రణవీర్ 'ధురంధర్'.. నెవ్వర్ బిఫోర్ రికార్డు పక్కానా?

సినిమా రిలీజ్ అయ్యి మూడు వారాలు పూర్తవ్వనుండగా.. ఇప్పటి వరకు ధురంధర్ మూవీ ప్రపంచవ్యాప్తంగా రూ.800 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది.;

Update: 2025-12-23 06:30 GMT

కొన్ని రోజులుగా ఎక్కడ చూసినా ధురంధర్‌ పేరే వినిపిస్తోంది. బాలీవుడ్ స్టార్ హీరో రణవీర్ సింగ్ లీడ్ రోల్ లో యాక్షన్ డ్రామాగా రూపొందిన ఆ సినిమా.. డిసెంబర్ 5వ తేదీన వరల్డ్ వైడ్ గా రిలీజైంది. బ్లాక్‌ బస్టర్‌ హిట్ గా నిలిచి బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపిస్తోంది. రిలీజై 17 రోజులైనా ఓ రేంజ్ లో సందడి చేస్తోంది.

సినిమా రిలీజ్ అయ్యి మూడు వారాలు పూర్తవ్వనుండగా.. ఇప్పటి వరకు ధురంధర్ మూవీ ప్రపంచవ్యాప్తంగా రూ.800 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది. రూ.870 కోట్ల కలెక్షన్స్ రాబట్టగా.. రూ.900 కోట్ల మైలురాయి వైపు పరుగులు పెడుతోంది. అయితే ఇప్పటి వరకు బాక్సాఫీస్ వద్ద ఎన్నో రికార్డులను బద్దలు కొట్టింది ధురంధర్.

2025లో ఇప్పటికే భారీ వసూళ్లు సాధించిన ఛావా, కాంతార చాప్టర్ 1 సినిమాలను అధిగమించిన ధురంధర్.. ఈ ఏడాదిలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా అవతరించింది. 2025 బాక్సాఫీస్ వద్ద టాప్ ప్లేస్ లో కొనసాగుతోంది. అదే స్థానాన్ని అలాగే పదిలం చేసుకుంటుందనే చెప్పాలి.

అయితే అవతార్-3 థియేటర్స్ లో ఉన్నా, ధురంధర్ దూకుడు మాత్రం తగ్గడం లేదు. దీంతో మరికొద్ది రోజుల్లో రూ.1000 కోట్ల ఫీట్ ను అందుకునేలా కనిపిస్తుంది. రూ.1000 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన చిత్రాలు ఇప్పటి వరకు మొత్తం 8 ఉండగా.. ఆ క్లబ్‌ లో చేరిన 9వ చిత్రంగా నిలవనుంది ధురంధర్ మూవీ.

అంతే కాదు.. టాలీవుడ్‌ రికార్డును బాలీవుడ్‌ తో సమం చేయనుంది. ఎందుకంటే రూ.1000 కోట్ల క్లబ్ లో తెలుగు నుంచి నాలుగు (బాహుబలి-2, పుష్ప-2, ఆర్‌ఆర్‌ఆర్‌, కల్కి 2898 ఏడీ), హిందీ నుంచి మూడు (దంగల్‌, జవాన్‌, పఠాన్‌) ఉన్నాయి. ఇప్పుడు ధురంధర్ చేరితే.. బాలీవుడ్ నుంచి కూడా 4 సినిమాలు ఉంటాయి.

ఇదంతా ఒకెత్తు అయితే.. ధురంధర్ 1000 కోట్ల ఫీట్ అందుకుంటే మరో క్రేజీ రికార్డు కూడా క్రియేట్ అవుతుంది. నిజానికి.. ధురంధర్ కు రిలీజ్ కు ముందు సెన్సార్ బోర్డు ఏ సర్టిఫికెట్ జారీ చేసింది. దాంతోనే సినిమా రిలీజై.. ఆడియన్స్ నుంచి అదిరిపోయే రెస్పాన్స్ అందుకుని.. రూ.1000 కోట్ల క్లబ్ వైపు పరుగులు పెడుతోంది.

ఆ క్లబ్ లో చేరితే.. ఏ సర్టిఫికెట్ తో ప్రతిష్టాత్మక 1000 కోట్ల క్లబ్‌ లో చేరిన మొదటి చిత్రంగా ధురంధర్ నిలవనుంది. ఇది మామూలు విషయం కాదనే చెప్పాలి. ఇప్పటి వరకు 'ఏ' సర్టిఫికెట్ అందుకున్న ఏ సినిమా కూడా ఆ ఫీట్ అందుకోలేదు. ఇప్పుడు ధురంధర్ కు ఆ ఘనత త్వరలో దక్కేలా కనిపిస్తోంది!

Tags:    

Similar News