2020లో కిరాక్ సాంగ్స్.. లిస్ట్ ఇదే

Update: 2020-12-18 00:30 GMT
ఒక సినిమా విజయంలో కథ ఎంత కీలకమో.. పాటలు కూడా అంతే ముఖ్యం. స్టోరీ, సాంగ్స్ రెండూ బాగుంటే.. ఆ సినిమాా బాక్సాఫీస్ ను దున్నేయడం ఖాయం. కథ కాస్త డల్ గా ఉండి.. పాటలు బాగున్నా సరే, ఆ మూవీ సక్సెస్ జాాబితాలో పడిపోతుంది. కానీ.. మ్యూజిక్ బ్యాడ్ అనే టాక్ వస్తే మాత్రం అది చిత్ర విజయంపై ఖచ్చితంగా ప్రభావం చూపుతుంది. అందుకే దర్శకుడు సంగీతపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటాడు. మ్యూజిక్ డైరెక్టర్ కూడా అల్టిమేట్ ట్యూన్స్ ఇవ్వడానికే ట్రై చేస్తుంటారు. అయితే.. వాటిల్లో కొన్ని మాత్రమే శ్రోతల మెప్పు పొందుతాయి. అందులో మరికొన్ని మాత్రమే గుర్తింపు దక్కించుకుంటాయి. ఇందులో కూడా ఇంకొన్ని మాత్రమే ప్రేక్షకుల మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోతాయి. జనం నోట్లో నానుతుంటాయి. నిత్యం ఎక్కడో ఒకచోట వినిపిస్తూ ఉంటాయి. ఈ ఏడాది యూట్యూబ్ లో జనాన్ని ఉర్రూతలూగించిన ఆ తెలుగు పాటలను ఫిల్టర్ చేసి.. టాప్-20 లిస్టును ఇక్కడ ఇస్తున్నాం. ఈ జాబితాపై మీరు కూడా ఓ లుక్కేయండి. మీ ఫేవరెట్ సాంగ్ ఏ ప్లేస్ లో ఉంది? ఎన్ని వ్యూస్ సాధించిందో కూడా తెలుసుకోండి.

‘బుట్ట బొమ్మ’కే ఫస్ట్ ప్లేస్..
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, పూజ హెగ్డే జంటగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన చిత్రం ‘అల వైకుంఠపురములో’. ఈ సినిమాలోని ప్రతీపాట విన్న శ్రోతలను, సినిమా చూసిన ప్రేక్షకులను విశేషంగా అలరించాయి. ఇందులోనూ ‘బుట్ట బొమ్మ’ అనే పాటకు ఎనలేని క్రేజ్ వచ్చింది. ఈ ఏడాది వచ్చిన తెలుగు పాటల్లో ఈ సాాంగ్ మొదటి స్థానంలో నిలిచింది. యూట్యూబ్‌ లో ఈ పాటకు 47,55,17,650 వ్యూస్ వచ్చాయి. అప్పటి వరకూ ఉన్న రికార్డుల తుడిపేసి సరికొత్త రికార్డు నమోదు చేసింది. రెండో స్థానం కూడాా ఈ చిత్రానికే దక్కింది. ఈ సినిమాలోని ‘రాములో రాముల’ వీడియో సాంగ్‌కి ముందు నుంచే ఎనలేని క్రేజ్ వచ్చింది. యూట్యూబ్‌లో ఈ సాంగ్ ను 26,48,19,155 మంది చూశారు.

నీలీ నీలీ ఆకాశం..
ప్రదీప్, అమృతా అయ్యర్ హీరోహీరోయిన్లుగా నటించిన చిత్రం ‘30 రోజుల్లో ప్రేమించడం ఎలా’ ఈ సినిమా నుంచి విడులైన ‘నీలి నీలి ఆకాశం’ అనే పాట సెన్సేషన్ క్రియేట్ చేసింది. యూట్యూబ్‌లో ఈ పాట ఇప్పటి వరకూ 21,09,44,047 వ్యూస్ రాబట్టి మూడో ప్లేస్ దక్కించుకుంది.

అలరించిన ఉప్పెన గీతం..
2020లో సంగీత ప్రియుల‌ను అమితంగా అల‌రించిన పాట‌ల్లో ‘నీ క‌న్ను నీలి స‌ముద్రం’ ఒక‌టి. ‘ఉప్పెన’ చిత్రంలోని ఈ పాటకు దేవిశ్రీ ‌ప్రసాద్ స్వరాలు సమకూర్చారు. అద్భుత‌మైన ఈ ఖ‌వ్వాలీ బాణీల‌కు త‌న మ‌ధుర‌మైన గాత్రంతో జావేద్ అలీ ప్రాణం పోశారు. శ్రీ‌మ‌ణి, ర‌ఖీబ్ ఆల‌మ్ అందించిన సాహిత్యం ఈ పాట‌ను మ‌రింత‌ ఆక‌ర్షణీయంగా మార్చేసింది. యూట్యూబ్ లో ఈ పాటను ఇప్పటి వరకూ 15,32,80,167 మంది వీక్షించారు.

ఐదో స్థానం కూడా బన్నీదే..
ఈ ఏడాది టాప్ 20 యూట్యూబ్ వ్యూస్ లో ఐదో పాట కూడా ‘అల వైకుంఠపురములో’ సినిమాలోనిదే. ‘సామాజ వరగమనా..’ అంటూ సిధ్ శ్రీరామ్ ఆలపించిన పాటను యూత్ తెగ ఎంజాయ్ చేశారు. ‘నీ కాళ్లను పట్టుకు వదలనన్నవి చూడే నా కళ్లు’ అంటూ ఇప్పటికీ ఆ పాటనున హమ్ చేస్తుంటారు. 14,90,33,616 యూట్యూబ్ వ్యూస్ తో ఈ పాట ఐదో స్థానంలో ఉంది.

వాటే బ్యూటీ..
నితిన్‌, రష్మిక జంటగా నటించిన చిత్రం 'భీష్మ'. వెంకీ కుడుముల ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఇందులోని 'వాటే వాటే.. వాటే బ్యూటీ' అంటూ మొదలయ్యే ఈ గీతానికి కూడా సంగీత ప్రియులనుంచి విశేష స్పందన లభించింది. ఈ పాటను 6,17,08,142 మంది యూట్యూబ్ లో చూశారు.

జనం మెచ్చిన ‘నక్కిలీసు గొలుసు’..
కరుణ కుమార్ దర్శకత్వంలో రక్షిత్, నక్షత్ర కీలక పాత్రలలో తెరకెక్కిన చిత్రం పలాస 1978. ఈ చిత్రానికి రఘు కుంచె స్వరాలు సమకూర్చారు. ఇందులోని ‘నాది నక్కిలీసు గోలుసు’ అనే హుషారైన పాట యువతను విశేషంగా ఆకట్టుకుంది. ఈ మాస్ సాంగ్ కు యువకులు తమదైన స్టెప్పులు వేశారు. టాప్ 20లో ఈ పాట ఏడో స్థానంలో నిలిచింది. యూట్యూబ్ లో 6,21,68,910 మంది వీక్షించారు.

ఆన్ లైన్లో ‘జాను సవారి’..
ప్రేమ్ కుమార్ దర్శకత్వంలో శర్వానంద్, సమంత, కీలక పాత్రలలో తెరకెక్కిన చిత్రం జాను. ఈ చిత్రానికి రాగోవింద్ వసంత సంగీతం అందించారు. ఈ సినిమాలోని ‘లైఫ్ అఫ్ రామ్’ పాట యువతను విశేషంగా అలరించింది. ఈ పాటను 60,136,821 మంది వీక్షించి ఎనిమిదో స్థానంలో నిలిపారు. అదేవిధంగా.. సాహిత్‌ మోత్‌కూరి దర్శకత్వంలో నందు, ప్రియాంక కీలక పాత్రలలో తెరకెక్కిన చిత్రం సవారి. సంగీతం శేఖర్ చంద్ర అందించారు. ఇందులోని ‘ఉండిపోవా..’ అనే పాట కూడా బాగా పాపులర్ అయ్యింది. ఈ పాటకు 53,131,071 వ్యూస్ రావడంతో తొమ్మిదో ప్లేస్ ఆక్రమించింది.

శ్రోతల మైండు కరాబు..
‘క‌రాబు మైండు క‌రాబు.. మెరిసే క‌రాబు.. నిల‌బ‌డి చూస్తావా రుబాబు..’ అంటూ తెలుగు రాష్ట్రాల్లో సంచ‌ల‌న సృష్టించింది మరో పాట. ‘పొగ‌రు’ మూవీ నుంచి వచ్చిన ఈ పాటను ఎవ‌రూ అంత తేలిగ్గా మ‌ర్చిపోలేరు. ఈ సాంగ్ 47,199,144 వ్యూస్ సాధించి టెన్త్ ప్లేస్ లో ఉంది.

11 - 20 పాటలివే..
సుబ్బు వేదుల దర్శకత్వంలో వచ్చిన రొమాంటిక్ థ్రిల్లర్ మూవీ రాహు. ఇందులో అభిరామ్ వర్మ, కృతి గార్గ్ నటించారు. ప్రవీణ్ లక్కరాజు సంగీతం అందించారు. ఇందులో ‘ఏమో ఏమో ఏమో..’ అంటూ మొదలయ్యే పాట కూడా శ్రోతలను అలరించింది. ఈ పాటకు 42 మిలియన్ వ్యూస్ వచ్చాయి.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చిత్రం ‘వకీల్ సాబ్’లోని ‘మగువా మగువా.. నీ సహనానికి సరిహద్దులు కనవా’ అంటూ సాగే అద్భుతమైన పాట ట్రెండింగ్ లో ఉంది. సిద్ శ్రీరామ్ ఈ పాటను అద్భుతంగా ఆలపించారు. థమన్ స్వరపరిచిన ఈ పాటను ఇప్పటి వరకూ 38 మిలియన్ల మంది వీక్షించారు. దీని తర్వాతి స్థానంలో మళ్లీ ‘అల వైకుంఠపురములో సినిమా నిలిచింది. ఇందులోని ‘ఓ మై గాడ్ డాడీ’ అనే సాంగ్ ను 37,243,011 మంది చూశారు.

సాయి ధరమ్ తేజ్, నభా నటేష్ తదితరులు నటించిన చిత్రం ‘సోలో బ్రతుకే సో బెటర్’ ఈ సినిమాలోని ‘హే ఇది నేనేనా..’ అనే పాటనున ఇప్పటి వరకూ 27,176,740 మంది వీక్షించారు. ఈ సినిమాకు ఎస్.ఎస్.థమన్ సంగీతం అందించారు.

‘ఉప్పెన’ సినిమాలో ఓ పాట కూడా నెటిజన్లను అలరించింది. ‘ధక్ ధక్ ధక్’ అనే పాటను 25,110,533 మంది చూశారు. ఈ యాక్షన్, రొమాంటిక్ మూవీలో పంజా వైష్ణవ్ తేజ్, కృతి శెట్టి, విజయ సేతుపతి తదితరులు నటించారు. దేవీశ్రీ ప్రసాద్ సంగీతం సమకూర్చారు.

నాని, సుదీర్ బాబు, నివేద థామస్, అదితి రావు హైదరి తదితరులు నటించిన ‘వి’ చిత్రంలోని ‘వస్తున్నా.. వచ్చేస్తున్నా..’ అనే పాటను 2,479,450 మంది చూశారు. ఇదే సినిమాలోని మరో పాట కూడా నెటిజన్లను అలరించింది. ‘మనసు మారే..’ అనే పాటను 15,865,134 మంది వీక్షించారు. సినిమాకి సంగీతం అమిత్ త్రివేది అందించారు. దర్శకుడు మోహన్ కృష్ణ ఇంద్రగంటి.

సాహిత్‌ మోత్‌కూరి దర్శకత్వంలో నందు, ప్రియాంక కీలక పాత్రలలో తెరకెక్కిన చిత్రం సవారి. సంగీతం శేఖర్ చంద్ర అందించారు. ఇందులోని ‘నీ కన్నులు నా దిల్ లో నాటు కున్నాయి..’ అనే పాట కూడా బాగా పాపులర్ అయ్యింది. ఈ పాటకు 1,95,23,611 వ్యూస్ వచ్చాయి.

శర్వానంద్ హీరోగా నటించిన ‘శ్రీకారం’ చిత్రంలోనూ ఓ పాట పాపులర అయ్యింది. ‘భలేగుంది బాలా..’ అనే పల్లవితో మొదలయ్యే ఈ పాట కూడా శ్రోతలను ఆకట్టుకుంది. ఈ పాటకు 1,35,18,844 వ్యూస్ వచ్చాయి. కిశోర్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ సినిమాకు.. మిక్కి జె.మేయ‌ర్ సంగీతం ఇచ్చారు.

టాప్ 20లో నిలిచిన ఆఖరి పాట నితిన్‌, రష్మిక నటించిన 'భీష్మ' మూవీలోనిది. శింగ్లెస్ ఆంథెం పేరుతో విడుదలయిన ఈ గీతానికి సంగీత ప్రియులనుంచి, మంది స్పందన లభించింది. ఈ పాటను 77,71,561 మంది వీక్షించారు.
Tags:    

Similar News