ర‌ష్మిక‌కు మెంట‌లెక్కి పోయిందా?

ఈ నేప‌థ్యంలోనే ర‌ష్మిక అంతా ఎదురు చూస్తున్న‌ట్టుగానే `రౌడీ జ‌నార్ధ‌న‌` గ్లింప్స్‌పై సోష‌ల్ మీడియా వేదిక‌గా స్పందించింది.;

Update: 2025-12-23 06:01 GMT

రౌడీ హీరో విజ‌య్‌దేవ‌ర‌కొండ న‌టిస్తున్న లేటెస్ట్ క్రేజీ మూవీ `రౌడీ జ‌నార్ధ‌న‌`. ర‌వి కిర‌ణ్ కోలా ద‌ర్శ‌కుడు. శ్రీ‌వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై దిల్ రాజు, శిరీష్ ఈమూవీని నిర్మిస్తున్నారు. కెరీర్‌లో తొలిసారి గోదావ‌రి యాస‌ని ఈ సినిమా కోసం విజ‌య్ దేవ‌ర‌కొండ ట్రై చేస్తున్నాడు. కీర్తి సురేష్ హీరోయిన్‌గా న‌టిస్తున్న ఈ మూవీ టైటిల్ గ్లింప్స్‌ని రీసెంట్‌గా మేక‌ర్స్ విడుద‌ల చేయ‌డం తెలిసిందే. 80వ ద‌శ‌కం నేప‌థ్యంలో సాగే ర‌స్టిక్‌, అండ్ రూత్‌లెస్ మూవీగా తెలుస్తోంది.



 


రీసెంట్‌గా విడుద‌ల చేసిన గ్లింప్స్‌లో విజ‌య్ దేవ‌ర‌కొండ‌ని చూపించిన తీరు, త‌ను గోదావ‌రి యాస‌లో డైలాగ్స్ చెప్పిన విధానం ఫ్యాన్స్‌, సినీ ల‌వ‌ర్స్‌తో పాటు ఇండ‌స్ట్రీ వ‌ర్గాల‌ని కూడా విశేషంగా ఆక‌ట్టుకుంటూ హాట్ టాపిక్‌గా మారింది. విజ‌య్ ప‌క్కా మాసీవ్ అవ‌తార్‌లో ఇంటెన్స్ ఉన్న క్యారెక్ట‌ర్‌లో క‌నిపిస్తున్న తీరు సినిమాపైఅంచ‌నాల్ని పెంచేస్తోంది. చాలా రోజుల త‌రువాత మ‌ళ్లీ రౌడీ స్ట్రైక్స్ అగైన్ అని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. తాము ఏదైతే రౌడీ నుంచి ఆశిస్తున్నామో అది మ‌ళ్లీ ఇన్నాళ్ల‌కు ఈ సినిమాతో నెర‌వేర‌బోతోంద‌ని హ్యాపీగా ఫీల‌వుతున్నారు.

ఈ నేప‌థ్యంలో నేష‌న‌ల్ క్ర‌ష్‌.. విజ‌య్ ల‌వ్ ఇంట్రెస్ట్ ర‌ష్మిక మందన్న `రౌడీ జ‌నార్ధ‌న‌` గ్లింప్స్‌పై ఎలా స్పందిస్తుందా అని అంతా ఎదురు చూస్తున్నారు. విజ‌య్ మాసీవ్ లుక్‌, డైలాగ్స్‌పై ర‌ష్మిక ఎలాంటి పోస్ట్ పెడుతుందా? అన్న‌ది ఆస‌క్తిక‌రంగా మారింది. ఈ నేప‌థ్యంలోనే ర‌ష్మిక అంతా ఎదురు చూస్తున్న‌ట్టుగానే `రౌడీ జ‌నార్ధ‌న‌` గ్లింప్స్‌పై సోష‌ల్ మీడియా వేదిక‌గా స్పందించింది. విజ‌య్‌ని, ఇందులోని స్ట‌ఫ్‌ని చూసి త‌న‌కు మెంట‌లెక్కిపోయింద‌ట‌.

యూ రౌడీ ఫెల్లో..ఇదొక మెంట‌ల్ స్ట‌ఫ్‌. ఏం విజువ‌ల్స్‌.. ఏం మ్యూజిక్‌..ఏం వైబ్‌.. ఏం యాక్టింగ్.. విజ‌య్‌దేవ‌ర‌కొండ‌, ర‌వికిర‌ణ్ కోలా మీ ఇద్ద‌రు య‌మ క్రేజీ.. నేను దీన్ని చాలా ప్రేమిస్తున్నాను.. ఇష్ట‌ప‌డుతున్నాను. కీర్తిసురేష్ క్యూటీ నీకు అల్ ద బెస్ట్` అంటూ ర‌ష్మిక స్పందించింది. త‌ను రౌడీ జ‌నార్ధ‌న పిక్‌ని జ‌త చేసి ర‌ష్మిక షేర్ చేసిన ఈ పోస్ట్ ప్ర‌స్తుతం నెట్టింట వైర‌ల్‌గా మారింది. ఇదిలా ఉంటే త్వ‌ర‌లో ర‌ష్మిక మంద‌న్న‌, విజ‌య్ దేవ‌ర‌కొండ జంట కాబోతున్న విష‌యం తెలిసిందే.

ఈ నేప‌థ్యంలోనే ర‌ష్మిక మంద‌న్న `రౌడీ జ‌నార్ధ‌న‌`పై ఎలా స్పందిస్తుందా? అని ఫ్యాన్స్‌, సినీ ల‌వ‌ర్స్‌, ఇండ‌స్ట్రీ వ‌ర్గాలు ఆస‌క్తిగా ఎదురు చూశాయి. అంతా అనుకున్న‌ట్టే త‌ను స్పందించ‌డంతో ఫ్యాన్స్ మాత్రం ఖుషీ చేసుకుంటున్నారు. ర‌ష్మిక‌కు న‌చ్చిందంటే సినిమా పాన్ ఇండియా బ్లాక్ బ‌స్ట‌ర్ కావ‌డం ప‌క్కా అని సంబ‌ర‌ప‌డుతున్నారు. ఈ మూవీ త‌రువాత ర‌ష్మిక‌తో క‌లిసి విజ‌య్ దేవ‌ర‌కొండ పీరిడిక్ ఫిల్మ్‌లో న‌టిస్తున్న విష‌యం తెలిసిందే. రాహుల్ సంక్రీత్య‌న్ దీనికి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు.



Tags:    

Similar News