చాంపియన్ భారాన్ని రోషన్ తట్టుకుంటాడా?
సాధారణంగా ఒక యంగ్ హీరోతో సినిమా అంటే నిర్మాతలు బడ్జెట్ విషయంలో చాలా కాలిక్యులేటెడ్ గా ఉంటారు.;
టాలీవుడ్ లోకి వారసులుగా ఎంట్రీ ఇవ్వడం ఈజీనే కావచ్చు, కానీ నిలదొక్కుకోవడం మాత్రం చాలా కష్టం. మొదటి సినిమాతోనే తమ టాలెంట్ ఏంటో ప్రూవ్ చేసుకుంటేనే ఇండస్ట్రీలో లాంగ్ రన్ ఉంటుంది. హీరో శ్రీకాంత్ తనయుడు రోషన్ మేక 'నిర్మల కాన్వెంట్', 'పెళ్లి సందడి' సినిమాలతో తానేంటో నిరూపించుకున్నాడు. కానీ అతన్ని స్టార్ లీగ్ లోకి తీసుకెళ్లే సరైన బ్రేక్ కోసం వెయిట్ చేస్తున్నాడు. ఇప్పుడు 'ఛాంపియన్' సినిమాతో ఆ అవకాశం అతని తలుపు తట్టింది.
సాధారణంగా ఒక యంగ్ హీరోతో సినిమా అంటే నిర్మాతలు బడ్జెట్ విషయంలో చాలా కాలిక్యులేటెడ్ గా ఉంటారు. మార్కెట్ ఎంత, రిటర్న్స్ ఎంత అని లెక్కలు వేసుకుని మరీ ఖర్చు పెడతారు. సేఫ్ జోన్ లో ఉండటానికే ఇష్టపడతారు. కానీ 'ఛాంపియన్' విషయంలో మాత్రం నిర్మాతలు ఆ రూల్స్ అన్నింటినీ బ్రేక్ చేశారని టాక్. రోషన్ మీద వాళ్లు పెట్టిన నమ్మకం చూస్తుంటే ఇండస్ట్రీ వర్గాలే ఆశ్చర్యపోతున్నాయి.
అసలు విషయం ఏంటంటే.. ఈ సినిమా బడ్జెట్ ఏకంగా 45 కోట్ల వరకు అయ్యిందట. న్యూ హీరో మీద దాదాపు 45 కోట్ల బడ్జెట్ పెట్టడం అంటే అది మామూలు విషయం కాదు. ఇదొక పెద్ద సాహసం అనే చెప్పాలి. కేవలం రోషన్ మార్కెట్ మీద ఆధారపడి ఇంత ఖర్చు పెట్టలేరు. అంటే కంటెంట్ మీద, రోషన్ పర్ఫార్మెన్స్ మీద మేకర్స్ కు అంత గురి ఉండి ఉండాలి.
ఇక్కడే రోషన్ భుజాల మీద పెద్ద బాధ్యత పడింది. కెరీర్ ఆరంభంలోనే ఇంత భారీ బడ్జెట్ సినిమా దొరకడం ఎంత అదృష్టమో, దాన్ని సక్సెస్ చేసి నిర్మాతలను గట్టెక్కించడం అంతే పెద్ద సవాలు. ఈ 47 కోట్ల బరువును రోషన్ తన నటనతో, స్టార్ డమ్ తో మోయగలడా అనేదే ఇప్పుడు అందరిలో ఉన్న ప్రశ్న. ట్రైలర్ లో అతని మేకోవర్, ఆ ఈజ్ చూస్తుంటే ఆ కాన్ఫిడెన్స్ కనిపిస్తోంది.
స్వప్న సినిమాస్ లాంటి ప్రతిష్టాత్మక సంస్థ ఈ ప్రాజెక్ట్ వెనుక ఉండటం రోషన్ కు పెద్ద అడ్వాంటేజ్. జాతిరత్నాలు, మహానటి, సీతారామం లాంటి క్లాసిక్స్ ఇచ్చిన బ్యానర్ కాబట్టి, వారు గుడ్డిగా డబ్బులు ఖర్చు పెట్టరు. కథలో దమ్ము, హీరోలో సత్తా ఉంటేనే ఇంత రిస్క్ చేస్తారు. వారి నమ్మకమే ఇప్పుడు రోషన్ కు అసలైన బలం. నాన్ థియేట్రికల్ బిజినెస్ ద్వారానే చాలా వరకు రికవరీ అయ్యే ఛాన్స్ ఉంది కాబట్టి, ఇది సేఫ్ గ్యాంబుల్ అనుకోవచ్చు.
ఏదేమైనా డిసెంబర్ 25న రోషన్ కెరీర్ కు ఒక బిగ్ టెస్ట్ జరగబోతోంది. ఈ సినిమా కనుక బాక్సాఫీస్ దగ్గర క్లిక్ అయితే రోషన్ రేంజ్ ఎక్కడికో వెళ్లిపోతుంది. యంగ్ హీరోల లిస్టులో టాప్ ప్లేస్ కి వెళ్లే గోల్డెన్ ఛాన్స్ ఇది. మరి ఈ 47 కోట్ల నమ్మకాన్ని రోషన్ ఎలా నిలబెట్టుకుంటాడో, 'ఛాంపియన్'గా ఎలా నిలుస్తాడో చూడాలి.