ప్రమోషన్స్ కోసం ఎంతకైనా దిగజరతారా?
ఎలాంటి రంగంలోనైనా తమ గురించి తాము ప్రమోట్ చేసుకుంటేనే దానికి డిమాండ్ ఏర్పడేది.;
ఎలాంటి రంగంలోనైనా తమ గురించి తాము ప్రమోట్ చేసుకుంటేనే దానికి డిమాండ్ ఏర్పడేది. ఏ బిజినెస్ అయినా అంతే. సినీ రంగంలో ఈ ప్రమోషన్స్ కాస్త ఎక్కువగా ఉండాలి. లేదంటే తాము ఎంత కష్టపడి సినిమా తీసినా అది ఆడియన్స్ కు చేరదు. అయితే ఈ ప్రమోషన్స్ ను ఒక్కొక్కరు ఒక్కోలా చేసి, ఆడియన్స్ తమ సినిమా గురించి మాట్లాడేలా చేస్తూ, తమ సినిమాలకు బజ్, హైప్ పెంచుకుంటూ ఉంటారు.
అయితే ఈ ప్రమోషన్స్ కోసం కొందరు కొన్నిసార్లు ఎంత కిందస్థాయి వరకైనా వెళ్తుంటారు. కొందరు కేవలం సమాజంలో జరిగే వాటిని మాత్రమే తమకు అనుకూలంగా మార్చుకుని తమ సినిమాలను ప్రమోట్ చేసుకుని క్యాష్ చేసుకుంటే, మరికొందరు మాత్రం తమ సినిమాలను ప్రమోట్ చేసుకోవడానికి లేనిపోనివి సృష్టిస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తూ ఉంటారు.
ఢిల్లీలో మిస్సింగ్ గర్ల్స్ పేరిట ప్రచారం
ఇప్పుడు బాలీవుడ్ లోని ఓ ప్రముఖ నిర్మాణ సంస్థ కూడా అదే చేస్తుందని ఢిల్లీ పోలీసులు చెప్తున్నారు. అసలు విషయంలోకి వెళ్తే కేవలం 15 రోజుల గ్యాప్ లో ఢిల్లీలో 800 మందికి పైగా ఆడవాళ్లు మిస్ అయ్యారని ఇంగ్లీష్ మీడియాలో భారీ కథనాలొచ్చాయి. ఈ విషయాన్ని తెలుసుకున్న ప్రజలంతా తీవ్ర భయభ్రాంతులకు గురవుతున్న సందర్భంగా తాజాగా ఢిల్లీ పోలీసులు ఈ విషయంపై స్పందించారు.
స్వార్థ ప్రయోజనాల కోసమే..
ఢిల్లీలో ఆడవాళ్లు తప్పిపోతున్నారంటూ వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని, ఇవన్నీ పెయిడ్ ప్రమోషన్స్ కు కారణమని గుర్తించినట్టు పోలీసులు తెలిపారు. రీసెంట్ గా రిలీజైన తమ సినిమాను ప్రమోట్ చేసుకోవడానికి బాలీవుడ్ లోని ఓ ప్రముఖ నిర్మాణ సంస్థ ఈ పెయిడ్ ప్రమోషన్స్ ను చేయిస్తోందని, స్వార్థ ప్రయోజనాల కోసం ఇలాంటి ప్రచారాలను చేస్తూ ఊరుకోమని, దీనిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు ఎక్స్ వేదికగా ఓ పోస్ట్ పెట్టారు.
ఈ విషయం తెలుసుకున్న ఆడియన్స్ అసలు నిర్మాణ సంస్థలు మరీ ఇంతలా ఫేక్ వార్తలను ఎలా ప్రచారం చేస్తున్నాయా అని ఆశ్చర్యపోతున్నారు. రీసెంట్ గా బాలీవుడ్ నుంచి రిలీజైన ఓ సినిమాతో పాటూ, త్వరలోనే ఓటీటీలో రిలీజ్ కానున్న మరో సినిమా కూడా ఈ మిస్సింగ్ గర్ల్స్ నేపథ్యంలోనే రాబోతుందని, దాన్ని ప్రమోట్ చేసుకోవడానికే కొందరు కావాలని ఇలా ఫేక్ ప్రమోషన్స్ ను చేస్తున్నాయని తెలుస్తోంది. ఏదేమైనా నిర్మాణ సంస్థలు ఈ రకమైన ప్రమోషన్స్ ను చేసే ధోరణి మాత్రం చాలా పెద్ద తప్పని నెటిజన్లు ఈ విషయంపై రెస్పాండ్ అవుతున్నారు.