'రౌడీ జనార్ధన' బడ్జెట్.. దిల్ రాజు ఏం చెప్పారంటే..

విజయ్ దేవరకొండ హీరోగా, రవికిరణ్ కోలా దర్శకత్వంలో వస్తున్న 'రౌడీ జనార్ధన' సినిమాపై అంచనాలు గట్టిగానే ఉన్నాయి.;

Update: 2025-12-23 07:39 GMT

విజయ్ దేవరకొండ హీరోగా, రవికిరణ్ కోలా దర్శకత్వంలో వస్తున్న 'రౌడీ జనార్ధన' సినిమాపై అంచనాలు గట్టిగానే ఉన్నాయి. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్న ఈ యాక్షన్ డ్రామా టైటిల్ గ్లింప్స్ రీసెంట్ గా లాంచ్ అయ్యింది. ఈ సందర్భంగా జరిగిన ప్రెస్ మీట్ లో దిల్ రాజు గారు సినిమా బడ్జెట్, విజువల్ ఎఫెక్ట్స్ ఖర్చు గురించి ఒక ఇంట్రెస్టింగ్ క్లారిటీ ఇచ్చారు. ఒక జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నకు ఆయన తనదైన స్టైల్ లో సమాధానం చెప్పారు.

సినిమాలో విజువల్స్ చాలా గ్రాండ్ గా ఉన్నాయని, దీనికోసం బడ్జెట్ ఎంత అయ్యింది అని అడగ్గా.. దిల్ రాజు గారు చాలా సింపుల్ గా సమాధానం ఇచ్చారు. "విజువల్ కి ఖర్చు.. ఒక రోజు ఖర్చే. ఒక రోజు షూటింగ్ కి మనం ఎంతైతే స్పెండ్ చేస్తామో అంతే ఖర్చు అవుతుంది" అని చెప్పారు. అంటే విజువల్స్ కోసం కోట్లు కుమ్మరించడం కంటే, ప్లానింగ్ తో షూట్ చేయడం ముఖ్యమని ఆయన ఉద్దేశం.

ఈ విషయంలో డైరెక్టర్ రవికిరణ్ కోలాను ఆయన ప్రత్యేకంగా మెచ్చుకున్నారు. "జనరల్ గా దానికి మేము చాలా ఆలోచిస్తాం.. ఏంటి రవి ఒక రోజు షూటింగ్ పెరుగుతుంది అని అడిగితే.. రవి చాలా సింపుల్ గా కన్విన్స్ చేశాడు" అని దిల్ రాజు గుర్తుచేసుకున్నారు. "సార్ సినిమాలో షాట్ అదే వాడుతున్నాం, అర్థం చేసుకోండి అని చెప్పి.. హాఫ్ డే షూట్ దీనికోసం స్పెండ్ చేస్తున్నాం" అని రవి క్లారిటీ ఇచ్చారట.

దీన్ని బట్టి అర్థమవుతున్న విషయం ఏంటంటే.. డైరెక్టర్ రవికిరణ్ కోలాకు క్లారిటీ చాలా ఉంది. అనవసరపు ఖర్చులు లేకుండా, కేవలం సినిమాకు అవసరమైన చోట మాత్రమే ఖర్చు పెట్టి, క్వాలిటీ అవుట్ పుట్ రాబట్టేలా ప్లాన్ చేసుకున్నారు. అందుకే తక్కువ టైమ్ లోనే ఇంత అద్భుతమైన విజువల్స్ తో గ్లింప్స్ ని రెడీ చేయగలిగారని తెలుస్తోంది. దిల్ రాజు లాంటి సీనియర్ ప్రొడ్యూసర్ ని కన్విన్స్ చేయడం అంటే మామూలు విషయం కాదు.

ఇక 'రౌడీ జనార్ధన' సినిమా విషయంలో దిల్ రాజు చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారని ఈ మాటలతో అర్థమవుతోంది. బడ్జెట్ గురించి టెన్షన్ లేకుండా, డైరెక్టర్ విజన్ ని నమ్మి ముందుకు వెళ్తున్నారు. 2026 డిసెంబర్ లో రాబోయే ఈ సినిమా, విజయ్ కెరీర్ లోనే హైయెస్ట్ బడ్జెట్ మూవీగా నిలిచే అవకాశం ఉంది. క్వాలిటీ విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా సినిమా తీస్తున్నారని క్లియర్ గా తెలుస్తోంది.



Tags:    

Similar News