ఎంటర్టైన్మెంట్ కింగ్ మాట వింటారా? లేక రిస్క్ చేస్తారా?
నిజానికి శ్రీవిష్ణు లీడ్ రోల్ లో హుస్సేన్ షా కిరణ్ తెరకెక్కిస్తున్న ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ మృత్యుంజయ మూవీ ఫిబ్రవరి 27వ తేదీన రిలీజ్ కానున్నట్లు ఆ సినిమా మేకర్స్ కొద్ది రోజుల క్రితం ప్రకటించారు.;
ఎంటర్టైన్మెంట్ కింగ్.. అదేనండీ టాలీవుడ్ యంగ్ హీరో శ్రీవిష్ణు. వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న ఆయన.. వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. రీసెంట్ గా సంక్రాంతి కానుకగా విడుదలైన నారీ నారీ నడుమ మురారి మూవీలో క్యామియో రోల్ లో సందడి చేశారు. తక్కువ స్క్రీన్ టైమ్ ఉన్న పాత్రలో నటించినా.. తన యాక్టింగ్ తో మెప్పించారు.
ఇప్పుడు సోలో హీరోగా చేసిన సినిమాలతో సందడి చేసేందుకు సిద్ధమవుతున్నారు. అయితే సాధారణంగా ఇండస్ట్రీలో ఒకే ఏడాది రెండు చిత్రాలతో థియేటర్స్ లో రావడమే కష్టమవుతున్న రోజుల్లో.. ఇప్పుడు ఫిబ్రవరిలో రెండు మూవీలతో శ్రీవిష్ణు ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు తెలుస్తోంది. అదేంటి.. ఒకటే నెలలో ఒకే హీరో నటించిన రెండు సినిమాలెందుకు వస్తున్నాయనుకుంటున్నారా?
నిజానికి శ్రీవిష్ణు లీడ్ రోల్ లో హుస్సేన్ షా కిరణ్ తెరకెక్కిస్తున్న ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ మృత్యుంజయ మూవీ ఫిబ్రవరి 27వ తేదీన రిలీజ్ కానున్నట్లు ఆ సినిమా మేకర్స్ కొద్ది రోజుల క్రితం ప్రకటించారు. అప్పటికే ప్రమోషన్స్ కూడా స్టార్ట్ చేశారు. ప్రమోషనల్ కంటెంట్ కు అదిరిపోయే రెస్పాన్స్ రావడంతో సినిమా క్లిక్ అవుతుందనే అంచనాలు ఉన్నాయి. అదే సమయంలో శ్రీవిష్ణు యాక్ట్ చేస్తున్న మరో మూవీ సీన్ లోకి ఎంట్రీ ఇచ్చింది.
కింగ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ లీడ్ రోల్ లో నటిస్తున్న ఇంకో చిత్రం విష్ణు విన్యాసం. యదునాథ్ మారుతీ రావు దర్శకత్వంలో కామెడీ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఆ సినిమా.. కూడా ఫిబ్రవరి చివరిలో విడుదల కానున్నట్లు సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. మహా అయితే రెండు చిత్రాల విడుదల మధ్య వారం గ్యాప్ ఉండనున్నట్లు తెలుస్తోంది. దీంతో ఇది శ్రీవిష్ణుకు పెద్ద రిస్క్ అని చెప్పడంలో ఎలాంటి డౌట్ అక్కర్లేదు.
ఎందుకంటే ఒకే నెలలో, అది కూడా తక్కువ గ్యాప్ లో ఒకే హీరో నటించిన రెండు సినిమాలు రిలీజ్ అయితే అనేక ఇబ్బందులు ఎదురవుతాయి. రెండు వేర్వేరు జోనర్స్ లో రూపొందే చిత్రాలు అయినా కూడా ఆడియన్స్ కన్ఫ్యూజ్ అవుతారు. ఒక్క మూవీనే థియేటర్స్ లోకి వస్తే రిజల్ట్, మౌత్ టాక్ బట్టి వసూళ్లు వస్తాయి. కానీ రెండు రిలీజ్ అయితే.. వసూళ్లు డివైడ్ అయిపోతాయి. దీంతో చాలా ఇబ్బందులు ఉంటాయి.
అందుకే ఇప్పుడు శ్రీవిష్ణు ఏం చేస్తారన్నది హాట్ టాపిక్ గా మారింది. రెండు సినిమాలు రిలీజ్ అయితే రిస్క్ మాత్రం తప్పదు. కాబట్టి నిర్మాతలతో చర్చించి ఒక మూవీ డ్రాప్ అయ్యేలా చూసుకోవాలి. కానీ ఓటీటీ అగ్రిమెంట్ల వల్ల ఎవరూ తగ్గరని వార్తలు వస్తున్నాయి. అది నిజమైనా కాకపోయినా.. శ్రీవిష్ణు వెంటనే రంగంలోకి దిగి మేకర్స్ తో మాట్లాడుకోవాలి. కనీసం నెల గ్యాప్ లో అయినా రిలీజ్ అయ్యేలా ప్లాన్ చేసుకోవాలి. అది కాకుండా తక్కువ గ్యాప్ లోనే విడుదల అయితే నష్టం తప్పదేమో! మరేం జరుగుతుందో.. శ్రీవిష్ణు నిర్మాతలు ఏం చేస్తారో వేచి చూడాలి.