కరోనా బారిన పడ్డ టాలీవుడ్ యువ హీరో..!
గత రెండున్నరేళ్లుగా కరోనా వైరస్ మానవాళిని ముప్పుతిప్పలు పెడుతోంది. ఆ మధ్య కాస్త గ్యాప్ ఇచ్చిన మహమ్మారి మళ్లీ విజృంభిస్తోంది. దేశవ్యాప్తంగా కోవిడ్ కేసుల సంఖ్య రోజు రోజుకి పెరుగుతోంది. కొత్త వేరియంట్ ఒమిక్రాన్ భయపెడుతున్న తరుణంలో ఇటీవల పలువురు సెలబ్రిటీలకు కరోనా పాజిటివ్ అని తేలడం ప్రజల్లో భయాందోళనలు కలిగిస్తోంది.
సినీ ఇండస్ట్రీలో గత కొన్ని రోజులుగా వరుసపెట్టి పలువురు ప్రముఖులకు కరోనా సోకుతుండటంతో సినీ అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే కమల్ హాసన్ - అర్జున్ - వడివేలు - కరీనా కపూర్ - ప్రగ్యా జైస్వాల్ వంటి నటీనటులు కరోనా బారిన పడ్డారు. ఈ క్రమంలో తాజాగా యంగ్ హీరో మంచు మనోజ్ కు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యిందని స్వయంగా వెల్లడించారు.
మంచు మనోజ్ ట్విట్టర్ వేదికగా ఈ విషయాన్ని వెల్లడిస్తూ.. “కోవిడ్ పాజిటివ్ అని తేలింది. గత వారంలో నన్ను కలిసిన ప్రతి ఒక్కరూ వెంటనే పరీక్షలు చేయించుకుని.. అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని నేను అభ్యర్థిస్తున్నాను. నా గురించి ఆందోళన పడకండి. మీ అందరి ప్రేమ, ఆశీర్వాదాలతో నేను పూర్తిగా బాగున్నాను. ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో చికిత్స తీసుకుంటున్నాను” అని పేర్కొన్నారు.
ఇక సినిమాల విషయానికొస్తే.. మంచు మనోజ్ చివరగా 2017లో 'ఒక్కడు మిగిలాడు' అనే సినిమాలో కనిపించారు. ఈ క్రమంలో కాస్త విరామం తీసుకున్న మంచు హీరో.. ‘అహం బ్రహ్మాస్మి’ అనే సినిమాని లైన్ లో పెట్టారు. మనోజ్ స్వీయ నిర్మాణంలో పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమా తెరకెక్కనుంది. వచ్చే ఏడాది ప్రారంభంలో ఈ మూవీ సెట్స్ మీదకు రానుంది.