డిసెంబర్ 24నే 'శంబాల'.. నైజాంలో ప్రీమియర్స్ టైమింగ్స్ ఇవే!

ఇక్కడ లోకల్ గా కూడా సినిమాను ఆడియెన్స్ కు ముందుగానే చూపించడానికి రెడీ అయ్యారు. అడ్వాన్స్ బుకింగ్స్ లో కూడా మంచి బజ్ కనిపిస్తోంది.;

Update: 2025-12-23 07:55 GMT

టాలీవుడ్ యంగ్ హీరో ఆది సాయికుమార్ తన 25వ సినిమా 'శంబాల'తో ఒక డిఫరెంట్ అటెంప్ట్ చేశారు. రెగ్యులర్ కమర్షియల్ ఫార్ములాను పక్కన పెట్టి, ఒక మిస్టికల్ థ్రిల్లర్ జోనర్ ను ఎంచుకోవడం నిజంగా సాహసమే. అయితే ఈ సాహసం వెనుక సినిమా కంటెంట్ మీద ఉన్న నమ్మకం క్లారిటీగా కనిపిస్తోంది. ప్రభాస్, నాని లాంటి స్టార్స్ సపోర్ట్ తో సినిమాకు ఆల్రెడీ మంచి బజ్ క్రియేట్ అయ్యింది.



 


సాధారణంగా ఒక సినిమా మీద పూర్తి నమ్మకం ఉంటేనే నిర్మాతలు ప్రీమియర్స్ వేయడానికి ముందుకు వస్తారు. ఆడియెన్స్ మౌత్ టాక్ సినిమాను నెక్స్ట్ లెవెల్ కు తీసుకెళ్తుందని వారు భావిస్తుంటారు. ఇప్పుడు 'శంబాల' టీమ్ కూడా అదే స్ట్రాటజీని ఫాలో అవుతోంది. ఓవర్సీస్ లోనే కాదు, ఇక్కడ లోకల్ గా కూడా సినిమాను ఆడియెన్స్ కు ముందుగానే చూపించడానికి రెడీ అయ్యారు. అడ్వాన్స్ బుకింగ్స్ లో కూడా మంచి బజ్ కనిపిస్తోంది.



 


అసలు విషయం ఏంటంటే.. ఈ సినిమా నైజాం ఏరియా ప్రీమియర్ షోల బుకింగ్స్ ఇప్పుడు ఓపెన్ అయ్యాయి. డిసెంబర్ 25న సినిమా రిలీజ్ అవుతుండగా, ఒక రోజు ముందే అంటే డిసెంబర్ 24వ తేదీ సాయంత్రమే హైదరాబాద్ లోని ప్రధాన థియేటర్లలో స్పెషల్ ప్రీమియర్స్ ప్లాన్ చేశారు. బుక్ మై షో, పేటిఎం వంటి ప్లాట్ ఫామ్స్ లో టికెట్స్ అందుబాటులోకి వచ్చాయి.

ముఖ్యంగా హైదరాబాద్ లోని పాపులర్ థియేటర్లయిన ఏఎంబీ సినిమాస్ లో రాత్రి 7:40 గంటలకు, ఏఏఏ సినిమాస్ లో రాత్రి 7:00 గంటలకు షోలు పడనున్నాయి. అలాగే ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య 70MM లో సాయంత్రం 6:45 గంటలకు, మైత్రి విమల్ థియేటర్ లో 7:17 గంటలకు, దిల్ సుఖ్ నగర్ లోని మైత్రి మేఘాలో రాత్రి 9:45 గంటలకు షోలు ఉండబోతున్నాయి.

టైమింగ్స్ కూడా చాలా వెరైటీగా 7:17 PM అని ప్లాన్ చేయడం ఆసక్తికరంగా ఉంది. దీన్ని బట్టి చూస్తుంటే మేకర్స్ సెంటిమెంట్స్ ని కూడా గట్టిగానే ఫాలో అవుతున్నట్లున్నారు. ఈ ప్రీమియర్స్ ద్వారా వచ్చే పాజిటివ్ టాక్, సోషల్ మీడియా రివ్యూలు సినిమా ఓపెనింగ్స్ కు ప్లస్ అవుతాయని టీమ్ భావిస్తోంది. థ్రిల్లర్ సినిమాలు థియేటర్ ఎక్స్ పీరియన్స్ ఇస్తాయి కాబట్టి, ఆడియెన్స్ కూడా ఆసక్తి చూపిస్తున్నారు. ఫైనల్ గా క్రిస్మస్ రేసులో 'శంబాల' తనదైన ముద్ర వేయడానికి సిద్ధమైంది. ఆది కెరీర్ లోనే హైయెస్ట్ బడ్జెట్ తో, హై టెక్నికల్ వాల్యూస్ తో తెరకెక్కిన ఈ సినిమా.. ప్రీమియర్స్ తోనే హిట్ టాక్ తెచ్చుకుంటుందేమో చూడాలి.

Tags:    

Similar News