అనుష్క ప్లాపు త్రిషకు వర్కయ్యేనా??

Update: 2016-10-12 13:23 GMT
ఏదన్నా కొత్తగా వెరైటీగా ఒక సినిమా వస్తే చాలా.. దానిని హిట్టు అని అనుకుంటారు ప్రేక్షకులు. కాని నిజానికి ప్రొడ్యూసర్ యాంగిల్ నుండి చూస్తే అంత సీన్ ఉండదు. ఎందుకంటే అక్కడ నిర్మాతలకు తడసి మోపెడు అయిపోయి ఉంటుంది. అలాంటి ఓ సినిమానే ఇప్పుడు త్రిష తన కెరియర్ పతనంగా ఉండటానికి ఎంచుకుందా?

హిందీలో అప్పటికే స్టార్ హీరోయిన్ గా చాలానే వెనకేసింది అనుష్క శర్మ. చేసిన సినిమాలు తక్కువే కాని.. వాటి ద్వారా వచ్చిన యాడ్లు చాలా ఎక్కువ. అందుకే అప్పట్లో తన కష్టార్జితంతో ''ఎన్.హెచ్.10'' అనే సినిమాను తీసింది అమ్మడు. తనే హీరోయిన్ అండ్ హీరో కూడా. అయితే ఈ సినిమాలో కంటెంట్ కొత్తగానే ఉన్నప్పటికీ.. అది జనాలకు ఎక్కలేదు. కాకపోతే బీభత్సంగా ప్రమోట్ చేయడం వలన.. సినిమాకు 38 కోట్ల నెట్ వచ్చింది. అంటే ఒక 25 కోట్లు షేర్ వచ్చుంటుంది. కాకపోతే ఇందులో మేకింగ్ నుండి ప్రమోషన్ కాష్టుల వరకు అన్నీ తిసేస్తే.. అనుష్కకు చేతులు కాలాయ్.

ఈ సినిమాను ఇప్పుడు తమిళంలో త్రిష మెయిన్ లీడ్ లో రీమేక్ చేస్తున్నారనే టాక్ వినిపిస్తోంది. ఎంతవరకు నిజమో తెలియదు కాని.. ఈ సినిమాను త్రిషతో కంటే కూడా ఎవరైనా ఒక రకుల్ ప్రీత్ సింగ్ లేదంటే సమంత అయితే బెటరేమో. కాస్త పవర్ ప్యాకెడ్ పెర్ఫామెన్స్ తో పాటు సినిమా బిజినెస్ కు ప్లస్సయ్యే ఛాన్సుంటుంది. లేకపోతే ఈ అనుష్క ఫ్లాపు త్రిషకు ఎలా వర్కవుట్ అవుతుంది సారూ?

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News