ఏఐని వాడేస్తున్నారు కానీ ఆ జాగ్ర‌త్త‌ల మాటేంటీ?

ఏఐ సినిమా మేకింగ్‌లో విప్ల‌వాత్మ‌క మార్పుల‌కు శ్రీ‌కారం చుట్ట‌బోతోంది. దీని వ‌ల్ల మేకింగ్ ఈజీ అవుతుంద‌ని గ‌త కొంత కాలంగా డిబేట్ జ‌రుగుతూనే ఉంది.;

Update: 2026-02-24 19:30 GMT

ఏఐ సినిమా మేకింగ్‌లో విప్ల‌వాత్మ‌క మార్పుల‌కు శ్రీ‌కారం చుట్ట‌బోతోంది. దీని వ‌ల్ల మేకింగ్ ఈజీ అవుతుంద‌ని గ‌త కొంత కాలంగా డిబేట్ జ‌రుగుతూనే ఉంది. అయితే ప‌ర్‌ఫెక్ట్‌గా కుదిరితేనే విజువ‌ల్స్ అనుకున్న దానికి మించి తెర‌పై ఆవిష్కృతం అవుతాయ‌ని, లేని ప‌క్షంలో మిస్ ఫైర్ అవుతాయ‌ని ముందు నుంచి ఓ చ‌ర్చ జ‌రుగుతూనే ఉంది. దీంతో ఏఐని వాడాలా వ‌ద్దా? అని చాలా మంది మేక‌ర్స్ ఆలోచిస్తున్నారు. కొంత మంది మాత్రం తెలియ‌కుండానే వాడేస్తున్నారు. కొంత మంది అడ్డంగా దొరికిపోతున్నారు.

ఏఐ టెక్నాల‌జీ వాడ‌కం ఇప్పుడు మెయిన్ స్ట్రీమ్ స్టార్ల క్రేజీ ప్రాజెక్ట్‌ల‌ వ‌ర‌కు వ‌చ్చేసింది. భారీ బ‌డ్జెట్‌ల‌తో నిర్మిస్తున్న సినిమాల‌కు కూడా ఏఐ టెక్నాల‌జీని ఇప్పుడు వాడేస్తున్నారు. తెలుగులో ఏఐ టెక్నాల‌జీ వాడ‌కం పెద్ద‌గా మొద‌లు కాక‌పోయినా త‌మిళంలో మాత్రం స్టార్ట్ చేసేస్తున్నారు. రీసెంట్‌గా విడుద‌ల చేసిన క‌మ‌ల్‌, ర‌జ‌నీల‌ క్రేజీ మ‌ల్టీస్టార‌ర్ ప్రోమోని విడుద‌ల చేసిన విష‌యం తెలిసిందే. నెల్స‌న్ దిలీప్‌కుమార్ డైరెక్ట్ చేస్తున్నాడు. రెడ్ జైంట్ మూవీస్ బ్యాన‌ర్‌పై యంగ్ హీరో ఉద‌య‌నిధి స్టాలిన్ అత్యంత భారీ బ‌డ్జెట్‌తో దీన్నినిర్మిస్తున్నాడు.

కొన్నేళ్ల విరామం త‌రువాత లెజెండ‌రీ యాక్ట‌ర్స్ క‌మ‌ల్‌, ర‌జ‌నీ క‌లిసి న‌టిస్తున్న భారీ మ‌ల్టీస్టార్ మూవీ కావ‌డంతో దీనిపై అంచ‌నాలు తారా స్థాయికి చేరుకున్నాయి. ఈ సంద‌ర్భంగా విడుద‌ల చేసిన అనౌన్స్‌మెంట్ ప్రోమోపై నెట్టింట విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి. ఈ ప్రోమోలోని కొన్ని షాట్స్ కోసం ఏఐ టెక్నాల‌జీని ఉప‌యోగించారు. అయితే ఆ సీన్స్‌కు ఏఐని వాడార‌ని క్లియ‌ర్ క‌ట్‌గా తెలిసిపోతోంది. దీంతో ఈ స్థాయిలో భారీ మ‌ళ్టీస్టార‌ర్ మూవీకి ఈ స్థాయి టెక్నాల‌జీని వాడుతున్నారా? అనే కామెంట్‌లు వినిపిస్తున్నాయి.

ఈ ప్రోమో కోసం కొన్ని షాట్స్ కోసం ఏఐ స‌హాయం తీసుకున్నారు. అవే ఇప్పుడు మిస్ ఫైర్ అయిన‌ట్టుగా తెలుస్తోంది. అంతే కాకుండా ప్ర‌ముఖ లెజెండ‌రీ యాక్ట‌ర్స్ ఇద్ద‌రు క‌లిసి చేస్తున్న భారీ మ‌ల్టీస్టార‌ర్‌, భారీ ప్రొడ‌క్ష‌న్ కంప‌నీ నిర్మిస్తున్న సినిమాకు ఏఐ టెక్నాల‌జీని వాడ‌టంలో త‌ప్పులేదు కానీ ప్రోమోలో దొర్లుతున్న త‌ప్పుల్నిటెక్నీషియ‌న్స్‌ రిమూవ్ చేయ‌లేక‌పోవ‌డం ఆశ్చ‌ర్యాన్ని, వారి ఆల‌స‌త్య‌వాన్ని తెలియ‌జేస్తోంద‌నే విమ‌ర్శ‌లు వినిపిస్తున్నాయి. భారీ సినిమాల‌కు ఈ స్థాయిలో నాసిరక‌మైన‌ టెక్నాల‌జీని వాడు తుండ‌టం స‌రికొత్త చ‌ర్చ‌కు తెర‌తీస్తోంది. ఇక‌పై అయినా భారీ సినిమాల‌కు ఇలాంటి త‌ప్పులు దొర్ల‌కుండా చూసుకుంటార‌ని అభిమానులు ఆశిస్తున్నారు. మ‌రి మేక‌ర్స్ ఆ జాగ్ర‌త్త‌లు తీసుకుంటారా? అన్న‌ది వేచి చూడాల్సిందే.

Tags:    

Similar News