ఏజెంట్ సాయి శ్రీ‌నివాస..సీక్వెల్‌కు టైమ్ ప‌డుతుందా?

చిన్న చిన్న క్యారెక్ట‌ర్ల‌తో న‌టుడిగా కెరీర్ ప్రారంభించి స‌రైన అవ‌కాశం కోసం ఎదురు చూశాడు యంగ్ టాలెంటెడ్ న‌వీన్ పొలిశెట్టి. అలాంటి టైమ్‌లో అత‌న్ని వెతుక్కుంటూ వ‌చ్చిన అవ‌కావం `ఏజెంట్ సాయి శ్రీ‌నివాస ఆత్రేయ‌`.;

Update: 2026-02-07 13:46 GMT

చిన్న చిన్న క్యారెక్ట‌ర్ల‌తో న‌టుడిగా కెరీర్ ప్రారంభించి స‌రైన అవ‌కాశం కోసం ఎదురు చూశాడు యంగ్ టాలెంటెడ్ న‌వీన్ పొలిశెట్టి. అలాంటి టైమ్‌లో అత‌న్ని వెతుక్కుంటూ వ‌చ్చిన అవ‌కావం `ఏజెంట్ సాయి శ్రీ‌నివాస ఆత్రేయ‌`. ఇదొక బ్లాక్ కామెడీ మిస్ట‌రీ థ్రిల్ల‌ర్‌. స్వ‌రూప్ ఆర్‌.ఎస్‌.జె ఈ మూవీతో ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అయ్యాడు. స్వ‌ధ‌ర్మ్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ బ్యాన‌ర్‌పై రాహుల్ యాద‌వ్ న‌క్క నిర్మించిన ఈ మూవీ హీరోగా న‌వీన్ పొలిశెట్టికి మంచి పేరు, గుర్తింపుని తెచ్చి పెట్టింది. అంతే కాకుండా వ‌రుస‌గా క్రేజీ ఆఫ‌ర్ల‌ని అందించింది.

2019, జూన్ 21న సైలెంట్‌గా విడుద‌లై అనూహ్య విజ‌యాన్ని సొంతం చేసుకుంది. కేవ‌లం రూ.4 కోట్ల బ‌డ్జెట్‌తో చేసిన ఈ సినిమా బాక్సాఫీస్ వ‌ద్ద నిర్మాత‌కు కాసుల వ‌ర్షం కురిపించింది. ఏకంగా రూ.20 కోట్ల‌కు మించి వ‌సూళ్ల‌ని రాబ‌ట్టింది. మీరోగా న‌వీన్ పొలిశెట్టి స‌త్తా ఏంటో చూపించింది. న‌వీన్ పొలిశెట్టి తాజాగా `అన‌గ‌న‌గ ఒక‌రాజు` మూవీతో సూప‌ర్ హిట్‌ని సొంతం చేసుకున్న నేప‌థ్యంలో `ఏజెంట్ సాయి శ్రీ‌నివాస ఆత్రేయ‌`కు సీక్వెల్ రాబోతోందంటూ వార్త‌లు షికారు చేయ‌డం మొద‌లైంది.

కొంత మంది ఈ సీక్వెల్‌కు సంబంధించిన ప్రీ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్ కూడా స్టార్ట్ అయింద‌ని, త్వ‌ర‌లోనే మేక‌ర్స్ అధికారికంగా ప్ర‌క‌ట‌న చేయ‌బోతున్నార‌ని కూడా ప్ర‌చారం జరిగింది. హీరో న‌వీన్ పొలిశెట్టి కూడా ఈ సీక్వెల్ ఎప్పుడెప్పుడు మొద‌ల‌వుతుందా? అని ఎదురు చూస్తున్నాడ‌ని వ‌రుస క‌థ‌నాలు షికారు చేశాయి. అయితే ఈ వార్త‌ల్లో నిజం లేద‌ని తాజాగా మేక‌ర్స్ వెల్ల‌డించి క్లారిటీ ఇచ్చారు. `ఏజెంట్ సాయి శ్రీ‌నివాస ఆత్రేయ‌` మేక‌ర్స్ ఇటీవ‌ల ఓ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు. ఈ సినిమా విజ‌యం ఇందులో ప‌ని చేసిన వారంద‌రి స‌మిష్టి కృషి ఫ‌లిత‌మ‌న్నారు.

ఈ మూవీ స‌క్సెస్ ఏ ఒక్క వ్య‌క్తికి చెంద‌ద‌ని, దీన్ని ప్ర‌త్యేకంగా తీర్చిదిద్దిన ప్ర‌తి ఒక్క‌రిద‌ని పేర్కొంది. ఈ సంద‌ర్భంగా స్వ‌ధ‌ర్మ్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ సంస్థ సీక్వెల్‌పై అంద‌రికి ఓ విజ్ఞ‌ప్తి చేసింది. సీక్వెల్‌పై ఊహాగానాల‌ని ఆపేయ‌మ‌ని తెలిపింది. అంతే కాకుండా స‌రైన స‌మ‌యంలో సీక్వెల్ టైమ్ వ‌చ్చిన‌ప్పుడు త‌ప్ప‌కుండా ఆ విష‌యాన్ని అధికారికంగా ప్ర‌క‌టిస్తామ‌ని, అప్ప‌టి వ‌ర‌కు అంద‌రూ ఓపిక‌గా ఉండాల‌ని కోరింది. దీంతో `ఏసెంట్ సాయి శ్రీ‌నివాస ఆత్రేయ సీక్వెల్ పై వ‌స్తున్న వార్త‌ల‌కు బ్రేక్ ప‌డింది.

ప్ర‌స్తుతం ద‌ర్శ‌కుడు స్వ‌రూప్ ఆర్‌.ఎస్‌.జె ఓ ప్రాజెక్ట్‌లో బిజీగా ఉన్నారు. `అన‌గ‌న‌గ ఒక‌రాజు` స‌క్సెస్ త‌రువాత న‌వీన్ పొలిశెట్టి కూడా బిజీ అయ్యాడు. ప్ర‌స్తుతం స్క్రిప్ట్‌లు వింటున్న న‌వీన్ పొలిశెట్టి త్వ‌ర‌లోనే కొత్త సినిమాని ప్ర‌క‌టించ‌డానికి రెడీ అవుతున్నాడు. ఇలాంటి నేప‌థ్యంలో `ఏజెంట్ సాయి శ్రీ‌నివాస ఆత్రేయ సీక్వెల్ పై నిర్ణ‌యం తీసుకునే వీలు లేద‌ని గ్ర‌హించిన నిర్మాత‌లు దీన్ని స‌రైన స‌మ‌యంలో ప్ర‌క‌టిస్తామ‌ని అధికారికంగా వెల్ల‌డించి ఊహాగానాల‌కు చెక్ పెట్టింది.

Tags:    

Similar News