దివి కండీషన్స్..మరి తనెక్కడో!
బిగ్‌బాస్ రియాలిటీ షోతో పాపులారిటీని సొంతం చేసుకున్న చిన్నది దివి. ఆ క్రేజ్‌తో సినిమాల్లో రాణించాలని విశ్వప్రయత్నాలు చేస్తోంది;
బిగ్‌బాస్ రియాలిటీ షోతో పాపులారిటీని సొంతం చేసుకున్న చిన్నది దివి. ఆ క్రేజ్‌తో సినిమాల్లో రాణించాలని విశ్వప్రయత్నాలు చేస్తోంది. ఈ జర్నీలో తన వద్దకు వచ్చిన ప్రతి చిన్న క్యారెక్టర్‌నీ అంగీకరిస్తూ వచ్చింది. అయితే ఇప్పుడు హనీ మూవీతో షాక్ ఇస్తూ నెగెటివ్ రోల్‌తో ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ సందర్భంగా ఓ మీడియాతో ప్రత్యేకంగా మాట్లాడింది. ఈ సందర్భంగా తనకు ఈ ప్రయాణంలో ఎదురైన దెబ్బలు, మర్చిపోలేని సంఘటనలతో పాటు తనకు ఎలాంటి వరుడు కావాలో, తన కండీషన్స్ ఏంటో చెప్పేసి అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తోంద.
గత కొంత కాలంగా ఓ వ్యక్తితో పీకల్లోతు ప్రేమలో మునిగితేలిన దివి తనకు బ్రేకప్ చెప్పేసి మూవ్ ఆన్ అయిపోయిందట. ఇప్పుడు కొత్త వ్యక్తి కోసం ఎదురు చూస్తున్నానని, నచ్చిన వాడు చిక్కితే పెళ్లి పీటలెక్కడానికి తాను సిద్ధమని చెబుతోంది. అయితే కాబోయే వాడికి సంబంధించి కొన్ని కండీషన్స్ పెట్టింది. ఇంతకు ముందు తనకు కాబోయే వాడు రిచ్‌గా ఉండాలి. హీరోలా ఉండాలి. మంచి హైట్, కలర్ ఉండాలని భావించాను. అయితే ఎప్పుడైతే ఫస్ట్ లవ్‌కి బ్రేకప్ చెప్పేశానో అప్పుడే నా ఒపీనియన్ మార్చుకున్నానని చెబుతోంది.
నేను కోరుకునే వాడు నాకు బాగా నచ్చాలి. అంతే కాకుండా నన్ను అర్థం చేసుకోవాలి. నాకు పూర్తి స్వేచ్ఛనివ్వాలి. అంతే కాకుండా నాకు మంచి స్నేహితుడవ్వాలి. ఇద్దరం కలిసి సరదాగా కాఫీ తాగాలి..బాల్కనీలో ముచ్చట్లు చెప్పుకోవాలి. నన్ను ఎప్పుడూ సపోర్ట్ చేయాలి. ఇలాంటి లక్షణాలున్న వాడైతే నాకు ఓకే..అలాంటి వాడు దొరికితే పెళ్లి చేసుకోవడానికి నేను రెడీ అయి తేల్చి చెప్పింది. బ్యాంక్ బ్యాలెన్స్ ఎంతుండాలి అని అడిగతే మాత్రం ఆసక్తికరంగా స్పందించింది.
అది అవసరమే లేదని, నేను పంపాదిస్తున్నాను కదా.. నాకు కాబోయే వాడికి భారీ స్థాయిలో బ్యాంక్ బ్యాలెన్స్ ఉండాల్సిన అవసరం లేదంది. ఇండస్ట్రీ వాడై ఉండాల్సిన అవసరం లేదు.. బయటి వ్యక్తి అయితేనే ఇష్డపడతాను. హ్యాపీ సోల్‌ని కోరుకుంటున్నాను` అని తనకు కాబోయే వరుడి కండీషన్స్ బయటపెట్టింది. ఇక కెరీర్ గురించి మాట్లాడుతూ ఆసక్తికరమైన విషయాల్ని వెల్లడిస్తూనే పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌పై తనకున్న క్రష్‌ని బయటపెట్టింది.
ప్రభాస్ అంటే చాలా ఇష్టం ఎంత ఇష్టం అంటే ఆయనంటే ప్రేమ.. పెళ్లి చేసుకునేంత ప్రేమ అంటూ సిగ్గుల మొగ్గయి మెళికలు తిరిగిపోయింది. ప్రతి ఒక్కరికీ డ్రీమ్ రోల్ అంటూ ఉంటుంది మరి మీ డ్రీమ్ రోల్ ఏదని, ఎలాంటి పాత్రలో నటించాలనుకుంటున్నారని అడిగితే ` చియాన్ విక్రమ్, సూర్య నటించిన `పితామగన్` (శివపుత్రుడు)లో సంగీత పోషించిన తరహా పాత్రలో నటించాలని ఉందని చెప్పింది. హనీలో తనది నెగెటివ్ రోల్, కరుణ్ కుమార్‌పై ఉన్న నమ్మకం, ఇందులో నటించిన, వర్క్ చేసిన వాళ్లంతా తెలిసిన వాళ్లే కావడం..ఫస్ట్ టైమ్ చేస్తున్న నెగెటివ్ రోల్ కావడంతో చేశానని చెప్పుకొచ్చింది.