SSMB28 లో ముగ్గురు హీరోయిన్స్.. సెంటిమెంట్ రిపీట్ ?

Update: 2023-02-21 22:00 GMT
స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు SSMB28 సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా గురించి రోజుకో వార్త బయటకు వస్తూ అభిమానుల్లో అంచనాలను మరింత పెంచుతోంది. ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కానీ షూటింగ్ ఆలస్యం అవ్వడం వల్ల సినిమా విడుదల తేదీ వాయిదా పడుతూ వస్తోంది. కొత్త రిలీజ్ డేట్ విషయంలో ప్రస్తుతం చర్చ జరుగుతోంది.

ఇదే సమయంలో సినిమాలోని నటీ నటుల వివరాల విషయంలో కూడా ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఇప్పటికే ఈ సినిమాలో హీరోయిన్లు గా పూజా హెగ్డే, శ్రీలీల నటిస్తున్నట్లు తెలిసిన విషయమే.

అయితే తాజాగా ఈ సినిమాలో బాలీవుడ్ హాట్ బ్యూటీ భూమి పడ్నేకర్ ను కీలక పాత్ర కోసం ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. లేడీ కానిస్టేబుల్ పాత్రకు గాను భూమి పడ్నేకర్ ను సంప్రదించారని.. ఆమె ఓకే చెప్పిందని తెలిసింది. సెకండ్ హాఫ్ లో వచ్చే ఈ కీలక పాత్ర ను భూమి పడ్నేకర్ తో చేయించి హిందీ ప్రేక్షకుల్లో కూడా సినిమా పై ఆసక్తి పెంచాలని మేకర్స్ భావించారట. అయితే దీనిపై ఇప్పటి వరకు ఎటువంటి అధికార ప్రకటన రాలేదు.

ఇప్పటికీ ఈ సినిమాలో హీరోయిన్ గా ఇద్దరు తారలు నటిస్తూ ఉండగా.. ఇప్పుడు మరో హీరోయిన్ భూమి పడ్నేకర్ ను కూడా తీసుకున్నారు అనే వార్తలు బయటకు రావడంతో మహేష్ బాబు ఫ్యాన్స్ లో ఆసక్తి మరింత పెరిగింది.

ఇకపోతే మహేష్ బాబు చివరిసారిగా బ్రహ్మోత్సవం సినిమాలో ముగ్గురు హీరోయిన్లతో కలిసి నటించారు. ఈ చిత్రంలో కాజల్, సమంత, ప్రణీత మహేష్ సరసన కనువిందు చేశారు. ఈ సినిమా డిజాస్టర్ గా నిలిచింది.

అలానే త్రివిక్రమ్ చివరిసారిగా సన్నాఫ్ సత్యమూర్తి సినిమాలో ముగ్గురు హీరోయిన్లను చూపించారు. వీరిలో సమంత, నిత్యామీనన్, అదాశర్మ ఉన్నారు. అయితే ఈ చిత్రం సూపర్ హిట్ టాక్ అందుకుంది.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.

Similar News