అనుదీప్ కామెడీ అంటే ఇదే.. విశ్వక్ సేన్‌తో ఫుల్ ఫన్ లోడింగ్..

జాతి రత్నాలు సినిమాలో ఆయన అదే తరహా వన్‌లైనర్లతో ప్రేక్షకులను విపరీతంగా ఎంటర్‌టైన్ చేశాడు. సినిమా మాత్రమే కాదు, సాధారణ ఇంటర్వ్యూల్లో కూడా అనుదీప్ చెప్పే మాటల్లో అదే సహజమైన హ్యూమర్ కనిపిస్తుంది.;

Update: 2026-02-07 12:35 GMT

అర్థంపర్థం లేనట్టుగా అనిపించే ఫంకీ డైలాగ్స్‌తోనే కడుపుఉబ్బ నవ్వించగల ప్రత్యేకమైన సత్తా ఉన్న దర్శకుడు.. అనుదీప్. జాతి రత్నాలు సినిమాలో ఆయన అదే తరహా వన్‌లైనర్లతో ప్రేక్షకులను విపరీతంగా ఎంటర్‌టైన్ చేశాడు. సినిమా మాత్రమే కాదు, సాధారణ ఇంటర్వ్యూల్లో కూడా అనుదీప్ చెప్పే మాటల్లో అదే సహజమైన హ్యూమర్ కనిపిస్తుంది. ఇప్పుడు అదే స్టైల్‌ను మరోసారి ఫంకీ చిత్రంతో చూపించబోతున్నాడు.



 


ఈరోజు విడుదలైన ఫంకీ సినిమా ట్రైలర్ చూసిన వెంటనే ప్రేక్షకులకు ఒక విషయం స్పష్టంగా అర్థమవుతుంది. ఇది పూర్తిగా అనుదీప్ స్టైల్ కామెడీ సినిమా. ట్రైలర్ మొదటి సీన్ నుంచే నవ్వులు పూయించే డైలాగ్స్‌తో స్టార్ట్ అవుతుంది. “మీ అమ్మకి ఆపరేషన్ చేయాలి” అని డాక్టర్ చెప్పగానే, “నాకు ఆపరేషన్ చేయడం రాదండి” అని అక్కడి వ్యక్తి చెప్పే సీన్ ట్రైలర్‌కు పెద్ద హైలైట్‌గా నిలిచింది. ఈ ఒక్క డైలాగ్‌తోనే దర్శకుడు అనుదీప్ KV మార్క్ హ్యూమర్ ఈ సినిమా మొత్తం ఉంటుందని చెప్పకనే చెప్పింది.

ఈ సినిమాలో విశ్వక్ సేన్ ఒక సినిమా డైరెక్టర్ పాత్రలో కనిపించబోతున్నాడు. కోమలి అనే పాత్రలో ఆయన నటన ట్రైలర్‌లోనే ఆసక్తిని పెంచింది. సినిమా తీయాలనే ఆశతో ఉన్న కోమలి..కయాదు లోహర్ నిర్మాణంలో ఒక సినిమాని ప్రారంభిస్తారు . ఆ సమయంలో ఎదురయ్యే వింత సంఘటనలు, అపార్థాలు, సరదా సన్నివేశాలే ఈ సినిమాకు ప్రధాన బలంగా కనిపిస్తున్నాయి. కథ కంటే కూడా డైలాగ్స్..సిట్యుయేషన్ కామెడీ మీదే సినిమా నడుస్తుందని ట్రైలర్ స్పష్టంగా చూపించింది.

ట్రైలర్ మొత్తం ఫంకీ డైలాగ్స్‌తో నిండిపోయింది. 2000 రూపాయల్లో 5000 రూపాయల చీర చూపించండి.. అలాగే టెన్త్ క్లాస్ లో నువ్వు ఫస్ట్ క్లాస్ ఆ.. అంతే.. కాదు టెన్త్ క్లాస్ అంటూ సాగే డైలాగులు. అనుదీప్ స్టైల్‌ను గుర్తు చేస్తున్నాయి. ఇవన్నీ చూసినప్పుడు జాతి రత్నాలు సినిమా ఫీల్ మళ్లీ గుర్తుకు వస్తుంది.

హీరోయిన్‌గా డ్రాగన్ ఫేమ్ కయాదు లోహర్ నటిస్తోంది. ఆమె పాత్ర కూడా కామెడీకి మంచి సపోర్ట్ ఇస్తుందని ట్రైలర్ చెబుతోంది. ఈ చిత్రానికి సంగీతం అందించిన భీమ్స్ సిసిరోలియో బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ట్రైలర్‌కు అదనపు ఎనర్జీ ఇచ్చింది.

ఈ సినిమాను సితార ఎంటర్‌టైన్‌మెంట్స్.. ఫార్చూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై నాగ వంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. ట్రైలర్ లాంచ్ ఈవెంట్ హైదరాబాద్‌లోని శ్రీ రాములు థియేటర్ లో జరిగింది. ఫిబ్రవరి 13న థియేటర్లలోకి రానున్న ఫంకీ, నవ్వులు పూయించే పూర్తి కామెడీ ఎంటర్‌టైనర్‌గా ప్రేక్షకులను ఆకట్టుకునేలా కనిపిస్తోంది.


Full View


Tags:    

Similar News