కెరీర్ జీరో.. ప‌ర్స‌న‌ల్ లైఫ్ ఢ‌మాల్.. ప్ర‌శాంత‌త కోసం భ‌క్తిలోకి యువ న‌టి

ఇటీవ‌లి కాలంలో నేపో కిడ్ అన‌న్య పాండే కెరీర్ లో, లైఫ్ జ‌ర్నీలో ఏం జ‌రుగుతోంది? ప్ర‌స్తుతం ఆశించిన‌న్ని ప్రాజెక్టులు చేతిలో ఉన్నాయా? అంటే దీనికి స‌రైన జ‌వాబు చెప్ప‌లేని ప‌రిస్థితి.;

Update: 2026-02-10 03:59 GMT

నేపో కిడ్స్ గురించి చాలా చ‌ర్చ జ‌రుగుతుంటుంది. తండ్రి పెద్ద స్టార్ అయితేనో లేదా త‌ల్లినుంచో తాత అమ్మ‌మ్మ‌ల నుంచో న‌ట‌వార‌స‌త్వం అందిపుచ్చుకుని ప‌రిశ్ర‌మ‌లో అడుగుపెడ‌తారు కాబ‌ట్టి పెద్ద స్టార్ అయిపోతార‌ని ఊహించుకుంటారు. ఇండ‌స్ట్రీలో ప‌రిచ‌యాల‌తో పాటు ఆర్థిక ప‌ర‌మైన ఒత్తిళ్లు ఉండ‌వు గ‌నుక ఇలాంటి నేపో కిడ్స్ కొంత కాలం ప‌రిశ్ర‌మ‌లో స‌ర్వైవ్ అవ్వ‌డం పెద్ద మ్యాట‌ర్ కాదు కానీ, అన్ని సంద‌ర్భాలు అంద‌రికీ ఒకేలా వ‌ర్క‌వుట్ అవ్వ‌వు అన‌డానికి చాలా ఉదాహ‌ర‌ణ‌లు ఉన్నాయి.




 


ఇటీవ‌లి కాలంలో నేపో కిడ్ అన‌న్య పాండే కెరీర్ లో, లైఫ్ జ‌ర్నీలో ఏం జ‌రుగుతోంది? ప్ర‌స్తుతం ఆశించిన‌న్ని ప్రాజెక్టులు చేతిలో ఉన్నాయా? అంటే దీనికి స‌రైన జ‌వాబు చెప్ప‌లేని ప‌రిస్థితి. సీనియ‌ర్ న‌టుడు చంకీ పాండే కుమార్తెగా అన‌న్య అంద‌రికీ సుప‌రిచితం. అయితే ఈ భామ కెరీర్ ఆశించిన విధంగా షేప‌ప్ అవ్వ‌లేదు. ఇటీవ‌ల సినిమాలు లేవు.. క్రేజీ ఆఫ‌ర్లు అయితే లేవు.. కెరీర్ ఏమ‌వుతోంది? అన్న బెంగ‌తో ఉంది అన‌న్య‌. దీనికి తోడు ల‌వ్ లైఫ్ లోను ఈ బ్యూటీ ప‌డే పదే విఫ‌ల‌మ‌వుతోంది. ఇంత‌కుముందు కార్తీక్ ఆర్య‌న్ తో, మ‌ధ్య‌లో షాహిద్ క‌పూర్ సోద‌రుడు ఇషాన్ ఖ‌ట్ట‌ర్ తో ప్రేమాయ‌ణం సాగించిన అన‌న్య‌, ఆ త‌ర్వాత ఆదిత్యారాయ్ క‌పూర్ తో మూడేళ్ల సుదీర్ఘ కాలం డేటింగ్ చేసి విడిపోయింది. ఈ ప‌రిణామాల‌ను బ‌ట్టి అన‌న్య పాండే వ్య‌క్తిగ‌త జీవితంలోను సంతోషంగా లేన‌ట్టు క‌నిపిస్తోంది.




 


అయితే కాలంతో పాటే మార్పు. ఈ బ్యూటీ ఇటీవ‌ల మారిన అమ్మాయి. పూర్తిగా భ‌క్తి - ఆధ్యాత్మిక‌త‌లో త‌న‌లోని కొత్త వ్య‌క్తిని క‌నుగొంది. జీవితంలో ఒక కొత్త అధ్యాయాన్ని ప్రారంభించింది. ఇంకా చెప్పాలంటే మాన‌సికంగా ప్ర‌శాంత‌త కోసం వెతుకుతోంద‌ని చెప్పాలి. కొద్దిరోజులుగా అన‌న్య పాండే ఇన్ స్టా పోస్టుల‌ను ప‌రిశీలిస్తే, ఇందులో ఎక్కువ‌గా ఆధ్యాత్మిక భావాల్ని హైలైట్ చేసే ఫోటోషూట్లు క‌నిపిస్తున్నాయి. ఒక‌ప్ప‌టితో పోలిస్తే గ్లామ‌ర‌స్ స్టిల్స్ స్థానంలో నుదుటి నిండా విభూది బొట్లు పెట్టుకుని శివ‌నామ జ‌పం చేస్తూ లేదా కుంకుమ బొట్టు పెట్టుకుని, వినాయ‌కుడు, విష్ణు పూజ‌లు ఆచ‌రిస్తూ క‌నిపిస్తోంది.




 


లైగ‌ర్ కొట్టిన దెబ్బ‌:

అనన్య పాండే కెరీర్ ప్రస్తుతం కాస్త నెమ్మదించిందనేది నిజం. లైగర్ భారీ ఫ్లాప‌య్యాక ఆశించిన పెద్ద సినిమాలేవీ త‌న‌కు ద‌క్క‌లేదు. ఈ సినిమా ఫ్లాప‌వ్వ‌డం ఈ క్యూట్ బ్యూటీ కెరీర్‌పై ప్రభావం చూపింది. ప్రస్తుతం త‌న‌ చేతిలో గతంలో ఉన్నంత భారీ ప్రాజెక్టులు లేవు. అగ్ర హీరోల‌తో సినిమాలేవీ లేవ్. అప్ క‌మ్ హీరోల‌తో స‌రిపెట్టుకోవాల్సి వ‌స్తోంది. అలాగ‌ని పూర్తిగా ఖాళీగా ఏమీ లేదు. కొన్ని వెబ్ సిరీస్‌లు, ఓటీటీ ప్రాజెక్టులపై దృష్టి పెడుతోంది. కానీ స్టార్ హీరోయిన్ స్టేటస్ దక్కించుకోవడానికి కావాల్సిన `బ్లాక్ బస్టర్ హిట్` కోసం ఆమె ఇంకా ఎదురుచూస్తోంది.




 


ఆ ర‌కంగా ఫాలోయింగ్ ఓకే

అయితే సినిమాలు లేక‌పోయినా నేపో కిడ్ కావ‌డంతో కొన్ని ప్రక‌ట‌న‌ల్లో న‌టించే అవ‌కాశం ద‌క్కుతోంది. సామాజిక మాధ్య‌మాల్లో ఫాలోయింగ్ బాగానే ఉంది గ‌నుక ప్ర‌క‌ట‌న‌లు చేసేందుకు అవ‌కావాలొస్తున్నాయి. అయితే మునుపటి రేంజ్ లో గ్లామర్, క్రేజ్ తగ్గడం అన‌న్య‌ కెరీర్‌కు మైనస్ అవుతోంది. ప్ర‌స్తుతానికి అన‌న్య మారే ద‌శ‌లో ఉంది. కెరీర్ పరంగా తనను తాను మళ్ళీ నిరూపించుకోవడానికి ప్రయత్నిస్తూనే, మరోవైపు ఆధ్యాత్మికత ద్వారా ప్రశాంతతను వెతుక్కుంటోంది. రాబోయే సినిమాలు, వెబ్ సిరీస్ లు సక్సెస్ అయితే తప్ప మళ్ళీ ఫామ్ లోకి రావడం కష్టమే అని విశ్లేషకులు భావిస్తున్నారు. మేలో రిలీజ్ కానున్న చాంద్ మేరా దిల్ త‌న కెరీర్ కి బిగ్ బ్రేక్ ఇస్తుందేమో చూడాలి.

Tags:    

Similar News