంతే ఛాలెంజింగ్ గా తీసుకుని కొత్త ప‌రిశ్ర‌మ‌ల్లోకి ప్ర‌వేశించింది. క‌న్న‌డ‌లో డెబ్యూ సినిమానే బ్లాక్‌ బ‌స్ట‌ర్. అయితే ఎందుక‌నో తెలుగులో తిరిగి రీఎంట్రీ ఇచ్చేందుకు తాను చేసిన ప్ర‌య‌త్నాలేవీ ఫ‌లించ‌లేదు. ఇక్క‌డ వెంకీ - బాల‌య్య లాంటి సీనియ‌ర్ హీరోలు కూడా ఛాన్సివ్వ‌క‌పోవ‌డం త‌న‌ని తీవ్రంగానే నిరాశ‌ప‌రిచింది.

ఆ క్ర‌మంలోనే కొన్ని ఓపెనింగులు చేసుకుని, మ‌ధ్య‌లో ఆగిపోయిన సినిమాల‌తో టైమ్ వేస్ట్ చేసింది. మ‌రికొన్ని వెయిటింగులోనే కాలం గ‌డిచిపోతోంది. రీసెంటుగానే లాంగ్ టైమ్ వెయిటింగ్ మూవీ `మోహిని` రిలీజ‌వుతోంద‌న్న ప్ర‌చారం సాగింది. అయినా ఇప్ప‌టికీ ఆ సినిమా వ‌స్తోందో లేదో తెలీని ప‌రిస్థితి. 15 ఏళ్ల సుదీర్ఘ‌మైన కెరీర్‌ ని సాగించిన త్రిష‌కు చివ‌రికిలా అవుతోందేంటి? అన్న ప్ర‌శ్న అభిమానుల్లో ఉంది. అయితే ఈ దీనికి అట్నుంచి స‌రైన స‌మాధాన‌మే ఉంది.

అస‌లింత‌కీ ఇప్ప‌టికి త్రిష స్టాట‌స్ ఏంటి? అని ప్ర‌శ్నిస్తే.. ఇదిగో అదిరిపోయే స‌మాధానం వ‌చ్చింది. ఇప్ప‌టికిప్పుడు ఈ అమ్మ‌డు త‌మిళంలో ఐదు సినిమాలు చేస్తోంది. 96 - గ‌ర్జ‌నై - శ‌తురంగ వెట్టై 2 - 1818 (త‌మిళ్‌ - తెలుగు) - ప‌ర‌మ‌ప‌దం విళ‌యాట్టు చిత్రాల్లో న‌టిస్తోంది. వీటికి తోడు సూప‌ర్‌ స్టార్ ర‌జ‌నీకాంత్ స‌ర‌స‌న అవ‌కాశం అందుకుంది. ర‌జ‌నీ న‌టించే 162వ సినిమాలో త్రిషను ఫైన‌ల్ చేశార‌న్న వార్త వేడెక్కిస్తోంది. కార్తీక్ సుబ్బ‌రాజు ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్క‌నున్న హార‌ర్ బేస్డ్ సినిమా ఇది. స‌న్ పిక్చ‌ర్స్ సంస్థ నిర్మిస్తోంది. న‌వాజుద్దీన్ సిద్ధిఖి - విజ‌య్ సేతుప‌తి - బాబీ సింహా - మేఘా ఆకాష్‌ - సిమ్ర‌న్ త‌దిత‌రులు ఈ చిత్రంలో న‌టిస్తున్నారు. మొత్తానికి ర‌జ‌నీ రూపంలో మ‌రో జాక్‌ పాట్ ప‌ట్టేసింది లేటు వ‌య‌సు సుంద‌రి.
Tags:    

Similar News