పింక్ డ్రెస్ లో మెరిసిపోతున్న భాగ్యశ్రీ.. ఆ చిరునవ్వే హైలైట్!

టాలీవుడ్ లో ఇప్పుడు యూత్ క్రష్ ఎవరు అంటే ఠక్కున వినిపించే పేరు భాగ్యశ్రీ బోర్సే. తక్కువ టైమ్ లోనే తనకంటూ ఒక ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ను క్రియేట్ చేసుకుంది ఈ భామ.;

Update: 2025-12-23 09:30 GMT

టాలీవుడ్ లో ఇప్పుడు యూత్ క్రష్ ఎవరు అంటే ఠక్కున వినిపించే పేరు భాగ్యశ్రీ బోర్సే. తక్కువ టైమ్ లోనే తనకంటూ ఒక ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ను క్రియేట్ చేసుకుంది ఈ భామ. కేవలం సినిమాలతోనే కాకుండా సోషల్ మీడియాలో కూడా అమ్మడు చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ ఫొటోషూట్స్ తో నెటిజన్లను కట్టిపడేస్తుంటుంది.



 


సాధారణంగా హీరోయిన్లు గ్లామర్ షోతో ఆకట్టుకోవాలని చూస్తుంటారు. కానీ భాగ్యశ్రీ మాత్రం సంప్రదాయ బద్ధంగా కనిపిస్తూనే మోడర్న్ టచ్ ఇవ్వడంలో దిట్ట. లేటెస్ట్ గా ఆమె తన ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేసిన కొన్ని ఫొటోలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈ ఫొటోల్లో ఆమె అందం చూసి కుర్రకారు ఫిదా అవుతున్నారు.



 


ఈ లేటెస్ట్ ఫొటోల్లో భాగ్యశ్రీ పింక్ కలర్ డిజైనర్ వేర్ లో మెరిసిపోతోంది. "ఒక అమ్మాయి పింక్ తో ప్రేమలో పడితే, ఆమె గుండె నవ్వుతుంది" అనే క్యాప్షన్ తో ఆమె ఈ ఫొటోలను షేర్ చేసింది. ఆ డ్రెస్ కు తగ్గట్టుగా సింపుల్ జ్యువెలరీ, చెవికి చిన్న కమ్మలు పెట్టుకుని చాలా క్లాసీగా కనిపిస్తోంది. ముఖ్యంగా ఆమె తల నిమురుకుంటూ నవ్వుతున్న స్టిల్ అయితే చాలా క్యూట్ గా ఉంది.



 


మరో ఫొటోలో దుపట్టాతో ఆడుకుంటూ, వెనక్కి తిరిగి చూస్తున్న చూపులు ఎవరినైనా కట్టిపడేసేలా ఉన్నాయి. బ్యాక్ గ్రౌండ్ లో బ్లూ లైటింగ్, ఆమె వేసుకున్న పింక్ డ్రెస్ కాంబినేషన్ ఫొటోలకు కొత్త కళను తీసుకొచ్చింది. గ్లామర్ అంటే కేవలం ఎక్స్ పోజింగ్ కాదని, ఇలా నిండుగా ఉంటూనే కిల్లింగ్ లుక్స్ ఇవ్వొచ్చని ఆమె నిరూపిస్తోంది. ఆ నవ్వులోనే ఏదో మ్యాజిక్ ఉందని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ముంబై నుంచి వచ్చినా కూడా అచ్చమైన తెలుగు అమ్మాయిలా కనిపించడం భాగ్యశ్రీ స్పెషాలిటీ. ఈ పింక్ డ్రెస్ లో ఆమెను చూస్తుంటే ఏదో బాపు బొమ్మలా అనిపిస్తోంది. సోషల్ మీడియాలో ఈ పిక్స్ కు లైకుల వర్షం కురుస్తోంది.



 


ఇప్పటికే లక్షకు పైగా లైక్స్ వచ్చాయంటే ఆమె క్రేజ్ ఏ రేంజ్ లో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇక భాగ్యశ్రీ బోర్సే అటు సినిమాల్లోనూ, ఇటు సోషల్ మీడియాలోనూ దూసుకుపోతోంది. అందం, అభినయం రెండు ఉన్న ఇలాంటి హీరోయిన్ టాలీవుడ్ కు దొరకడం ప్లస్ పాయింట్. రాబోయే రోజుల్లో స్టార్ హీరోల సినిమాల్లో ఆమె మరిన్ని అవకాశాలు అందుకోవడం ఖాయం అనిపిస్తోంది.

Tags:    

Similar News