హాలీవుడ్ లో హీరోయిన్ ఛాన్స్.. టామ్ క్రూజ్ పక్కన ‘స్పేస్’.. వెళ్తారా..?

Update: 2020-12-21 17:30 GMT
సినిమాలో హీరోయిన్ ఛాన్స్! అది కూడా హీరోయిన్ గా.. అది కూడా హాలీవుడ్ లో.. అది కూడా యాక్షన్ స్టార్ టామ్ క్రూజ్ పక్కన! ఇంతకు మించిన అవకాశం ఎవరికైనా దక్కుతుందా..? కొత్తవారైనా ఫర్వాలేదు. ఛాన్స్ కోసం ట్రై చేసుకోవచ్చు. కానీ.. చిన్న కండీషన్. ఈ సినిమాలో హీరోయిన్ మూడు నిమిషాల్లో ఒక కిలోమీటరు దూరం పరిగెత్తగలగాలి. 20 నిమిషాల్లో 800 మీటర్ల దూరం ఈత కొట్టాలి. ఇంకా.. మూడు మీటర్ల స్ప్రింగ్ బోర్డ్ నుంచి డైవ్ చేయగలగాలి. ఇలాంటి క్వాలిటీస్ మీలో ఉంటే.. క్రూజ్ పక్కన బెర్త్ మీదే. షూటింగ్ కూడా నేల మీద కాదు.. ఆకాశంలో!

స్పేస్ లో సినిమా షూట్..
అంతరిక్షంలోకి శిక్షణ తీసుకున్న వ్యోమగాములు తప్ప.. మిగిలిన వారు ఎవరూ వెళ్లలేరు. అలా వెళ్లడానికి ఎంతో ఖర్చు కావడంతోపాటు.. మరెంతో శిక్షణ కూడా అవసరం. అన్నిరకాల శిక్షణల్లో పాసైన తర్వాతగానీ.. అంతరిక్షంలోని ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ (ISS)కు వెళ్లేందుకు అనుమతి లభించదు. కానీ.. అక్కడ ఏకంగా సినిమానే తీయబోతున్నారు.

క్రూజ్ ‘ఛాలెంజ్..’
ప్రముఖ బాలీవుడ్ యాక్షన్ స్టార్ టామ్ క్రూజ్ హీరోగా స్పేస్ లో సినిమా తీయబోతున్నారు. ఎలాంటి గ్రాఫిక్స్ లేకుండా సినిమాలోని ప్రధాన సన్నివేశాలను అంతరిక్ష కేంద్రంలోని రియల్ లొకేషన్లలో చిత్రీకరించాలని భావిస్తున్నారు. ఈ సినిమాకు ‘ఛాలెంజ్’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారు. డూప్‌తో పనిలేకుండా యాక్షన్ సన్నివేశాల్లో అదరగొట్టే అరవై ఏళ్ల టామ్ క్రూజ్‌.. అంతరిక్షంలో సైతం అదరగొడతారని చిత్ర నిర్మాతలు భావిస్తున్నారు.

రష్యా సహకారం..
ఈ సినిమా రష్యా సహకారం అందిస్తోంది. ఆ దేశానికి చెందిన ‘రోస్కోస్మోస్ స్పేస్ ఏజెన్సీ’.. ‘చానెల్ వన్’తో కలిసి ఈ భారీ బడ్జెట్ చిత్ర నిర్మాణానికి ప్లాన్ చేస్తోంది. అయితే.. అంతరిక్షంలో టామ్‌క్రూజ్ పక్కన నటించేందుకు అవసరమైన హీరోయిన్ కోసం వెతికే పనిలో పడ్డారు. కానీ.. మనం ముందుగానే చెప్పకున్నట్టు అంతరిక్షంలో ఉండగలిగే అర్హతలు ఉండాల్సి రావడంతో హీరోయన్ ఎక్కడ.. ఎప్పుడు దొరుకుతుందో చూడాలి.

అన్నీ అనుకున్నట్టుగా జరిగితే.. ఈ సినిమాను వచ్చే ఏడాది అక్టోబరు నెలలో తెరకెక్కించే అవకాశం ఉంది. నాసా, ఎలన్ మస్క్ సైతం టామ్ క్రూజ్‌తో అంతరిక్షంలో సినిమాపై ఇటీవల ఓ ప్రకటన చేశారు. ఈ సినిమా షూటింగ్ జరిగితే.. అంతరిక్షంలో షూటింగ్ జరుపుకున్న ప్రపంచ తొలి సినిమాగా ఈ మూవీ చరిత్రలో నిలిచిపోతుంది.
Tags:    

Similar News