సాంప్ర‌దాయిని సుప్పిని సుద్ద‌పూస‌ని.. శివాజీ ఖాతాలో మ‌రో హిట్ ఖాయంలానే ఉందే!

వింటేజ్ బ్లాక్ బ‌స్ట‌ర్ క‌పుల్ గా నిలిచిన శివాజీ, ల‌య న‌టిస్తున్న చిత్రం సాంప్ర‌దాయిని సుప్పిని సుద్ధ‌పూస‌ని. సుధీర్ శ్రీరామ్ ద‌ర్శ‌క‌త్వంలో క్రైమ్ కామెడీగా ఈ మూవీ తెర‌కెక్కింది.;

Update: 2026-02-07 12:23 GMT

వింటేజ్ బ్లాక్ బ‌స్ట‌ర్ క‌పుల్ గా నిలిచిన శివాజీ, ల‌య న‌టిస్తున్న చిత్రం సాంప్ర‌దాయిని సుప్పిని సుద్ధ‌పూస‌ని. సుధీర్ శ్రీరామ్ ద‌ర్శ‌క‌త్వంలో క్రైమ్ కామెడీగా ఈ మూవీ తెర‌కెక్కింది. శ్రీ శివాజీ ప్రొడ‌క్ష‌న్స్ నిర్మిస్తున్న ఈ సినిమా ఇప్ప‌టికే షూటింగ్ పూర్తి చేసుకుని రిలీజ్ కు రెడీ అయింది. ఫిబ్ర‌వ‌రి 12న ప్ర‌ముఖ ఓటీటీ సంస్థ ఈటీవీ విన్ లో ఈ మూవీ స్ట్రీమింగ్ కు రానుంది.

రీసెంట్ గా రిలీజైన ట్రైల‌ర్

90స్ వెబ్‌సిరీస్, కోర్టు, దండోరా సినిమాల‌తో విప‌రీతంగా ఆక‌ట్టుకున్న శివాజీ ఇప్పుడు మ‌రో డిఫ‌రెంట్ కాన్సెప్ట్ తో ఆడియ‌న్స్ ను అల‌రించ‌డానికి రెడీ అవుతున్నారు. సాంప్ర‌దాయిని సుప్పిని సుద్ద‌పూస‌ని అనే టైటిల్ ను చూసి ముందు అంద‌రూ ఈ మూవీని కామెడీ సినిమా అనుకున్నారు కానీ రీసెంట్ గా ఈ మూవీ ట్రైల‌ర్ రిలీజ‌య్యాక అది సినిమాపై అంచ‌నాల‌ను పెంచుతుంది.

సినిమాపై అంచ‌నాల‌ను పెంచుతున్న ట్రైల‌ర్

2.23 నిమిషాల నిడివి క‌లిగిన ఈ ట్రైల‌ర్ లో అన్ని అంశాల‌ను చాలా బాగా మేళ‌వించారు డైరెక్ట‌ర్ సుధీర్ శ్రీరామ్. ఈ మూవీలో శివాజీ పంచాయితీ సెక్ర‌ట‌రీ పాత్ర‌లో క‌నిపించ‌గా, నిజాయితీకి మారుపేరుగా, త‌ప్పుని స‌మ‌ర్థించ‌ని వ్య‌క్తిగా ఇందులో శివాజీ క్యారెక్ట‌ర్ ను డిజైన్ చేశారు. త‌న వ‌ల్ల కానీ, త‌న వ్య‌క్తిత్వం వ‌ల్ల కానీ మ‌రెవ‌రూ ఇబ్బంది ప‌డ‌కూడ‌ద‌నుకునే వ్య‌క్తిగా శివాజీ ఈ పాత్ర‌లో క‌నిపించ‌నున్న‌ట్టు అర్థ‌మ‌వుతుంది. అలాంటి వ్య‌క్తి అనుకోకుండా ఓ స‌మ‌స్య‌లో ప‌డితే, దాన్నుంచి ఎలా బ‌య‌టికొచ్చార‌నేదే సినిమాగా తెలుస్తోంది.

ఈ మూవీలో శివాజీకి భార్య‌గా ల‌య క‌నిపించ‌గా, 90స్ వెబ్‌సిరీస్ లో శివాజీకి కొడుకుగా న‌టించిన జూనియ‌ర్ ఆర్టిస్ట్ రోహ‌న్ ఈ మూవీలో కూడా అదే పాత్ర‌లో క‌నిపించ‌నున్నాడు. రోహ‌న్, ల‌య, శివాజీతో చేసే కామెడీనే ఈ సినిమా అని తెలుస్తోంది. ఈ మ‌ధ్య శివాజీ నుంచి సైలెంట్ గా వ‌స్తున్న సినిమాలు కూడా రిలీజ్ త‌ర్వాత మంచి ఫ‌లితాల్ని అందుకుంటున్న నేప‌థ్యంలో ఈ మూవీ ఎలాంటి రిజ‌ల్ట్ ను అందుకుంటుందోన‌ని చూడ్డానికి అంద‌రూ ఎగ్జైటింగ్ గా ఉన్నారు.

హిట్ పెయిర్ గా శివాజీ, ల‌య‌

ట్రైల‌ర్ చూస్తుంటే మాత్రం సినిమాపై బాగానే ఆస‌క్తి పెరిగింది. చూస్తుంటే డైరెక్ట‌ర్ ఏదో డిఫ‌రెంట్ గా ట్రై చేసిన‌ట్టే అనిపిస్తుంది. 90స్ వెబ్‌సిరీస్ కాంబినేష‌న్ మ‌రియు శివాజీ- ల‌య కాంబినేష‌న్ కు మంచి క్రేజ్ ఉండ‌టంతో ఆ అంశం కూడా ఈ సినిమాకు క‌లిసొచ్చే అవ‌కాశ‌ముంది. శివాజీ, ల‌య క‌లిసి మిస్స‌మ్మ‌, టాటా బిర్లా మ‌ధ్య‌లో లైలా, అదిరింద‌య్యా చంద్రం, బ్ర‌హ్మ‌లోకం టూ య‌మ‌లోకం సినిమాలు చేయ‌గా వాటిలో ఆఖ‌రి సినిమా త‌ప్ప మిగిలిన మూడూ సినిమాలు మంచి స‌క్సెస్ ను అందుకున్నాయి. అలాంటి కాంబినేష‌న్ లో ఇన్నేళ్ల త‌ర్వాత వ‌స్తున్న సినిమా కావ‌డంతో దీనిపై మంచి ఆస‌క్తి నెల‌కొంది . చూస్తుంటే శివాజీ సైలెంట్ గా మ‌రో హిట్ ను త‌న ఖాతాలో వేసుకునేట్టు అనిపిస్తోంది.



Tags:    

Similar News