పేపర్ లీక్ పాత కథ.. సల్మాన్ ఖాన్‌కు తగిలిన రివర్స్ షాక్!
నీట్ పేపర్ లీకేజ్ వ్యవహారంతో దేశం అట్టుడుకుతోన్న సంగతి తెలిసిందే. విద్యార్దుల నిరసనలతో..సెలబ్రిటీల మద్దతుతో దేశం దద్దరిల్లిపోతుంది.
నీట్ పేపర్ లీకేజ్ వ్యవహారంతో దేశం అట్టుడుకుతోన్న సంగతి తెలిసిందే. విద్యార్దుల నిరసనలతో..సెలబ్రిటీల మద్దతుతో దేశం దద్దరిల్లిపోతుంది. విద్యార్దుల నిరసన విషయంలో తొలుత బాలీవుడ్ సెలబ్రిటీలంతా మౌనం వహించినా ఉద్యమం తీవ్ర రూపం దాల్చడంతో? బాలీవుడ్ సెలబ్రిటీలు మద్దతుగా రంగంలోకి దిగారు. హృతిక్ రోషన్, అమీర్ ఖాన్, షారుక్ ఖాన్ ఇలా టాప్ స్టార్లు అంతా సీన్ లోకి రావడంతో జంతర్ మంతర్ మండిపోతుంది. మూడు రోజులుగా నిరసనల జ్వాలలతో జంతర్ మంతర్ అట్టుడుకుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా సల్మాన్ ఖాన్ కూడా విద్యార్దులకు మద్దతు ప్రకటించారు.
అయితే సల్మాన్ విషయంలో మాత్రం సీన్ మద్యస్తంగా కనిపిస్తుంది. సల్మాన్ ఖాన్ మద్దతు పై ప్రశంసలతో పాటు విమర్శలు కూడా వ్యక్తమవుతున్నాయి. సోషల్ మీడియాలో సల్మాన్ ఖాన్ గత నేపథ్యాన్ని.. కుటుంబానికి సంబంధించిన పాత విషయాలను గుర్తు చేస్తూ నెటిజన్లు విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. ఇందుకు ప్రధాన కారణం రచయిత, సల్మాన్ ఖాన్ తండ్రి సలీమ్ ఖాన్. గతంలో సలీమ్ ఖాన్ ఓ పాత ఇంటర్వ్యూ లో తమ ఇంట్లో గణేశ్ అనే వ్యక్తికి తనకంటే ఎక్కువ మర్యాద ఇచ్చేవారని.. ఎందుకంటే? అతడు పరీక్ష పేపర్లు లీక్ చేసి ఇచ్చేవాడని సరదాగా వ్యాఖ్యానించారు.
అంతే కాదు ఆ లీకైన పేపర్లు తన చదువు కోసమేనని సల్మాన్ ఖాన్ స్వయంగా అప్పట్లో అంగీకరించిన విషయాన్ని నెటిజన్లు ఇప్పుడు తవ్వి తీస్తున్నారు. ప్రస్తుత కాలంలో విద్యార్థులు పరీక్షల పారదర్శకత కోసం, పేపర్ లీక్‌లకు వ్యతిరేకంగా రోడ్డెక్కి పోరాడుతున్న సమయంలో ఈ పాత ఉదంతం బయటకు రావడంతో సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున రచ్చ జరుగుతోంది. విద్యార్థుల భవిష్యత్తును నాశనం చేస్తున్న పేపర్ లీక్ వ్యవస్థపై గళం విప్పుతున్న సల్మాన్ ఖాన్ కుటుంబంలోనే గతంలో అలాంటి అనుభవాలు ఉండటం పట్ల నెటిజన్లు ఎద్దేవా చేస్తున్నారు. `సొంత ఇంట్లోనే పేపర్ లీక్ సంస్కృతిని ప్రోత్సహించి.. ఇప్పుడు విద్యార్థుల గురించి మాట్లాడటం ఎంత వరకు సమంజసం? అంటూ సెటైర్లు పేలుస్తున్నారు.
సెలబ్రిటీలు సామాజిక అంశాలపై స్పందించినప్పుడు గత జీవితంలోని సంఘటనలు సోషల్ మీడియాలో ఈ విరకంగా ఎదురుదెబ్బ తగలడం పరిపాటే. సల్మాన్ ఖాన్ విషయంలోనూ సరిగ్గా ఇదే పునరా వృత మైంది. సల్మాన్ మంచి ఉద్దేశంతో విద్యార్థులకు మద్దతుగా నిలిచినా? పాత వీడియోల వైరల్ ప్రభావం సల్మాన్ ప్రయత్నాన్ని కాస్త నీరుగారేలా చేస్తోంది. నెటిజన్లు మాత్రం ఈ అవకాశాన్ని వదలకుండా మీమ్స్, ట్రోల్స్‌తో హోరెత్తిస్తున్నారు.
ఈ పరిణామాలు సెలబ్రిటీల వ్యక్తిగత ..కుటుంబ నేపథ్యాలు వారు చేసే సామాజిక ప్రకటనలపై ఎంతటి ప్రభావం చూపుతాయో ? మరోసారి నిరూపించాయి. ఏ విషయమైనా? పబ్లిక్ ప్లాట్‌ఫారమ్‌లో మాట్లాడేటప్పుడు గత జ్ఞాపకాలు.. పాత ఇంటర్వ్యూలు ఏ విధంగా చుట్టుముడతాయో? ఈ ఉదంతం మరోసారి చూపించింది. సల్మాన్ ఖాన్ తీసుకున్న సానుకూల స్టాండ్ కాస్తా ట్రోల్స్ కారణంగా పూర్తిగా పక్కదారి పడుతోంది.