ప్రభాస్ తో OG.. హోంబలే ప్లాన్ అదుర్స్..!
రెబల్ స్టార్ ప్రభాస్ తో హోంబలే ప్రొడక్షన్ ముచ్చటగా 3 సినిమాల అగ్రిమెంట్ చేసుకున్న విషయం తెలిసిందే.;
రెబల్ స్టార్ ప్రభాస్ తో హోంబలే ప్రొడక్షన్ ముచ్చటగా 3 సినిమాల అగ్రిమెంట్ చేసుకున్న విషయం తెలిసిందే. ఐతే ఈ సినిమాలో అందులో సలార్ సెకండ్ పార్ట్ ఒకటి ఉండగా మరో రెండు సినిమాలు ఏంటనే ఎగ్జైట్మెంట్ ఆడియన్స్ లో ఉంది. ఐతే రెబల్ స్టార్ ప్రభాస్ తో ఆల్రెడీ సాహో లాంటి క్రేజీ సినిమా చేసిన డైరెక్టర్ సుజీత్ తోనే మరో సినిమా ప్లాన్ చేస్తున్నారు హోంబలే మేకర్స్. బాహుబలి తర్వాత ప్రభాస్ ని సాహోగా చూపించి అదరగొట్టాడు సుజీత్.
పవర్ స్టార్ ఫ్యాన్స్ కి మర్చిపోలేని ట్రీట్..
ఆ సినిమా కమర్షియల్ లెక్కలు ఎలా ఉన్నా రెబల్ స్టార్ ని చూపించిన విధానం ఫ్యాన్స్ ని ఇంప్రెస్ చేసింది. ఐతే సాహో తర్వాత చాలా గ్యాప్ తీసుకుని పవర్ స్టార్ తో ఓజీ సినిమా చేశాడు సుజీత్. పవర్ స్టార్ ఫ్యాన్స్ కి మర్చిపోలేని ఒక సూపర్ ట్రీట్ ఆ సినిమాతో ఇచ్చాడు. అందుకే ఓజీ తర్వాత సుజీత్ తో సినిమా చేసేందుకు నిర్మాతలే కాదు స్టార్స్ కూడా రెడీ అనేస్తున్నారు.
ఈ క్రమంలో హోంబలే ప్రొడక్షన్స్ ప్రభాస్ తో సుజీత్ సినిమా లాక్ చేశారని తెలుస్తుంది. ఎలాగు హోంబలే తో ప్రభాస్ మరో 3 సినిమాలు చేయాల్సి ఉండగా అందులో ఒకటి సలార్ 2 ఉంటుంది. మరో సినిమా సుజీత్ డైరెక్షన్ లో వస్తుంది. ఐతే ఓజీ సినిమాలో కూడా సలార్ గురించి అలా ఒక హింట్ ఇచ్చాడు సుజీత్. మరి ప్రభాస్ తో నెక్స్ట్ చేసే సినిమా సాహో సీక్వెల్ అవుతుందా లేదా ఓజీ యూనివర్స్ అవుతుందా అన్న సస్పెన్స్ మొదలైంది.
సుజీత్ ప్రభాస్ సినిమా..
ప్రభాస్ ప్రస్తుతం రాజా సాబ్, ఫౌజీ సినిమాలను పూర్తి చేశాడు. రీసెంట్ గానే సందీప్ వంగాతో స్పిరిట్ మొదలు పెట్టాడు. ఆ సినిమాతో పాటు కల్కి 2 ని నెక్స్ట్ ఇయర్ సెట్స్ మీదకు తీసుకెళ్తారని తెలుస్తుంది. సలార్ 2 కూడా 2027లో ప్లాన్ చేస్తున్నారట. ఈలోగా సుజీత్ నెక్స్ట్ నానితో ఒక ప్రాజెక్ట్ చేస్తున్నాడు. సుజీత్ నాని సినిమా పూర్తి కాగానే ప్రభాస్ తో సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్ మొదలు పెడతారని తెలుస్తుంది. మొత్తానికి రెబల్ స్టార్ ప్రభాస్ లైనప్ లో సాహో సుజీత్ అదే ఓజీతో ఫ్యాన్స్ కి ఫీస్ట్ అందించిన డైరెక్టర్ రావడం రెబల్ ఫ్యాన్స్ ని ఖుషి చేస్తుంది.
కచ్చితంగా సుజీత్, ప్రభాస్ కాంబో సినిమాపై నేషనల్ లెవెల్ లో హైప్ ఉంటుందని చెప్పొచ్చు. మరి ఈసారి ఈ కాంబో ఎలాంటి కథతో వస్తారన్నది చూడాలి. సుజీత్ మాత్రం వరుస స్టార్ హీరోలతో పర్ఫెక్ట్ ప్లానింగ్ తో దూసుకెళ్తున్నాడు. నాని, ప్రభాస్ తర్వాత సుజీత్ మరోసారి పవన్ కళ్యాణ్ తో సినిమా చేసే అవకాశాలు ఉన్నాయని తెలుస్తుంది.