చంద‌మామ కెరీర్ ముగిసిన‌ట్లేనా?

కాజ‌ల్ అగ‌ర్వాల్ అలియాస్ చంద‌మామ టాలీవుడ్ కెరీర్ జ‌ర్నీ గురించి చెప్పాల్సిన ప‌నిలేదు.;

Update: 2026-02-06 06:18 GMT

కాజ‌ల్ అగ‌ర్వాల్ అలియాస్ చంద‌మామ టాలీవుడ్ కెరీర్ జ‌ర్నీ గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. రెండు ద‌శాబ్దాల ప్ర‌యాణంలో దాదాపు స్టార్ హీరోలంద‌రి స‌ర‌స‌న న‌టించింది. సీనియ‌ర్ హీరోల నుంచి త‌ర్వాత త‌రం సూప‌ర్ స్టార్ల వ‌ర‌కూ అంద‌ర్నీ క‌వ‌ర్ చేసిన న‌టి కాజ‌ల్.`ల‌క్ష్మీక‌ల్యాణం` నుంచి `క‌న్న‌ప్ప` వ‌ర‌కూ చంద‌మామ న‌టిగా ఒకే ర‌క‌మైన ఛ‌రిష్మాతో కొన‌సాగింది. టాలీవుడ్ లో అత్యంత వేగంగా స్టార్ లీగ్ లో చేరి న‌టిగాను కాజ్ ల్ ను చెప్పొచ్చు. ఒక్క సినిమా కాజ‌ల్ కెరీర్ లో వెన‌క్కి తిరిగి చూడ‌కుండా చేసింది. అదే `మ‌గ‌ధీర‌`. `ల‌క్ష్మీక‌ళ్యాణం`తో హీరోయిన్ గా లాంచ్ అయిన అమ్మ‌డు అప్ప‌టికే మ‌రో రెండు సినిమాలు చేసింది.

కానీ అవి ఆశించిన ఫ‌లితాలు సాధించ‌లేదు. అదే స‌మ‌యంలో ద‌ర్శ‌కుడు రాజ‌మౌళి దృష్టిలో పడింది. `మ‌గ‌ధీర‌`లో మిత్ర‌వింద పాత్ర‌తో తెలుగు ప్రేక్ష‌కుల గుండెల్లో చిర స్థాయిగా నిలిచిపోయింది. ఆ సినిమాలో హీరోగా న టించిన రామ్ చ‌ర‌ణ్ కు ఎంత పేరొచ్చిందో? మిత్ర వింద పాత్ర‌తో అంతే క్రేజ్ కాజ‌ల్ కు ద‌క్కింది. మిత్ర వింద పాత్ర‌తో ఎంతో మంది న‌టీమ‌ణుల‌కు స్పూర్తిగా నిలిచింది. న‌వ‌త‌రం న‌టీమ‌ణుల్లో సైతం స్పూర్తిని నింపిన రోల్ అది. హీరోయిన్ గా ఎలాంటి రోల్ పోషించాల‌ని అడిగితే? అంతా యువ‌రాణి మిత్ర‌వింద లాంటి పాత్ర ఒక్క‌టి చేసినా చాలా సంతోషంగా సినిమాల నుంచి రిటైర్మెంట్ తీసుకొవ‌చ్చు అని చెప్పిన వారెంతో మంది.

అంత‌గా ఆ పాత్ర ప్ర‌భావం హీరోయిన్ల‌పై ఉందన్న‌ది కాద‌న‌లేని నిజం. ఆ సినిమా బాక్సాఫీస్ వ‌ద్ద 100 కోట్ల వ‌సూళ్ల‌తో స‌రికొత్త రికార్డు సృష్టించింది. అప్ప‌టి నుంచి కాజ‌ల్ కెరీర్ లో వెన‌క్కి తిరిగి చూడ‌లేదు. స్టార్ హీరోలే టార్గెట్ గా సినిమాలు చేసింది. ఇత‌ర భాష‌ల్లో కూడా అవ‌కాశాలు మొద‌ల‌య్యాయి. త‌మిళ తో పాటు హిందీ అవ‌కాశాలు అందుకుంది. అయితే హిందీ కంటే కోలీవుడ్ లోనూ మంచి స‌క్సెస్ ను చూసింది. టాలీవుడ్ త‌రహాలోనే కోలీవుడ్ లోనూ అమ్మ‌డి జ‌ర్నీకి తిరుగు లేదు కొంత కాలం. ఇలా తెలుగు , తమిళ‌, హిందీ సినిమాల్లో న‌టిగా త‌న‌దైన ముద్ర వేసింది.

అటుపై వివాహం..పిల్ల‌లు పుట్ట‌డంతో పాటు కొత్త త‌రం హీరోయిన్ల నుంచి పోటీ పెరిగింది. దీంతో అవ‌కాశాలు త‌గ్గాయి. సెకెండ్ లీడ్స్ విష‌యంలోనూ వెన‌క‌డుగు వేయ‌లేదు. కాలంతో పాటు వ‌చ్చిన మార్పుగా స్వీక‌రించి వాటిలోనూ కొన‌సాగింది. ఐటం పాట‌ల్లోనూ స‌త్తా చాటింది. చివ‌రిగా `భ‌గ‌వంత్ కేస‌రి`లో హీరోయిన్ గా న‌టించింది. గ‌త ఏడాది రిలీజ్ అయిన `క‌న్న‌ప్ప‌`లో గెస్ట్ రోల్ పోషించింది. ఐదేళ్ల క్రితం నుంచే కెరీర్ డ‌ల్ గా సాగుతోంది. ఈ గ్యాప్ లో చేసిన రెండు చిత్రాలే అవి. ప్ర‌స్తుతం కాజ‌ల్ తెలుగులో సినిమాలు చేయ‌లేదు. దీంతో కాజ‌ల్ టాలీవుడ్ ప్ర‌యాణం ముగిసిన‌ట్లేనా? అన్న చ‌ర్చ ఫిలిం స‌ర్కిల్స్ లో తెర‌పైకి వ‌స్తోంది. బాలీవుడ్ లో మాత్రం `రామాయ‌ణం` స‌హా `ది ఇండియ‌న్ స్టోరీ`లో న‌టిస్తోంది.

Tags:    

Similar News