మే చివరి వరకు లాక్‌ డౌన్‌ లోనే టాలీవుడ్‌

Update: 2020-05-12 07:00 GMT
కేంద్ర ప్రభుత్వం లాక్‌ డౌన్‌ లో పలు సడలింపులు ఇచ్చిన నేపథ్యంలో దాదాపు రెండు నెలల తర్వాత పలు రంగాల్లో పనులు ప్రారంభం అయ్యాయి. అయితే సినిమా రంగంకు సంబంధించి షూటింగ్స్‌ మాత్రం ప్రారంభం కావడం లేదు. కొన్ని రాష్ట్రాల్లో సినిమాల పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్‌ కు సంబంధించిన  అనుమతులు వచ్చాయి. కాని తెలంగాణ ప్రభుత్వం మాత్రం ఇప్పటి వరకు సినిమా పరిశ్రమకు ఎలాంటి సడలింపు ఇవ్వలేదు.

తాజాగా ఈ విషయమై తెలంగాణ ఫిల్మ్‌ డెవలప్‌ మెంట్‌ కార్పోరేషన్‌ ఛైర్మన్‌ రామ్మోహన్‌ రావు మాట్లాడుతూ ప్రభుత్వం నుండి ఇప్పటి వరకు సినిమా పరిశ్రమకు సంబంధించి ఎలాంటి సడలింపులు ఇవ్వలేదు. సీఎం కేసీఆర్‌ గారు ఈనెల 15వ తారీకున రివ్యూ మీటింగ్‌ నిర్వహించనున్నారు. ఆ మీటింగ్‌ లో సినిమా పరిశ్రమకు సంబంధించిన విషయమై చర్చిస్తారని ఆశిస్తున్నాం. ఈ నెలాఖరు వరకు టాలీవుడ్‌ లో లాక్‌ డౌన్‌ సడలింపులు ఉండవంటూ చెప్పుకొచ్చాడు.

టాలీవుడ్‌ కు చెందినంత వరకు ఎలాంటి పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్‌ కూడా జరగడం లేదని ఆయన అన్నాడు. కేరళ.. తమిళనాడులో ప్రభుత్వం అనుమతులు వచ్చిన నేపథ్యంలో ఇక్కడ కూడా అనుమతులు ఇవ్వాలంటూ ఇటీవలే తలసానిని సినీ రంగానికి చెందిన వారు కలిసి విజ్ఞప్తి చేశారు. ఆ సమయంలో జూన్‌ వరకు ఓపిక పట్టాలంటూ తలసాని నిర్మాతలకు సూచించాడు. జూన్‌ మొదటి వారం నుండి టాలీవుడ్‌ లో కార్యకలాపాలు ప్రారంభం అయ్యే అవకాశం ఉంది.
Tags:    

Similar News