• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  డైరెక్టర్ విజన్‌ కు...

డైరెక్టర్ విజన్‌ కు ఫ్యామిలీ సపోర్ట్.. వంగా ఫార్ములా ఇదేనా?

| ముఖ్యంగా భారీ బడ్జెట్‌ తో తెరకెక్కే పాన్ ఇండియా సినిమాల విషయంలో దర్శకుడి ఆలోచనలను తెరపైకి తీసుకురావాలంటే, ఆయన వెనుక పనిచేసే టీమ్ కూడా అంతే స్ట్రాంగ్ గా ఉండాలి.

By - M Prashanth
Update: 2026-07-23 10:00 GMT

సినిమా అనేది ఒక్కరి కష్టం మాత్రమే కాదు.. ఒక స్ట్రాంగ్ టీమ్‌ వర్క్ రిజల్ట్ అని చెప్పడంలో ఎలాంటి డౌట్ అక్కర్లేదు. ముఖ్యంగా భారీ బడ్జెట్‌ తో తెరకెక్కే పాన్ ఇండియా సినిమాల విషయంలో దర్శకుడి ఆలోచనలను తెరపైకి తీసుకురావాలంటే, ఆయన వెనుక పనిచేసే టీమ్ కూడా అంతే స్ట్రాంగ్ గా ఉండాలి. ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా సందీప్ రెడ్డి వంగా తెరకెక్కిస్తున్న స్పిరిట్ సినిమా విషయంలో ఇదే చర్చకు వస్తోంది.

దర్శకుడిగా సందీప్ రెడ్డి వంగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్నారు. అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్, యానిమల్ వంటి సినిమాలతో తన కథ చెప్పే విధానం, రోల్స్ డిజైనింగ్ లో ప్రత్యేక శైలిని చూపించారు. ఆయన సినిమాల్లో ఎమోషన్స్, ఇంటెన్సిటీ, పాత్రలకు ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంటుంది. అలాంటి దర్శకుడు తన క్రియేటివ్ విజన్‌ ను ఎలాంటి ఆటంకాలు లేకుండా అమలు చేయాలంటే, నిర్మాణ పరంగా బలమైన సహకారం అవసరం అవుతుంది.

ప్రస్తుతం స్పిరిట్ సినిమా విషయంలో సందీప్ రెడ్డి వంగా సోదరుడు ప్రణయ్ రెడ్డి వంగా కీలక పాత్ర పోషిస్తున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. షూటింగ్ షెడ్యూల్స్ సక్రమంగా జరిగేలా చూడటం, టీమ్ మధ్య సమన్వయం, నిర్మాణ పనులపై నిరంతర పర్యవేక్షణ వంటి బాధ్యతలను ఆయన చూసుకుంటున్నారనే ప్రచారం జరుగుతోంది. దర్శకుడు ఒక సినిమాను తెరకెక్కించే సమయంలో ఎక్కువగా కథ, నటీనటుల నుంచి కావాల్సిన అవుట్‌ పుట్, టెక్నికల్ అంశాలపై దృష్టి పెడతారు. అదే సమయంలో నిర్మాణ వ్యవహారాలు కూడా సమర్థంగా నడవాలి.

ఆ రెండు బాధ్యతలు ఒకేసారి నిర్వహించడం పెద్ద సవాల్‌ తో కూడుకున్న విషయం. అందుకే దర్శకుడికి నమ్మకమైన వ్యక్తి అండగా ఉంటే సినిమా పనులు మరింత సాఫీగా సాగుతాయని టాక్ వినిపిస్తోంది. పెద్ద సినిమాల్లో టైమ్ మేనేజ్మెంట్ చాలా కీలకం. షూటింగ్ ఆలస్యం అయితే దాని ప్రభావం మొత్తం బడ్జెట్‌ పై కచ్చితంగా పడుతుంది. లొకేషన్స్, నటీనటుల కాల్‌ షీట్స్, టెక్నికల్ టీమ్ అందుబాటులో ఉండటం వంటి అంశాలు పక్కాగా ప్లాన్ చేయాల్సి ఉంటుంది.

ఇలాంటి విషయాల్లో ప్రణయ్ రెడ్డి వంగా పర్యవేక్షణ స్పిరిట్ కు ఉపయోగపడుతుందని చర్చ జరుగుతోంది. ఇక వంగా బ్రదర్స్ మధ్య ఉన్న కోపరేషన్ కూడా ఆసక్తిని పెంచుతోంది. ఒకవైపు సందీప్ రెడ్డి వంగా తనదైన శైలిలో సినిమాను తీర్చిదిద్దుతుంటే.. మరోవైపు ప్రణయ్ రెడ్డి వంగా నిర్మాణ పరమైన అంశాలను చూసుకుంటున్నారనే టాక్ వినిపిస్తోంది.

ఆ కాంబినేషన్ వల్ల దర్శకుడి విజన్‌ కు మరింత బలం చేకూరే అవకాశం ఉందని ఎక్స్పర్ట్స్ భావిస్తున్నారు. అయితే ప్రణయ్ రెడ్డి వంగా రోల్ పై మూవీ టీమ్ నుంచి అధికారిక సమాచారం రావాల్సి ఉంది. కానీ ప్రస్తుతం వినిపిస్తున్న వార్తలు మాత్రం స్పిరిట్ వెనుక కేవలం ఒక దర్శకుడి ఆలోచన మాత్రమే కాకుండా, దానికి స్ట్రాంగ్ టీమ్ సపోర్ట్ కూడా ఉందనే సిగ్నల్స్ ఇస్తున్నాయి. మరి సందీప్ వంగా ఫార్ములా ప్రభాస్ సినిమాను ఏ రేంజ్ కు తీసుకెళ్తుందో చూడాలి.

Tags:    
  • spirit 
  • prabhas 
  • sandeepreddyvanga 
  • tollywood 
  • panindianfilm 
  • spiritmovie 

Similar News

భారతీయ కథలకు ప్రపంచమే వేదిక!

2026-11-06 09:30 GMT

రామాయణం లిప్ సింక్.. ఏం మ్యాజిక్ చేశారబ్బా?

2026-11-06 09:19 GMT

శ్రీరాముడు కూడా 14 ఏళ్లే వనవాసం.. నాకు మాత్రం ఎందుకిలా..రేణు దేశాయ్ ఆవేదన..!

2026-11-06 09:18 GMT

ఈర్ష్య కాదు ప్రశంస.. కై పో చే ఫ్రెండ్స్!

2026-11-06 08:30 GMT

'సీన్' మూవీ రివ్యూ

2026-11-06 07:54 GMT

గార్జియస్ లుక్ లో అందరినీ తన వైపు తిప్పుకున్న శ్రీలీల.. ఔట్ఫిట్ తోనే మాయ చేస్తూ!

2026-11-06 07:51 GMT

రాజకీయాల నుంచి వెండితెరకు అసాధారణ ప్రయాణం!

2026-11-06 07:30 GMT

'సమ్మర్ హాలిడేస్' రివ్యూ

2026-11-06 07:23 GMT

ఫ్లాపుల తర్వాత రామ్ మాస్టర్ ప్లాన్.. 2027లో రెండు సినిమాల రిలీజ్‌కు రెడీ!

2026-11-06 06:30 GMT

సూర్యకు మళ్లీ 30 కోట్ల టార్గెట్

2026-11-06 05:49 GMT

కాజల్‌కు ఈ పార్ట్ 2 కష్టాలేంటి!

2026-11-06 05:49 GMT

కన్నుగీటుతూ కుర్రకారు గుండెల్లో గుబులు పుట్టిస్తున్న జాన్వీ కపూర్!

2026-11-06 05:45 GMT

Copyright @2026

Powered by Blink CMS